కీ హోల్ శస్త్ర చికిత్సలతో, పెద్ద కోతతో చేసే శస్త్ర చికిత్సల్ని పోల్చినప్పుడు కీ హోల్ శస్త్ర చికత్సలో రక్తస్రావం తక్కువ, కోత తక్కువ, నొప్పి తక్కువ. గాయం త్వరగా మానుతుంది. ఆసుపత్రిలో ఉండే కాలం బాగా తగ్గిపోతుంది. త్వరలోనే తమ పనులను తాము యధావిధిగా వెళ్ళవచ్చు. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని కీ హోల్ సర్జరీస్‌ని ప్రజలు బాగా ఆమోదిస్తున్నారు.
కడుపులో కొన్ని సమస్యలకి ల్యాప్రొస్కోపిక్ సర్జరీలని నిర్వహిస్తున్నారు. వెన్నుకి కీ హోల్ సర్జరీలు నిర్వహిస్తున్నారు. గుండెకి కీ హోల్ సర్జరీలు నిర్వహిస్తున్నారు. కీళ్ళ లోపాల్ని సరిదిద్దడానికి కీహోల్ సర్జరీస్ నిర్వహిస్తున్నారు. మోకాలు మీద సన్నటి రంద్రాన్ని చేసి దాని దావ్రా ఆధునిక చిన్న పరికరాల్ని లోపలికి పంపి శస్త్ర చికిత్సల్ని నిర్వహిస్తున్నారు. వీటినే ఆర్థ్రోస్కోప్ అంటారు. మోకాలు దగ్గర చర్మానికి సన్నటి కంత చేసి ప్రత్యేకమైన పరికరం ద్వారా మెకాలి జాయింట్‌ని బయటనున్న తెరమీద పెద్దదిగా చేసి క్షుణ్ణంగా పరిశీలించి దెబ్బతిన్న కీళ్ళ మార్పిడి కూడా చేస్తారు. ఆర్థ్రోస్కోపీ ద్వారా సన్నటి కంతని చేస్తారు కాబట్టి గాయం త్వరగా నయమవుతుంది. వేగంగా తిరిగి పనికి వెళ్ళవచ్చు. చిన్న మచ్చ ఏర్పడుతుంది. ఆ్రర్థోస్కోపీతో శస్త్రచికిత్స చేసి అదే రోజు రోగిని ఇంటికి పంపేయవచ్చు.
కీహోల్ సర్జరీ ద్వారా ఆస్టియో ఆర్థ్రైటిస్‌ని, రుమటైడ్ ఆర్థ్రైటిస్‌ని నయం చేయవచ్చు. భుజం కీలు కదలకుండా బిగుసుకుపోయినా బాగు చేయవచ్చు. అన్ని రకాల స్పోర్ట్స్ గాయాలకి చికిత్స చేయవచ్చు. లిగమెంట్, మెనిస్కల్ గాయాలన్నీ నయం చేయవచ్చు. ల్యాపరల్ టేల్స్‌ను కూడా సరి చేయవచ్చు.
సాధారణంగా కీళ్ళమీద కార్టిలేజ్ పొర ఉంటుంది. ఈ కార్టిలేజ్ పొర కొబ్బరికాయలోని కొబ్బరిపొరలా మెత్తగా ఉంటుంది. కీళ్ళల్లోని ఈ కార్టిలేజ్ పొర చినిగి నొప్పి పుడుతున్నప్పుడు, కార్టిలేజ్ పొరలో లోపం ఏర్పడినప్పుడు కీళ్ళ మార్పిడి అవసరమవుతుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఆ మార్పుల కారణంగానే కాకుండా కార్టిలేజ్ దెబ్బతినడానికి ఎన్నో కారణాలున్నాయి. ఈ కారణాలన్నింటిని కీహోల్ సర్జరీ ద్వారా సరిచేస్తారు.
ఎలక్ట్రానిక్స్ సహాయంతో ఈ కీహోల్ సర్జరీని మరింత వినూత్నంగా చేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి సర్జరీల నిర్వహణకు కంప్యూటర్ల సాయం తీసుకుంటున్నారు. వీటిని బట్టి శస్త్రచికిత్స చేయాడానికి కంప్యూటర్ నావిగేషన్‌తో వాటిని ఉపయోగించి ఇన్‌ప్రారిడ్ కెమెరాతో పొజీషన్‌ని ట్రాక్ చేయడానికి తోడ్పడుతుంది. కంప్యూటర్ ద్వారా ఆర్థోస్కోపీ సర్జన్ శస్త్ర చికిత్స చేయాల్సిన ప్రాంతాన్ని గుర్తిస్తారు. దీన్ని బట్టి ఖచ్చితమైన ప్రాంతాన్ని కీహోల్ సర్జరీ నిర్వహించడానికి వీలవుతుంది. లిగమెంట్ గాయంలో ఏ.సి.యల్. పునఃనిర్మాణానికి కార్టిలేజ్ ఇంజూరీస్‌తో దెబ్బత్ని కార్టిలేజ్‌ని గుర్తించి రిపేర్ చేయడానికి, మోకాళ్ళ కీళ్ళ పునఃనిర్మాణంలో హై టిబియల్ ఆస్టియోటమి నిర్వహించడానికి కీహోల్ సర్జరీ కంప్యూటర్ అసిస్టెంట్ తోడ్పడుతుంది.
0 Comments