Full Style

>

స్పైనల్‌ స్టినోసిస్‌

మెదడు కింది భాగం నుంచి నడుం చివరి వరకు వెన్నుపాము వ్యాపించి ఉంటుంది. వెన్ను పాములో పైన ఎముక ఉంటే లోపల నరాలు ఉంటారుు. వెన్ను 33 పూసలుగా ఉంటే ఒకొక్క పూస మధ్య కందెన లాంటి డిస్క్‌లు ఉంటారుు. వెన్నెముకలు వెన్ను నిలబడటానికి బలాన్ని ఇవ్వడమే కాకుండా, లోపల ఉండే నరాలను జాగ్రత్తగా కాపాడుతుంటారుు. ఈ నరాలు మెదడు నుంచి ప్రారంభమై నడుం చివరి భాగం వరకూ వ్యాపించి, వరుసగా శరీరంలోని అన్ని అవసరాలకు రక్తం సరఫరా చేస్తుంటారుు. అందుేక భుజం పైన వెన్ను నరాలు దెబ్బతింటే భుజాల్లోంచి చేతుల్లోకి వెళ్ళే, కాళ్ళలోకి వెళ్ళే నరాల మీద ప్రభావం పడుతుంది. దీనిని క్వాడ్రిప్లీజియా అంటారు. నడుం కిందిభాగంలో నరాలు నలిగితే ఆ ప్రభావం కాళ్ళమీద పడుతుంది. దీనిని పారాప్లీజియా అంటారు. అలాగే డిస్క్‌ దెబ్బతిన్నా ఆ ప్రభావం నరాల మీద పడుతుంది. వెన్ను నరాల చుట్టూ ఉన్న వెన్నెముక దెబ్బతిన్నా ఆ ప్రభావం నరాలమీద పడుతుంది.

Spinaaవెన్నెముక మధ్యలో పైనుంచి కిందవరకు ఒక కాలువలా ఖాళీ ప్రదేశం ఉంటుంది. ఈ మధ్య ప్రదేశంలో నుంచి నరాలు వెళుతుంటాయి. ఈ నరాల కాలువ లేదా సై్పనల్‌ కెనాల్‌ ఏ కారణంగానైనా కొద్దిగా మూసుకొని నరాలకు ఇబ్బందిని కలిగిస్తే ఆ స్థితిని సై్పనల్‌ స్టినోసిస్‌ అంటారు. సాధారణంగా 60 సంవత్సరాల వయస్సు దాటిన వారిలో ఈ సమస్య కనిపిస్తుంది. కొంతమంది చిన్న వయస్సులో కూడా స్టినోసిస్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇది పుట్టుకతో వచ్చినది మాత్రం కాదు. ఈ సమస్యల వలన వెన్ను నొప్పి, కాళ్ళనొప్పి ఉంటుంది. ఇది నడక లాంటి వాటి వలన తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. మెడ వెనుక వెన్నుపాములను సరె్వైకల్‌ సై్పన్‌ అని, తరువాత భాగాన్ని థొరాసిక్‌సై్పన్‌ అని, ఆ తరువాత నడుం భాగంలో వ్యాపించిన వెన్ను పామును లాంబార్‌ సై్పన్‌ అంటారు. లాంబార్‌ సై్పన్‌ భాగంలోని వెన్నెముక, వెన్నులోపలి కెనాల్‌ మధ్య కొంత స్థలం ఉంటుంది.

కొన్ని కరణాల వల్ల ఈ స్థలం తగ్గుతుంది. వెన్ను లోపలి కాలువ చుట్టూ ఎముక, గట్టి లిగమెంట్స్‌ ఉంటాయి. నరాలకు ఇంకా ఎక్కుం స్థలం కావాలంటే మధ్యలో ఉన్న ఈ స్థలం ఎక్కువ కాదు. ఏ కారణంగానైనా ఈ కాలువ సన్నబడితే నరాలకు సరిపడా స్థలం ఉండదు. కనుక నరాలు నలగడం, గాయం కావడం జరగవచ్చు. ఇన్‌ఫెక్షన్లు, కంతులు, దెబ్బలు తగలడం హెర్నియేటెడ్‌ డిస్క్‌, ఆర్థరైటిస్‌, లిగ మెంట్స్‌ గట్టిపడి వెడల్పు కావడం, ఎముకలు పెరగడం, డిస్క్‌ డీ జెనరేషన్‌ వంటి కారణాల వల్ల వెన్నుపాము మధ్యలో నరాల కోసం ఉన్న కాలువ వెడల్పు తగ్గి స్పెషల్‌ స్టినోసిస్‌ ఏర్పడుతుంది.
అంతేకాకుండా వయస్సు పెరుగుతున్న కొద్దీ వెన్నుపూసలను కలిసి ఉంచే లిగమెంట్స్‌ గట్టిపడతాయి. వెన్నుపూసల మధ్య ఉండే (ఊ్చ్ఛ్ఛ్ట ఒౌజ్టీ) పెద్దది కావడం జాయింట్లలో బోన్‌ స్పర్స్‌ ఏర్పడటం కూడా స్టినోసిస్‌కు కారణం. స్టినోసిస్‌ వలన నొప్పి ఉంటుంది.

నరాలు సరిగ్గా పనిచేయవు. లోపల స్థలం తగ్గటం వలన వెన్నుపాముకు ఆక్సీజన్‌, రక్త సరఫరాలు తగ్గుతాయి. వెన్నుకు కావలసినంత ఎక్కువ రక్తాన్ని రక్తనాళాలు సరఫరా చేయలేకపోతాయి. ఈ కారణంగా నరాలు మొద్దుబారడం, నొప్పి కలగడం ప్రారంభమవుతాయి. కదిలే స్థలం తగ్గడంతో వెన్ను నరాల కదలికలు తగ్గుతాయి. దీని వలన నరాల్లో ఇరిటేషన్‌ ప్రారంభమవుతుంది. స్టినోసిస్‌ వెన్నుపాములోని ఏ భాగంలోనైనా రావచ్చు. కాకపోతే లంబార్‌ సై్పన్‌ ప్రాంతంలో ఎక్కువగా వస్తుంటుంది. స్టినోసిస్‌ వలన స్పర్శాపరమైన ఇబ్బందులు ఉంటాయి. నీరసం - నడుస్తున్నప్పుడు, నిల్చున్నప్పుడు కూడా ఎక్కువగా అవుతుంది. విశ్రాంతి తీసుకుంటే ఈ లక్షణాలు తగ్గుతాయి.

Untitlaమెదడు నుంచి శరీర భాగాలకు పంపే సంకేతాలు ఈ నరాల్లో జరిగే అలజడుల వలన దెబ్బతింటాయి. నొప్పి ఎప్పుడు ప్రారంభమైంది? దెబ్బ ఎక్కడ తగిలింది? ఒక చోట ప్రారంభమై ఇతర ప్రాంతాలకు వ్యాపి స్తోంది? ఏయే కారణాలతో నొప్పి ఎక్కువ అవుతున్నది? లేదా తక్కువ అవుతున్నదా? తదితర అంశాలను వైద్యులు అడుగుతారు.అలాగే మూత్రవిసర్జన, మల విసర్జనలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నాయా? తదితర ప్రశ్నలు కూడా అడుగుతారు. ఈ ప్రశ్నలకు బాధి తులు సమాధానాలు చెప్పిన తరువాత అవసరమైన పరీక్షలు చేయిస్తారు. వీటిలో ఎక్స్‌రే, ఎం.ఆర్‌.ఐ, సిఎటి స్కాన్‌ వంటి పరీక్షలు ఉంటాయి. నొప్పి ఎక్కువగా ఉంటే విశ్రాంతి మందులతో తగ్గుతుంది. లేని పక్షంలో శస్తచ్రికిత్స అవసరం కావచ్చు. ఎక్కువ కాలం స్టినోసిస్‌తో బాధపడుతుంటే శస్త్ర చకిత్స అవసరమవుతుంది.

మధుమేహం, అధిక రర్తపోటు వంటి సమస్యలు, వయస్సు వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని అవసరమైతే మినిమల్లీ ఇన్‌పేజివ్‌ సర్జరీ చేస్తారు. దీనిలో నడుము మీద చిన రంద్రం చేసి స్కోప్‌ను పంపి బైట స్క్రీన్‌ మీద చూస్తూ ఆపరేషన్‌ చేస్తారు. ఈ రకమైన శస్తచ్రికిత్స వలన ఎక్కువ కాలం ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం లేదు.

మెడ గాయాలు...
వెన్నుపాములో మెడ ప్రాంతంలో ఏడు పూసలుంటాయి. వీటిని సరె్వైకల్‌ వెర్టిబే అంటారు. తలని నిలపడానికి ఇవి తోడ్పడతాయి. ఈ ఏడింటిలో ఒక పూస దెబ్బతిన్నా ‘బ్రైకెన్‌నెక్‌’ అంటారు.యాక్సి డెంట్లలో గాయమై ఈ పూసలు దెబ్బతింటాయి. సాధారణంగా సరె్వైకల్‌ ఫ్రాక్చర్స్‌ ఎప్పుడవుతుం టాయంటే - ఫుట్‌బాల్‌ ఆటగాడు ప్రత్యర్థుల్ని తలతో ఎదుర్కోబోయినప్పుడు, హాకీ ఆటలో స్టిక్‌ తగిలినప్పుడు, పైనున్న బార్‌ని అందుకోబోయే జిమ్నాస్ట్‌ కిందపడ్డప్పుడు, రోడ్‌ యాక్సిడెంట్స్‌ జరిగినప్పుడు మెడలోని వెన్నెముక దెబ్బతినవచ్చు.వెన్నుపాము మెదడు కింది భాగం నుంచి శరీరమంతటికీ నరాల్ని తీసుకుంటూ వెళ్ళేది మెడలోంచే! మెడ ప్రాంతంలో వెన్నుపాము దెబ్బతింటే కాళ్ళు-చేతులూ పడిపోవచ్చు.

మరణం సంభవించవచ్చు. మెడలో వెన్నుపాము దెబ్బతింటే క్వాడ్రిప్లీజియా-కాళ్ళు చేతులు పడిపోవడం జరుగుతుంది.యాక్సిడెంట్‌ అయినప్పుడు ఎక్స్‌రే తీసి వైద్యుడు పరీక్షించే వరకూ మెడని కదిలించకూడదు. యాక్సిడెంట్‌ అయి సృహతప్పిన వాళ్ళలో మెడకి గాయమవడానికి అవకాశాలు ఎక్కువ. షాక్‌తో తాత్కాలిక లేక శాశ్వత పక్షవాతం రావచ్చు. మెడకి గాయమైనవాళ్ళు సృహలో ఉంటే చాలా బాధపడుతుంటారు. ఆ నొప్పి వాళ్ళలో మెడ నుంచి భుజాలలోకి, చేతులలోకి పాకుతుండవచ్చు. ఎందుకంటే లోపలి నరాల్ని వత్తుతుంటాయి కాబట్టి. మెడ వెనుక వాయవచ్చు. నరాల పనితీరు ఏమైనా దెబ్బతిన్నదా, ఎంతవరకు దెబ్బతిన్నది న్యూరాలజిస్ట్‌ అంచనా వేయగలరు. రేడియాలజిస్ట్‌ పరీక్షలు చేస్తారు. ఎమ్‌.ఆర్‌.ఐ., సిటి లాంటివి.

మెడలోని ఏడు వెన్నుపూసలు ఎలా దెబ్బతిన్నాయన్న దాని మీద చికిత్స ఆధారపడుతుంది. కొద్దిగా ఒత్తుకుంటే బ్రేస్‌ ధరిస్తే సరిపోతుంది. ఎముక మామూలుగా అయ్యేంతవరకు కాంప్లెక్స్‌ ఫ్రాక్చర్స్‌ అయితే ట్రాక్షన్‌, శస్తచ్రికిత్స, లోపల ఫిక్సేషన్‌ అవసరమవుతుంది. 2,3 నెలలు ఇందుకు పట్టవచ్చు. ఎథ్లెటిక్‌ ఎక్విప్‌మెంట్‌లో మెరుగుదల, రూల్స్‌ మార్చడంలో మెడగాయాలు తగ్గుతాయి.
కారు నడిపేటప్పుడు సీట్‌బెల్ట్‌ ధరించాలి. ఈతకి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆటలు ఆడేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

నడుము నొప్పి...
Untitaమామూలుగా చాలా మంది వెన్ను కిందిభాగంలో నొప్పితో బాధపడుతుంటారు. ఈ నొప్పి కొన్ని రోజులుండి తగ్గిపోవడంతో బాగా ఎక్కువగా చాలా కాలం ఉంటుంది.వెన్నెముక (నడుం)లో కిందిభాగంలో అయిదు వెన్నుపూసలుంటాయి. ఈ పూసల మధ్య లంబార్‌ డిస్క్‌‌స ఉం టాయి. ఇవి షాక్‌ అబ్జార్బర్లలా పనిచే స్తుంటాయి.లంబార్‌ సై్పన్‌ కదలడానికి తోడ్పడుతుంటాయి. వెన్నుపాములో వెళ్తున్న నరాలు ఈ ప్రాంతం లోంచే చీలి బయటి అవయవాల్లోకి వెళ్తుంటాయి. ఈ నరాలు మెనింజెస్‌ అనే డ్యూరల్‌శాక్‌లో ఉంటాయి. ఈ ప్రాంతం గుండా నరాలు ప్రయాణిస్తూ, సై్పనల్‌ ప్లూయిడ్‌తో ఉంటాయి. వెన్ను వెనుక భాగాన అధిక భాగాన్ని కవర్‌ చేస్తూ లిమినా అనే ఫ్లాట్‌ ఎముక ఉంటుంది.

పేసెట్‌ జాయింట్స సాధారణంగా వెన్నులో పక్కకి ఉంటాయి. ఇవే ఒక్కో వెన్నుపూసపైన, కింద పూసలతో కలిసి ఉండేట్టు చేస్తాయి. లామినాని అంటుకుని ప్రతి పూసలోనూ సై్పనస్‌ప్రొసెస్‌ ఉంటాయి. నడుం మీద తాకితే స్పర్శించేవి ఇవే నరాలు, డిస్క్‌లు లోపల ఉంటాయి. వాటికీ స్పర్థ సోకదు. ఎన్నో కండరాలు సై్పనల్‌ పాసస్‌ దగ్గరే కలుస్తాయి. చాలా కండరాలు వెన్ను చుట్టూ సమూహంగా ఉంటాయి. ఇవి వెన్ను పని చేయడానికి, కదలడానికి తోడ్పడతాయి.

నడుముకి గాయాలు...
మధ్య వయసులోని భాగాన్ని థొరాసిక్‌ ప్రాంతమంటారు. నడుము కింది భాగాన్ని లంబార్‌ ప్రాంతమంటారు. యాక్సిడెంటయినప్పుడు నడుములోని ఈ వెన్ను ప్రాంతాలు దెబ్బతింటాయి. ఈ ప్రాంతంలో గాయాలు ఆడవాళ్ళలో కన్నా మగవాళ్ళలో నాలుగురెట్టు ఎక్కువ.లక్షణాలు ఎలా ఉంటాయంటే కదలికల్లో ఒక మోస్తరు నుంచి తీవ్రమైన నొప్పి కలుగుతుంది. ఒక్కోసారి వెన్నుకి దెబ్బ తగలడంతో మొద్దుబారడం, టింగింగ్‌ సెన్సేషన్‌, నీరసం, బ్లాడర్‌-బవల్‌ సరిగ్గా పనిచేయకపోవడం లాంటి ఇబ్బందులు కలుగవచ్చు.
థొరాసిక్‌, లాంబార్‌ వెన్ను విరిగినప్పుడు శస్తచ్రికిత్స లేక బ్రేసింగ్‌ అవసరమవుతంది. తరచు రోగులకు భయపెట్టే గాయాలవుతుంటాయి.

ఆస్టియో పోరోసిస్‌, కంతులు లేక ఎముకలో ఇతర ఇబ్బదులు ఉంటే వెన్నెముక బలహీనమై ఫ్రాక్చర్స్‌ కలుగుతాయి.వెన్నెముక దెబ్బతింటు ఆ మనిషిని కదిలించవద్దు. ఎందుకంటే కదలికల వల్ల ఎక్కువ అపాయం జరగుతుంది రోగికి. దెబ్బలు తగిలినవాళ్ళని జాగ్రత్తగా ఎలా కదిలించాలో అలా కదిలించాలి.
హార్ట్‌రేట్‌, శ్వాస, ఇతర లక్షణాల్ని బట్టి వైద్యుడు వెన్నుకి దెబ్బ తగిలిందా? ఆ దెబ్బ ఎంత తీవ్రమైనది తెలుసుకుంటాడు. గాయానికి కారణమేమిటో తెలుసుకుని, లోపలి వెన్నెముక ఎలా దెబ్బతిందో తెలుసుకోవడానికి ఎక్స్‌రే తీయిస్తాడు. జరిగిదంతా ఆయనకు స్పష్టంగా చెప్పాలి.సై్పన్‌ బోర్డు మీద రోగిని కదలకుండా ఉంచి పరీక్షలు చేస్తాడు వైద్యుడు తలకి, ఛాతికి, పొట్టకీ, వీపుకి అయిన గాయాల్ని జాగ్రత్తగా పరిశీలిస్తాడు. చేతులు, కాళ్ళు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకుంటాడు. రిబ్స్‌ని పరీక్షిస్తాడు. నడుం కింది భాగంలో కండరాల్ని, నరాల పరీక్షల్ని నిర్వహిస్తారు.థొరాసిక్‌ లంబార్‌ సై్పన్‌ గాయాల్ని అయిదు రకాలుగా విభజించవచ్చు.

అవి - కంప్రెషన్స్‌ ఫ్రాక్చర్స్‌ యాగ్జియల్‌బరెస్ట్‌ ఫ్రాక్చర్స్‌, ఫ్లెక్సన్‌ / డిస్ట్రాక్షన్‌, ట్రాన్స్‌పర్స్‌ప్రాసెస్‌ ఫ్రాక్చర్స్‌, ఫ్రాక్చర్‌ డిస్లోకేషన్‌.వెన్ను ముందు భాగం పగిలి, వెనుకభాగం అలాగే ఉన్న ఫ్రాక్చర్‌ని కంప్రెషన్‌ ఫ్రాక్చర్‌ అంటారు. ఇలాంటి ఫ్రాక్చర్స్‌లో నరాలు దెబ్బతినవు.యాగ్జియల్‌ బరస్ట్‌ ఫ్రాక్చర్స్‌ వెన్ను ముందు, వెనుక కూడా ఎత్తు తగ్గుతుంది. ఎత్తు నుండి పడ్డప్పుడు వెన్ను ఇలా దెబ్బ తింటుంది.యాక్సిడెంట్స్‌లో ఓ నడుం పైభాగం పక్కకి నెట్టబడి కింది భాగం సీట్‌బెల్ట్‌ వల్ల అలాగే ఉంటుంది.ట్రాన్స్‌ఫర్స్‌ ప్రాసెస్‌ ఫ్రాక్చర్‌ నడుముకి పూర్తిగా పక్కకి నెట్టినప్పుడు జరుగుతుంది. ఫ్రాక్చర్స్‌ డిస్లోకేషన్‌లో ఎముక, మెత్తటి కణజాలాలకి అన్‌స్టెబుల్‌ ఇంజూరీ అవుతుంది.నరాలు, ఎముకలు సరిగ్గా ఉండేట్లు అవసరమైన చికిత్సని చేస్తారు.

కంప్రెషన్‌, కొన్ని బరస్ట్‌ ఫ్రాక్చర్స్‌ శస్తచ్రికిత్స లేకుండా చికిత్స చేస్తారు. చిన్న ఫ్రాక్చర్‌ అయితే బ్రేస్‌ తగిలించి 6 నుంచి 12 వారాలు విశ్రాంతి ఇవ్వాలి. నొప్పి తగ్గడానికి మందులు వేసుకుంటూ నడకలాంటి వ్యాయా మం చేయాలి.కొన్ని గాయాలకు శస్తచ్రికిత్స తప్పనిసరి. మెటల్‌ ప్లేట్‌, స్క్రూస్‌తో వెన్నెముక జాగ్రత్తగా పట్టి ఉండేట్లు శస్తచ్రికిత్స చేస్తారు.

వెన్నెముకలో ఫ్రాక్చర్‌..
విరిగినప్పుడు ఈ వెన్ను కింది ప్రాంతంలో నొప్పి వస్తుంటుంది. ఎక్కువకాలం వైబ్రేషన్స్‌కి లోనుకావడం, ధూమపానం లాంటి వాటివల్ల ఈ వెన్నునొప్పి వస్తుంటుంది. ఊబకాయం కూడా కారణమవుతుంది. పనిలో శరీరముండే భంగిమల్ని బట్టి, ఆహారం లాంటి వాటివల్ల ఇలా నొప్పి కలుగవచ్చు. పడుకున్నప్పుడు ఈ నొప్పి తగ్గినట్టు అనిస్తుంది. చాలా మంది రాత్రిళ్ళు మామూలుగానే నిద్రపోగలుగుతారు. ఒంగినప్పుడు, ఏవైనా తీసుకోబోయినప్పుడు ఈ నొప్పి ఎక్కువవుతుంది. వెనక్కి వంగినప్పుడు కొంతమందికి రిలీఫ్‌ కలుగ వచ్చు. కాళ్ళలోనూ నొప్పి కలుగవచ్చు. తొడల వెనుక భాగంలో ఈ నొప్పి ఎక్కువగా ఉంటుంది. పాదం లోకి వెళ్లే నొప్పిని సయాటికా అంటారు. దగ్గినా, చీదినా ఈ నొప్పి ఎక్కువవుతుంది. సమస్యని బట్టి చికత్స ఉంటుంది.

Post a Comment

0 Comments