ఈ మధ్యకాలంలో మలేరియా, డెంగ్యూ జ్వరాల
తీవ్రత పెరిగాక ప్లేట్‌లెట్లు అనే పదం చాలా ఎక్కువగా వినిపిస్తోంది.ఈ
జ్వరాల కారణంగా వీటి సంఖ్య విపరీతంగా పడిపోతే ప్రాణానికే ముప్పు
వాటిల్లవచ్చు. అందుకే ఆపదలో ఉన్న వారికి ఇవి వరంమనే చెప్పాలి. ఇంతకీ
ప్లేట్‌లెట్స్ అంటే ఎమిటీ? అసలు ఏ సందర్భాల్లో వీటిని ఒకరి నుండి మరొకరికి
ఎక్కించవలసి ఉంటుంది అన్న అనుమానాలు నివృత్తి చేయడానికి ప్లేట్‌లెట్లు
వివరాలు...
రక్తకణాలలో తెల్ల రక్తకణాలు, ఎర్ర రక్తకణాలు, ప్లేట్‌లెట్లు అనే మూడు రకాల మౌలిక కణాలు ఉంటాయి. ఈ మూడూ ఎముక మజ్జ (బోన్ మేరో) నుంచే ఉత్పత్తి అవుతాయి. తెల్ల రక్తకణాలు శరీరం రోగగ్రస్త్తం కాకుండా వ్యాధి నిరోధకాలుగా పనిచేస్తాయి. ఎర్రరక్తకణాల్లో హీమోగ్లోబిన్ ఉంటుంది. హీమోగ్లోబిన్ ద్వారానే శరీరం మొత్తానికి అవసరమైన ఆక్సిజన్ అందుతుంది.
ఇక మిగిలినవి ప్లేట్‌లెట్లు. శరీరానికి గాయం అయినప్పుడు రక్తం గడ్డకట్టడానికి తోడ్పడతాయి. ఇవి ప్రతి వ్యక్తిలోనూ ఒకేవిధంగా ఉండాలని లేదు. సాధారణంగా ఒక వ్యక్తిలో ఒకటిన్నర లక్షల నుంచి నాలుగున్నర లక్షల దాకా ఉంటాయి. పైగా ఇవి ఒక్కొక్కరోజు ఒక్కోలా ఉండవచ్చు. ప్లేట్‌లెట్ కణం జీవిత కాలం ఏడు నుంచిపది రోజుల దాకా ఉంటుంది. ఆ తర్వాత అవి చనిపోతాయి. ఎముక మజ్జలో ఏర్పడిన కొత్త ప్లేట్‌లెట్స్ మళ్లీ రక్తంలో చేరతాయి.
ప్లేట్‌లెట్ల విధుల్లో ముఖ్యమైనది రక్తస్రావాన్ని నివారించడం. శరీరానికి గాయమైనప్పుడు కాసేపు రక్తం స్రవిస్తుంది. ఆ తరువాత దానంతట అదే ఆగిపోతుంది. ఈ ప్రక్రియ వెనుక రక్తనాళం, ప్లేట్‌లెట్లు, రక్తం గడ్డకట్టే వ్యవస్థల (కోయాగులూషన్ సిస్టం) పాత్ర కీలకమైనంది.
ఏదైనా కారణం వల్ల ఈ పొరకు దెబ్బ తగిలితే రక్త ప్రసరణకు అంతరాయం ఏర్పడుతుంది. ఈ పరిస్థితిని నివారించేందుకు ప్లేట్‌లెట్‌లు సిద్ధమవుతాయి. కొన్ని ప్లేట్‌లెట్లు ఒకదానికి ఒకటి అతు క్కుపోయి గడ్డగా మారతాయి. ప్లేట్‌లెట్లకు తోడుగా రక్తం గడ్డకట్టే వ్యవస్థ నుంచి 'ఫిబ్రిన్' విడుదలవుతుంది.
ప్లేట్‌లెట్లు మరీ తక్కువగా ఉన్నప్పుడు ఏ గాయమూ లేకుండానే రక్త స్రావం అవుతుంది. ప్లేట్‌లెట్లు తమ విధిని సక్రమంగా నిర్వర్తించలేకపోతేరక్తస్రావం ఆగదు. దానికి ప్లేట్‌లెట్‌ల సంఖ్య తగ్గిపోవడం గానీ, ప్లేట్‌లెట్ల నాణ్యత తగ్గిపోవడం కానీ కారణం కావచ్చు.ప్లేట్‌లెట్లు నార్మల్‌గానే ఉన్నా రక్తస్రావం ఆగకపోవడానికి ఉన్న ప్లేట్‌లెట్లు నాణ్యంగా లేకపోవడమే కారణం . ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గడానికి కారణాలు...
ప్లేట్‌లె ట్ల ఉత్పత్తి తక్కువగా ఉండడం అందులో ఒకటి.
దీనికి ఎముక మజ్జ సరిగ్గా పనిచేయ
కపోవడమే కారణం. మళ్లిd ఎముక మజ్జ సరిగా పనిచేయకపోవడానికి పలు కారణాలున్నాయి. వాటిలో ఎముక మజ్జ బలహీనపడటం ఓ కారణం . కొందరిలో మజ్జ బాగానే పనిచేస్తూ ఉంటుంది, ప్లేట్‌లెట్‌ల ఉత్పత్తి బాగానే ఉంటుంది. కానీ, అవి క్షీణించే వేగం ఎక్కువగా ఉంటుంది. కొందరిలో బ్లడ్ క్యాన్సర్ వల్ల ఇలా క్షీణిస్తాయి.
ప్లేట్‌లెట్లు ఎందుకు తగ్గుతాయి?
ప్లేట్‌లెట్ ఉత్పత్తి తక్కువగా ఉండటానికి కొంతమందిలో పుట్టుకతోనే ఈ లోపాలుంటాయి. కొన్ని తరువాత వస్తాయి. కొన్నిసార్లు కొన్ని రకాల మందులు కూడా ఇందుకు కారణం అవుతాయి. గుండెకు సంబంధించిన వ్యాధులున్నవారు రక్తం పలచబడానికి వాడే మందులవల్ల కొందరిలో ప్లేట్లెట్ల సంఖ్య,నాణ్యత
కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది.
కొన్ని యాంటి బయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ వల్ల కూడా ప్లేట్‌లెట్లు తగ్గే ప్రమాదముంది. ప్లేట్‌లెట్లు తగ్గడంలో ఇన్ఫెక్షన్ల పాత్ర కూడా ఉంటుంది. వాటిలో డెంగ్యూ, మలేరియా, లెఎ్టోస్పైరోసిస్ వంటి వ్యాధుల్లో ఈ తరహా ఇన్‌ఫెక్షన్ల ప్రభావం ఎక్కువగా ఉంటోంది. ఎముక మజ్జలో క్షయ మొదలైనప్పుడు దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. మైలో డిస్‌ప్లేషియా అనే జబ్బులో కూడా ఎముక మజ్జ దెబ్బతిని ప్లేట్‌లెట్లు బాగా పడిపోతాయి.
ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గితే కనిపించే లక్షణాలు...
సాధారణంగా ప్లేట్‌లెట్ల సంఖ్య పది వేలకు తగ్గేదాకా ఏ లక్షణాలూ కనిపించవు. ఒక వేళ అంతకన్నా తక్కువకు పడిపోతే మాత్రం వివిధ శరీర అవయవాల్లోని లోపలి పొరల్లోంచి రక్తస్రావం మొదలవుతుంది. నోటి లోపలి పొర, చిగుళ్లు, ముక్కు లోపలి పొరల్లోంచి రక్త స్రావం కావచ్చు.
ప్లేట్‌లెట్లు తగ్గిన ప్రతి ఒక్కరిలోనూ ఆనారోగ్య లక్షణాలు కనిపించాలని లేదు. కొందరిలో ఏ లక్షణాలూ ఉండవు. డెంగ్యూ ఉన్నప్పుడు తీవ్ర జర్వం,ఉంటుంది. వ్యాధి లక్షణాలన్నీ ఉంటాయి. తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు ఉంటాయి. ప్లేట్‌లెట్లు బాగా పడిపోయినప్పుడు రక్త స్రావమూ కావచ్చు.
నోరు, ముక్కు నుంచి రక్తస్రావం, పేగుల్లోంచి రక్త స్రావం అయితే నల్లటి విరేచ నాలు కావడం వంటివి కనిపిస్తాయి రక్తస్రావం మొదలయ్యిందీ అంటే ఇక ప్లేట్‌లెట్లు ఎక్కించవలసిందే. రక్త స్రావమేది లేకపోతే పది వేలకు వచ్చేదాకా ప్లేట్‌లెట్లు ఎక్కించవలసిన అవసరం లేదు.
సరైన వ్యాధి నిర్ధారణ జరగాలి..
ప్లేట్‌లెట్ల సంఖ్య ఎందుకు తగ్గుతుంది అనే అంశంపై సరైన వ్యాధి నిర్ధారణ జరిగితే చికిత్స సులభం అవుతుంది. మలేరియా కారణంగా ప్లేట్‌లెట్లు పడిపోతే మలేరియాకే చికిత్స చేయాలి. ఏవైనా మందుల కారణంగా ప్లేట్‌లెట్లు పడిపోతూ ఉంటే వెంటనే ఆ మందులు మానేయాలి. మానేసిన వెంటనే ప్లేట్‌లెట్లు వాటికవే పెరుగుతాయి. ముందు కారణానికి చికిత్స చేస్తూ వెళ్లాలి. ఒకవేళ అప్పటికీ రక్త స్రావం ఉంటే ప్లేట్‌లెట్ల ను ఎక్కించాల్సి ఉంటుంది.
డెంగ్యూ వల్ల వచ్చే సమస్యలు-
వైరల్ ఇన్ఫెక్షన్‌లు వారం పదిరోజుల్లో నియంత్రణలోకి వస్తాయి. డెంగ్యూ జ్వరం తగ్గేలోపే కొందరిలో ప్లేట్లెట్ల సంఖ్య చాలా వేగంగా పడిపోతూ ఉంటుంది. చాలామంది ప్లేట్‌లెట్లు ఏ కాస్త తగ్గినా వెంటనే ప్లేట్‌లెట్లు ఎక్కించాలనే అభిప్రాయంలో ఉంటారు. అది సరికాదు. 10 వేల కన్నా తగ్గితే గానీ ప్రమాదం రాదు.
ఒకవేళ 10 వేల కన్నా ఎక్కువే ఉన్నా రక్తస్రావం ఉంటే మాత్రం ఎక్కించక తప్పదు. తగ్గిపోయిన ప్లేట్‌లెట్ కణాలను తిరిగి ఉత్పత్తి చేసుకునే శక్తి సహజంగానే శరీరానికి ఉంటుంది. అందుకే అత్యవసర సమయాల్లో మాత్రమే ప్లేట్‌లెట్స్ ఎక్కించాలి.

0 Comments