పెదవులపై అశ్రద్ధవలదు సుమా....
ఆరంజ్ తొక్కల పొడికి కొద్దిగా ఉప్పు కలిపి దాంతో పళ్ళు తోముకుంటే ముత్యాల్లాగా మెరుస్తాయి.
ఉల్లిపాయను మెత్తగా నూరి చిగుళ్ళకు, పళ్ళకు మర్ధనా చేస్తే చిగుళ్ళ వ్యాధులు పోతాయి.
ఎక్కువ సేపు లిప్ స్టిక్ నిలిచి ఉండాలంటే రెండు సార్లు లిప్ స్టిక్ వేసుకుంటే సరి! ఒకసారి వేసుకున్నాక
టిష్యూపేపర్తో మృదువుగా అద్దాలి. తర్వాత మరో సారి వేసుకోవాలి.
ఎప్పుడు లిప్‌స్టిక్ వేసుకున్నా పడుకునేముందు, దాన్ని తొలగించి, పడుకోవడం మరచిపోకండి.
గ్లిజరిన్ నిమ్మరసం కలిపి పెదాలకు రాసుకుంటే మృదువుగా ఉంటాయి.
తేనె నిమ్మరసాల మిశ్రమాన్ని పెదవులకు రాస్తే పెదవుల నలుపు పోతుంది.
నొప్పిగా ఉన్న పంటిమీద చిన్న ఇంగువ ముక్కని వుంచితే ఫలితముంటుంది.
పళ్లు శుభ్రంగా, తెల్లగా ఉండాలంటే వారానికోసారి టేబుల్ సాల్ట్ తోగాని, బేకింగ్ సోడాతో గాని తోముకోవాలి.
పెదాలవల్ల మనకు ఏ ఇబ్బంది రాకుండా వుండాలంటే రోజూ రాత్రిపడుకునే ముందు మీగడగానీ, వెన్నగానీ,
వేజలైన్ గానీ, రాసుకుంటూ వుండాలి.
పెదాలు నల్లగా వున్నవారు రాత్రిళ్ళు పడుకునేముందు బీట్‌రూట్ రసం రాసుకుంటే మంచిది. పెదాలు ఎర్రగా
మారుతాయి.
పెదాలు పగిలితే తేనెలో వెన్న కలిపి రాసుకుంటే మంచి ఫలితం వుంటుంది.
బాదంపప్పు నూరి పడుకునే ముందు పెదాలపై మర్దనా చేసుకుంటే మంచిది. లిప్‌స్టిక్ వేసుకునే ముందు వేజలైన్ రాసి, దానిమీద లిప్‌స్టిక్ వేసుకుంటే పెదాలు పగలకుండా వుంటాయి. లిప్‌స్టిక్ వేసుకున్న తర్వాత లిప్‌లైనర్ వాడండి. దీనివల్ల లిప్‌స్టిక్ అటూ, ఇటూ అయినా మూతిచుట్టూ పరచుకోకుండా ఉంటుంది.
లిప్‌స్టిక్, వేజలైన్ కలిపి రాసుకుంటే పెదవులు కొత్త మెరుపును సంతరించుకుంటాయి. లిప్‌స్టిక్‌ను బ్రష్‌తో వేసుకోవడం ద్వారా ఆదా చేయవచ్చు. సహజమైన సన్ బ్లాక్ ఉన్న లిప్ బాం పెదవులకు వాడాలి.
చలి కాలంలో పెదవులు పొడిబారి చాలా ఇబ్బంది పెడతాయి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మృదువైన పెదాలు మీ
సొoతమవుతాయి.
పెదవులు తడారిపోతే చాలా మంది నాలుకతో తడి చేసుకుంటారు. పొడిబారిన చర్మాన్ని మునిపంటితో కొరకడం
కూడా చూస్తుంటాం. దీని వల్ల పెదాలు మరింతగా పొడిబారి చికాకు పెడతాయి.
పగిలిన పెదవులకు తరచూ పెట్రోలియం జెల్లీ రాసి మృదువుగా మర్దన చేయండి. తర్వాత శుభ్రమైన తడి వస్త్రంతో
కాస్త గట్టిగా రుద్దాలి. ఇలా చేస్తే పెదవులపై మృతుకణాలు తొలగిపోతాయి.
ఇప్పుడు మార్కెట్లో... బ్యూటపార్లర్లలో వాష్ క్లాత్ అని దొరుకుతుంది. ఇది ఒకరకంగా.. కాస్త బిరుసుగా ఉండే
టర్కీటవల్ మాదిరిగా ఉంటుంది. దీనితో చర్మం పై మృతకణాలు ఇట్టే తొలిగిపోయి మృదుత్వాన్ని
సంతరించుకుంటాయి.
శీతాకాలంలో లిప్‌స్టిక్ అందరికీ పడకపోవచ్చు. లిప్‌స్టిక్ తప్పనిసరి అయితే కనీసం తొందరగానైనా తీసేయాలి.
ఎందుకంటే అందులోని కొన్నిరకాల రసాయన పదార్ధాలు పెదవులను ఎండిపోయినట్లు చేస్తాయి.
లిప్‌జెల్ పెదవులను సున్నితంగా ఉంచడమే కాదు... మెరుపునూ ఇస్తుంది.
0 Comments