Full Style

>

చెవిటితనాన్ని పసితనంలోనే పసికట్టాలి

అంధత్వం వెలుగును దూరం చేస్తుంది. బధిరత్వం మనుషుల్నే దూరం చేస్తుంది అంటారు హెలెన్‌ కెల్లర్‌. ప్రపంచంలోని ఏ శబ్దమూ వినిపించకపోతే ఆ నిశ్శబ్దాన్ని అర్థం చేసుకుని, జీవి తానిి అర్థం వెతుక్కోవడం అంత తేలిక కాదు. కానీ, ఆ వినికిడి వైకల్యాన్ని ఒక లోపంగా భావించకుండా మామూలు మనిషిని మించిన ఆత్మస్థయిర్యంతో జీవితాలను గెలుస్తున్న ఎంతోమంది బధిరులు ఉన్నారు.

చెవిటితనం ఎందుకొస్తుంది?
  • పుట్టుకతోనే లేదా జీవితంలోని ఏ దశల్లోనైనా చెవుడు రావచ్చు.
    Hear
  • బధిరత్వం వంశపారంపర్యం కావచ్చు.
  • నెలలు నిండకముందే డెలివరీ అయిన శిశువులు.
  • బరువు తక్కువ ఉన్న పిల్లలు.
  • మేనరికం దంపతులకు పుట్టిన పిల్లలు.
  • ప్రమాదాలు
  • మెనింగిటిస్‌, ఎన్సిఫెలిటిస్‌, మంప్‌లు, జాండిస్‌ వంటి రోగాలు.
  • వ్యాధితో వచ్చే హైటెంపరేచర్‌.
  • చెవి ఇన్‌ఫెక్షన్లు.
  • వీటిలో దేవివలనైనా చెవిటితనం వచ్చే అవకాశం ఉంది.

    పిల్లల్లో చెవిటితనం అన్నింటికన్నా ఎంతో ఆందోళన కలిగించే విషయం. పిల్లలు భాషని, భావాన్ని అర్థం చేసుకునేది తొలి మూడు సంవత్సరాల్లోనే. ఎంతో ముఖ్యమైన ఈ దశలో చెవిటితనం వారి భవిష్యత్తుపై ఎంతో ప్రభావం చూపిస్తుంది. చెవిటితనం వలన కేవలం వినపడకపోవడం ఒక్కటే కాదు, దాని ఫలితంగా మాటలు కూడా సరిగా రావు. మెదడు పెరగదు, ఆలోచనా శక్తి పరిమితమైపోతుంది. ఇది పసివాళ్లలో బయటపడని వైకల్యం. నిర్లక్ష్యం చేస్తే వారి మానసిక, సామాజిక ఎదుగుదలకు ప్రధాన అడ్డంకిగా మారుతుంది.

    ఇంతకుముందు శిశువు వినికిడి శక్తిని పసిగట్టడం కష్టమయ్యేదేమో గాని, ఇప్పుడు ఆధునిక వైద్యశాస్త్రం కల్పించిన సౌకర్యాలతో బిడ్డ పుట్టిన కొద్ది గంటలలోపే ఈ వైకల్యాన్ని పసిగట్టవచ్చు. దీనికై ఆటోమేటెడ్‌ ఆడిటరీ బ్రెయిన్‌ స్టెమ్‌ రెస్పాన్స్‌ స్క్రీనింగ్‌, ఓటో అకౌస్టిక్‌ ఎమిషన్స్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఏడు నెలల శిశువుకి విజువల్‌ రెస్పాన్స్‌ ఆడియో మెట్రీ పరీక్షతో వినికిడి శక్తి నిర్ధారిస్తారు. ప్యూర్‌టోన్‌ ఆడియోమెట్రీ అనేవి ఇతర పరీక్షలు.

    Hearaబధిరత్వాన్ని పసి వయసులోనే పసిగట్టడం చాలా అవసరం. ఎందుకంటే ఒకవేళ చెవుడు ఉందని తెలిస్తే, ఆ వైకల్యాన్ని సరిదిద్దే చికిత్సలు చేయడం, లేకపోతే అందుకు సంబంధించిన యాంప్లిఫికేషన్‌ సాధనాలను అమర్చి ఆ లోటును భర్తీ చేసే అవకాశం వుంటుంది. వినికిడి వైకల్యంపట్ల ఏ విధంగానూ ఆందోళన చెందకుండా అనేక రకాల హియరింగ్‌ ఎయిడ్‌ సాధనాలున్నాయి.

    బధిరులైన పిల్లలు మానసికంగా, సామాజికంగా ఎదగడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, చుట్టుపక్కల వారి పాత్ర ఎంతో ముఖ్యమైనది. వీరంతా వారి వారి బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తే బధిరులు కూడా అందరిలాగే చక్కని జీవితాన్ని గడపడానికి దోహదం చేసిన వారవుతారు.

Post a Comment

0 Comments