మధ్య వయసు వాటిన తర్వాత కళ్ళు మసకమసకగా అనిపిస్తే అది
కేటరాక్ట్ కావచ్చు. ఈ రోజుల్లో కేటరాక్ట్ సర్వసాధారణమైపోయింది. కనుపాపలో
మబ్బులావచ్చి దృష్టికి అవరోధాన్ని కలిగించేదే కేటరాక్ట్. సాధారణంగా ఇది
వయసుతో పాటు వచ్చే వ్యాధి.
కేటరాక్ట్ తొలిదశలో వస్తువులు కాంతివంతంగా కనిపించవు. రానురాను దృష్టి కూడా సన్నగిల్లుతుంది. ఇప్పుడు కేటరాక్ట్‌ని శస్తచ్రికిత్స ద్వారా చాలా తేలికగా, సురక్షి తంగా నిర్మూలిస్తున్నారు. కంటిపాప ద్వారా దృశ్యం రెటీనా పై ప్రతిఫలిస్తుంది. రెటీనా నుంచి మెదడుకి దృశ్యానికి సంబంధించిన సంకేతాలు అందుతాయి. కన్నులోని లెన్స్ నీరు, ప్రొటీన్లతో రూపుదిద్దుకొని ఉంటుంది. ఒక్కోసారి ఈ ప్రొటీన్ లెన్స్‌లోని కొంత భాగం పైపొరలా ఏర్పడడం ప్రారంభిస్తుంది. అదే కేటరాక్ట్. ఈ మబ్బులాంటి పొర ఒక్కోసారి లెన్స్ పరిమాణాన్ని మించిపోయి దృష్టికి అవరోధమవుతుంది. కానీ, ఇంత వరకూ ఈ కేటరాక్ట్ ఎందుకు ఏర్పడుతుందో చెప్పలేకపోతున్నారు. కేటరాక్ట్ ఒక కన్ను నుంచి మరొక కంటికి వ్యాపించదు.
కేటరాక్ట్ లక్షణాలు:
- దృశ్యాలు మబ్బుగా కనిపించడం.
- కాంతిని, లైట్లను చూడలేకపోవడం.
- రంగులు వెలిసిపోయినట్టు కనిపించడం.
- దృశ్యాలు బహు దృశ్యాలుగా కనిపించడం.
- కంటిసైట్ తరచుగా మారిపోవడం.
కేటరాక్ట్ రకాలు: - వయసుతో పాటు వచ్చే కేటరాక్ట్‌లు
- కంజెనిటల్ కేటరాక్ట్ - పుట్టుకతో వచ్చే కేటరాక్ట్‌లు
- సెకండరీ కేటరాక్ట్ - ఇతర వ్యాధుల వల్ల వచ్చేవి
- ట్రామాటిక్ కేటరాక్ట్ - కంటి గాయం వలన వచ్చేవి
కేటరాక్ట్‌ని కనిపెట్టడం ఎలా? - విజువల్ యాక్యుటీ టెస్ట్ - చార్ట్‌ల ద్వారా పరీక్షించేది.
- ప్యుపల్ డైలేషన్ - ఐ డ్రాప్స్ వేసి కంటిపాపను పరీక్షించేది.
- టొనొమెట్రీ - కంటిలో ఫ్లుయిడ్ ఒత్తిడిని తెలిపే పరీక్ష.
కేటరాక్ట్ చికిత్స: - తొలిదశలో కళ్ళద్దాలు, వెలుతురు పెంచి సరిచేసే ప్రయత్నాలు చేస్తారు.
- కానీ, అధిక శాతం శస్త్ర చికిత్సతోనే కేటరాక్ట్‌ని నిర్మూలించడం జరుగుతుంది.
- కేటరాక్ట్‌ని
పూర్తిగా వృద్ధి చెందిన తరువాతే సర్జరీ చేయడం జరుగుతుంది. ఒకవేళ రెండు
కళ్ళకూ కేటరాక్ట్ వస్తే ముందు ఒక కంటికి చేసి తరువాత రెండో కంటికి చేయాలి.
కేటరాక్ట్ నిర్మూలన శస్త్ర చికిత్స ద్వారా ప్రస్తుతం చాలా తేలికగా రోగికి ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చేస్తున్నారు. ఈ శస్తచ్రికిత్సను ఎక్స్‌ట్రా కాప్సులర్ సర్జరీగా, ఇంట్రా కాప్సులర్ సర్జరీగా రెండు విధాలు చేస్తారు. ఏ విధంగా చేసినా రోగికి పూర్వపు కంటిచూపు తిరిగివస్తుంది. ఆపరేషన్‌కై ఆసుపత్రిలో కేవలం ఒక రోజు వుంటే చాలు. ఆపరేషన్ తర్వాత మాత్రం కొన్ని రోజుల పాటు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
0 Comments