Full Style

>

డయేరియా

డయేరియా అనేది 0-5 సంవత్సరాల వయస్సుగల పిల్లల్లో వచ్చే వ్యాధి. డయేరియానే అతిసార వ్యాధి అంటారు. ఈ వ్యాధి లక్షణాలు నీళ్ళు ఎంత తాగినా దాహంగా ఉండడం. ఏడ్చినా కళ్ళలో నుండి నీళ్ళు రాకపోవడం. నాలుక ఎండిపోవడం, కళ్ళు లోపలికిపోవడం, నీరసంగా అవడం వంటివి. ఈ వ్యాధి డీహైడ్రేషన్‌ వల్ల వస్తుంది.

నిర్ధారణ పద్ధతులు:
Diaraడీహైడ్రేషన్‌ను అరికట్టాలంటే గంజి, కొబ్బరినీళ్ళు, మజ్జిగ, అంబలి, జావ, పప్పు నీళ్ళు, నిమ్మరసం వంటివి ఆహారంగా ఇవ్వడం వల్ల అరికట్టవచ్చు. పిల్లలకు లూజ్‌మోషన్స్‌ అవగానే ఇంట్లో లభించే ఫ్లూయిడ్స్‌ ని పైన చెప్పిన విధంగా ఇచ్చినట్లయితే ఫలితం ఉంటుంది. అలాగే ఓ.ఆర్‌.ఎస్‌.ను తగిన పద్ధతిలో కలిపి పిల్లలకు తాగించాలి.ఈ ఓ.ఆర్‌.ఎస్‌. ప్యాకెట్స్‌ అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ, అంగన్‌వాడీ కేండ్రాల్లో హర్బల్‌ హెల్త్‌ సెంటర్లలోనూ ఉచితంగా లభిస్తాయి. దీన్ని సరైన పద్ధతిలో కలపడం అవసరం. అంతేకాకుండా ఇంట్లో కూడా ఒ.ఆర్‌.ఎస్‌. తమారు చేసి పిల్లలకు ఇవ్వడం వల్ల కూడా ఈ లూజ్‌మెషన్స్‌ మరియు డీహైడ్రేషన్స్‌ తగ్గేలా చేయవచ్చు. ఒక లీటరు నీళ్ళలో ఒక పిడికెడు పంచదార చిటికెడు ఉప్పు వేసి ఇంటో ఒ.ఆర్‌.ఎస్‌. తయారు చేసుకోవాలి. డీహైడ్రేషన్‌ థెరపీ అనగా నీరు మొత్తంగా ఒకేసారి కాకుండా కొద్దికొద్దిగా స్పూన్‌తో తాగించడం.చిన్న పిల్లల్లో ఎక్కువగా అశుభ్రత, కలుషితమైన నీరు తాగడం, మట్టిలో ఆడడం, బయటచేసే అశుభ్రమైన ఆహారం తీనకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

Post a Comment

0 Comments