Full Style

>

గర్భిణులూ సెల్‌ మాట్టాడవద్దు

గర్భంతో భర్తకు దూరంగా ...పుట్టింట ఉండటం కాస్త కష్టమే. కానీ అంతా అయినవారు ఉన్నా మనసెరిగిన మారాజు చెంతనలేడన్న లోటు తీర్చుకునేందుకు పూర్వకాలంలో ఉత్తరాలు రాసుకుంటే ...ఇప్పుడు ఆ జంటల మధ్య దూరాన్ని తగ్గించే బాధ్యత సెల్‌ఫోన్లే తీసుకున్నాయని చెప్పాలి. దీంతో అదే పనిగా అవసరం ఉన్నా లేకున్నా సెల్‌ఫోన్లతో గర్భంతో ఉన్నవారు ఎక్కువగా తన భర్తతో మాట్లాడేస్తున్నారు.గర్భంతో ఉండే మహిళలు సెల్‌ ఫోన్‌తో ఎక్కువగా మాట్లాడితే పుట్టబోయే బిడ్డకు ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు పరిశో ధకులు. ఈ విషయమై కాలిఫోర్నియా, దక్షిణ కాలిఫోర్నియా లకు చెందిన శాస్త్రజ్ఞుల బృందం జరిపిన తాజా అధ్యయనంలో ఈ నిజం వెలుగు చూసినట్లు వెల్లడించారు. కాలిఫోర్నియాలో దాదాపు 30 వేల మంది చిన్నారులపెై వివిధ రకాల పరీక్షలు జరిపి, శోధించగా వారిలో 50శాతం మందికి పెైగా రేడియేషన్‌ ప్రభావానికి గురెైనట్లు తేలిందని తేల్చి చెప్పారు.

అందుకు కారణం ఆ బిడ్డల తల్లులు గర్భంతో ఉన్నప్పుడు ఎక్కువగా సెల్‌ఫోన్‌ వాడటమే ప్రధానంశంగా తేల్చి చెప్పారు. పుట్టగానే ఆ రేడియేషన్‌ ప్రభావం పెైకి కనిపించదని, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించినా వయసు పెరుగుతున్న కొలది అవలక్షణాలు బెైటకు వస్తున్నట్లు తాము గుర్తించినట్లు శాస్త్రవేత్తల బృందం స్పష్టం చేసింది. తల్లి గర్భంతో ఉన్నప్పుడు రేడియేషన్‌ ప్రభావానికి గురయ్యే చిన్నారులు 30 శాతంగా నమోదు కాగా... చిన్నారుల ముద్దు మాటలకు ముచ్చటపడి సెల్‌ ఫోన్లలో మాట్లాడించడం వల్ల 20 శాతం మంది రేడియేషన్‌ ప్రభావానికి గురవుతున్నారని, దీని వల్ల ఈ చిన్నారు లు ఏడేళ్ల వయసుకు వచ్చేసరికి వారి ప్రవర్తనలో అసాధారణ మార్పులు కల్గడమే కాకుండా ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఎదుర్కొంటున్నట్లు గమనించామని పరిశోధకులు చెబుతున్నారు.

గర్భిణులు నిరిష్టకాల పరిమితిలో అవసరానికి అనుగుణంగా మొబెైల్‌ వినియోగిస్తే తప్పుకాదని, రోజులో కావా ల్సిన వారితో మూడు, నాలుగుసార్లు సంభాషించుకో వచ్చని... అయితే అది కూడా నాలుగు నిమిషాలకు మించకుండా ఉండాలని, అంతకన్నా ఎక్కువ సేపు మాట్లాడితే పుట్టే బిడ్డపెై రేడియేషన్‌ ప్రభావం అధికంగా ఉండటం తధ్యమని హెచ్చరిస్తున్నారు. మరి పుట్టే పిల్లల భవిష్యత్‌ని తామే అంధ కారంగా మార్చకుండా...కొన్నాళెైనా సెల్‌ ఫోన్లకి దూరంగా ఉంటే మంచిదేమో? మీ సమాచారం కన్నా మీ బిడ్డ క్షేమం కూడా ముఖ్యమే కదా.

Post a Comment

0 Comments