గుండె రక్తనాళాల వ్యాధి లేదా కార్డియో వాస్కులర్ వ్యాధి
అనేది గుండె లేదా రక్త నాళాల (ధమనులు, సీరలు) వంటి వాటిలో ఏదైనా వ్యాధి
బారిన పడే తరగతికి చెందిన జబ్బు. చాలా దేశాలలో ఈ హృద్రోగాలు ఎక్కువగా
పెరుగుతున్నారుు. ప్రతీ సంవత్సరం గుండె జబ్బు, క్యాన్సర్ కంటే ఎక్కువగా
ప్రాణాలు తీస్తోంది. ఈ మధ్య కాలంలో స్ర్తీలలో గుండె జబ్బులు ఎక్కువగా
పెరుగుతున్నారుు. ఒక పెద్ద చరిత్ర ఆధారిత అధ్యయనంలో నాడీ సంబంధ గాయాలు
యవ్వనం నుంచి పోగవుతూ వస్తాయని తెలిసింది. ఇలా అవ్వకుండా చిన్నతనం నుంచే
జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
గుండె జబ్బులు నిర్ధారించబడే వరకు, వాటికి అసలు కారణ మైన ఆథేరోస్లే్కరోసిస్ చాలా ఎక్కువగా పెరిగిపోయి ఉంటాయి. అప్పటికే దశాబ్దములు గడిచిపోయి ఉంటాయి. అందుకే చక్కటి ఆహార అలవాట్లు, వ్యాయామం చేయడం, పొగ తాగడం వంటివి మానేయడం ద్వారా ఆథేరోస్లే్కరోసిస్ రాకుండా చూసుకో వటంపై మరింత శ్రద్ధ పెడుతున్నారు.జనాభా ఆధారితంగా చేయబడిన అధ్యయనాలు ఈ గుండె జబ్బుల కారకాలు యవ్వనం నుంచే మొదలవుతాయని తెలస్తు న్నాయి. ఆథేరోస్లే్కరోసిస్ చిన్నతనంలోనే మొదల వుతుంది. కాని బయటపడడానికి దశాబ్దాల కాలం పడుతుంది.
ది పాథలాజికల్ డిటర్యిసేన్ట్‌స ఆఫ్ ఆథేరోస్లే్కరోసిస్ ఇన్ యూత్ అధ్యయన ఫలితాల ప్రకారం ముందుగా లక్షణాలు గుండె కుడి వైపు ఉన్న రక్తప్రసరణ చేసే నాళాలలో మొదలవుతాయి. ఈ ఇబ్బందులు 7-9 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలోనే సగం కంటే ఎక్కువగా కనిపిస్తాయి. ఆథేరో స్లే్కరోసిస్‌కు చెందిన ఇబ్బందులు కారణంగా ప్రతి ముగ్గురిలో ఒకరు మరణిస్తున్నారు అనే విషయాన్ని ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని తీరాలి. దానికి నివారణ అనేద చాలా ముఖ్యం.స్థూలకాయం , చక్కర వ్యాధి అనేవి ఈ గుండె జబ్బులతో దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవాళ్లు గుండె జబ్బు మరింత ప్రాణహాని కలిగిస్తుంది.
రోగనిర్ధారణ:
తక్కువ సాంద్రత కలిగిన కొవ్వు, ప్రోటీన్ల మిశ్రమం, అపోలిప్రోటీన్ ఏ1, ఆపోలిప్రోటీన్ బి.హెచ్.ఓ.
నివారణ:
మేడిటెర్రెనియన్ ఆహారం ఈ గుండె జబ్బుల విషయంలో సత్ఫలితాలను ఇస్తుంది. 2010 వరకు విటమిన్లు ఈ గుండె జబ్బులను తగ్గించే విషయంలో అంతగా ప్రభావం కలిగి ఉన్నట్లుగా తెలియలేదు. ఆథేరోస్లే్ కరోసిస్‌ను తగ్గించడానికి లేదా పెంచడానికి ఉన్న కారణాలు పీచు పదార్థం ఎక్కువగా ఉన్న కూరగాయల ఆహారం, తక్కువ హాని కలిగించే కొవ్వు, కొలెస్ట్రాల్ తీసుకోవడం, పొగాకు తీసుకోవడం మానివేయాలి. పొగతాగేవారికి దూరంగా ఉండాలి, మద్యం అలవాటు తగ్గించుకోవాలి. ఎక్కువ రక్తపోటు రాకుండా తీసుకునే మందుల వలన పూర్తిగా తగ్గిపోకుండా చూసుకోవడం, ఆహారపు అలవాట్లపై పూర్తి నియంత్రణ అవసరం, డయాబెటిస్‌ని అదుపులో ఉంచుకోవాలి. అధిక బరువు ఉన్నప్పుడు బి.ఎమ్.ఐ. తగ్గించుకోవడం, రోజువారీ జీవితంలో కనీసం 30 ని పాటు తప్పనిసరిగా వ్యాయామం చేయడం అవసరం. జీవితంలో మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవడం.
నిర్వహణ:
గుండె జబ్బుల చికిత్సలో ముందుగా ఆహారపు అలవాట్లు, జీవన విధానం మీద ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. మందుల వాడకం నివారణకి ఉపయోగపడుతుంది.
పరిశోధన:
తొలిసారిగా గుండె జబ్బులకు సంబంధించిన పరిశోధనలు 1949లో జెర్రీ మోరిస్ చేత వృత్తిపరంగా సేకరించ బడిన ఆరోగ్య సమాచారంను అనుసరించి చేయబడినవి, 1958లో ప్రచురించబడినవి. బయోమెడికల్ పరిశోధనలో గుండె జబ్బులకు సంబంధించిన ఏ కారణాలయినా రాకుండా చూడడం. 2000 సంవత్సరంలో మొదటిలో ఫాస్ట్‌ఫుడ్స్ గుండె జబ్బులకు దగ్గరి సంబంధం ఉందని చాలా అధ్యయనాలు తెలపడంతో ఒక కొత్త పోకడ మొదలయ్యింది. ఈ అధ్యయనంలో రియాన్ మీకీ మెమోరియల్ రీసెర్చ్ ఇన్సిట్యూట్, హార్వర్డ్ విశ్వవిద్యాలయం, ది సిడ్నీ సెంటర్ ఫర్ కార్డియో వాస్క్యులార్ హెల్త్‌లు చేసిన అధ్యయనాలు కూడా ఉన్నాయి. చాలా ఫాస్ట్ ఫుడ్ సంస్థలు ముఖ్యంగా మెక్డోనాల్డ్‌స, ఈ అధ్యయనంలో వాడిన పద్ధతులను నిరసించారు, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తున్నామని జవాబిచ్చారు.
ఆథేరోస్లే్కరోసిస్‌ను, దానికి సాధ్యమయ్యే లక్షణాలను సూచించే విధంగా తక్కువ స్థాయిలో వచ్చే మంట మద్య ఉన్న సంబంధంపై ఈ మధ్యకాలంలో చర్చ మొదలయ్యింది. సి-8 యాక్టివ్ ప్రోటీన్ అనేది ఒక సాధారణ ఇన్ఫమేటరీ మార్కరీ, ఇది ఎక్కువగా కార్డియో వాస్క్యులార్ జబ్బు రావడానికి అవకాశం ఉన్న రోగిలో ఎక్కువస్థాయిలో కనుగొనబడింది. అలాగే ఆస్టియోప్రోటేగేరిన్ అనేది ఎక్కువగా మంట రావడానికి కారణమయ్యే ఎన్.ఎఫ్.-కె.బి అని పిలువబడే ట్రాన్కిప్షన్ ఫ్యాక్టర్. ఇది కార్డియో వాస్క్యులార్ జబ్బుల్లో నూ, మరణముల్లోనూ ఎక్కువగా కనగొనబడింది. ఇంకా కొన్ని ప్రదేశాలకు సంబంధించి పరిశోధన జరుగుతున్నది.
ఇందులో వీరు చ్లమిదోఫిలా నుమోనియే వంటి వాటితో సూక్ష్మజీవుల వలన కలిగే ఇబ్బందులు, దమనుల్లో రక్తం గడ్డకట్టడం వంటి వాటికి మధ్య ఉన్న సంబంధం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. యాంటీబయాటిక్‌లు ఎక్కువగా వాడడం వలన చ్లమిదియాతో ఉన్న సంబంధం బాగా తగ్గిపోయింది.
0 Comments