Full Style

>

శారీరక ఆరోగ్యానికి - త్రి ఫల చూర్ణం

శరీరంలోని కలుషిత విషతుల్యాలు చర్మ ఛాయపై ప్రమాద భరిత ప్రభావం చూపుతాయి. శారీరక వ్యవస్థకు ఇలాంటి పరిస్థితి ఎదురుకాకుండా సూక్ష్మమైన చిట్కాలను పాటిస్తే శరీరంలోని విషతుల్యాలను ప్రక్షాళన చేసేందకు దోహదపడతాయి.
ముఖం వర్చస్సుతో వెలిగిపోతూ ఉండాలని, చర్మం నిగనిగలాడుతూ ఎలాంటి లోపంలేకుండా నునుపుగా ఉండాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. ఇందుకుగాను ముందుగా శారీరకవ్యవస్థలోని కాలుష్య, విషతు ల్యాలను తొలగించడం ముఖ్యం. దీని వల్ల పౌష్టిక ఆహారం సులువుగా శరీరానికి పట్టి, ప్రభావవంతంగా చిట్కాలు పని చేస్త్తాయి. వ్యర్ధ పదార్థాలను శరీరంనుంచి విసర్జిం చడంలో త్రి ఫల చూర్ణం అద్భుతంగా పనిచేస్తుంది - ఉసిరి, కరక్కాయ, తాణికాయలలోని గింజలను తొలగించి ఎండిన కాయలను తిరగలి పెట్టి మెత్తగా చూర్ణం చెయ్యాలి. ప్రతి రోజూ రాత్రి సమయాలలో గోరు వెచ్చని నీటిలో అరచెంచాడు చూర్ణం కలిపి ఒక నెలరోజుల పాటు సేవించాలి. ఈ త్రిఫల చూర్ణం, అధికంగా ఎక్కువ రోజుల పాటు వాడితే శరీరం ఈ చూర్ణనికి అలవాటు పడిపోయే ప్రమాదం ఉంది. కరక్కాయ శక్తివంతమైన మూలికా ఔషధం . దీని ప్రభావం శరీరంపై బలంగా ఉంటుంది. ఐతే ఆహారం తీసుకోకుండా ఉండేవారు, బలహీనంగా ఉన్న వారు, శరీరం పొడిగా ఉండే వారు, గర్భణీ స్త్రీలు జీర్ణ సంబంధమైన ఇబ్బందులు ఉన్నవారికి కరక్కయ పడదు. త్రిఫల చూర్ణంగా కాక విడిగా కరక్కయను అజీర్ణ వ్యాధులకు, శ్వాస సంబంధ వ్యాధులు మొదలైన వాటికి వాడవచ్చు. కరక్కాయను బుగ్గన పెట్టుకొని రసం మిగడం వల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది. కరక్కాయతో కూడిన త్రిఫల చూర్ణం వాడు తున్నవారు ఒక పూట ఆహారంలో ఆవు నెయ్యి వేసుకొని తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. బుగ్గనపెట్టుకోవడం వల్ల పళ్ళు, చిగుళ్ళ, నోటిలో పుండ్లు తగ్గెందుకు బాగా పనిచేస్తుంది.
తీసుకోవలసిన జాగ్రత్తలు :
ఈ రకంగా తయారు చేసిన చూర్ణలు వాడడం వల్ల తక్షణ ఫలితం కనిపించదు. ఫలితం కనిపించేందుకు రెండు నుంచి ఆరు మాసాల సమయం పడుతుంది. ఈ రకమైన ఆయుర్వేద మందులు వాడే ముందు శరీర పరిస్థితికి సంబంధించిన విశ్లేషణ అవసరం .ఎందుకంటే ఆయుర్వేదం మందులన్నీ వ్యక్తిగత శరీర పరిస్థితి ఆధారంగా వాడవలసి ఉంటుంది.
హెచ్చరిక : ఆయా, ఆయుర్వేద చూర్ణాలు, మిశ్రమాల నాణ్యత తీరుపై ఎలాంటి విశ్లేషణా లేకుండా వైద్యంచేసే ఆయుర్వేద వైద్యుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

Post a Comment

0 Comments