నవీన యుగంలో పోటీ తత్వం మనిషిని అనుక్షణం
తేరుకోకుండా కాలంతో పరుగులు తీయిస్తుంది. పని ఒత్తిడి మనసు కాసేపు నిలకడగా
ఉండనీయడం లేదు. ప్రతి క్షణం ఉద్యోగ, వ్యాపారాల ధ్యాసే. వేగవంతమైన జీవితం,
కలుషిత వాతావరణం, సమయ పాలనా లేని ఆహారం. దీంతో ఆరోగ్యం పట్ల శ్రద్ధ కరువై
ఇతర అనారోగ్య సమస్యలతో పాటు 'లైంగికపరమైన' సమస్యలను ఎదుర్కొంటున్నారు.
నేడు కనిపిస్తున్న లైంగిక సమస్యల్లో అత్యధిక శాతం మానసిక దుర్భలత్వం, భయం నుంచి వచ్చినవే. దీనికి గల కారణం లైంగిక విషయ పరిజ్ఞాణం లేకపోవడం, నిత్య జీవితంలో మానసిక ఒత్తిళ్లను అధిగమించలేకపోవడం.
లైంగిక సామర్థ్యం మానసిక శక్తి మీద ఆధారపడి ఉంటుంది. భయం, ఆందోళన, అనుమానాలు, శ్రీఘ్రస్కలనాలు, స్తంభన లోపాలు వంటి సమస్యలు మనిషిని మానసికంగా బలహీనపరిచి లైంగిక సామర్థ్యాన్ని తగ్గిస్తున్నాయి. ఇటువంటి వారికి మొదటగా ఆత్మవిశ్వాసం పెంచటానికి కౌన్సిలింగ్ ఇచ్చి తర్వాత సమస్యకు అనుగుణంగా మందులు ఇవ్వడం వలన లైంగిక వైఫల్యాల నుండి విముక్తి పొందవచ్చు.
లైంగిక సామర్ధ్యం తగ్గకుండా ఉండాలంటే...
మంచి ఆహారపు అలవాట్లు అలవరుచుకోవాలి. బాదం, ఖర్జుర, మొలకెత్తిన విత్తనాలు, పాలు, గుడ్లు, తాజా ఆకు కూరలు తీసుకోవాలి. కీర దోసకాయ, క్యారెట్, బీట్‌రూట్‌తో తయారు చేసిన జ్యూస్‌ను రోజు ఉదయం ఒక గ్లాసు తీసుకోవాలి. యాపిల్, జామ, దానిమ్మ, ద్రాక్ష, నేరేడు, పుచ్చకాయ వంటి తాజా పండ్లు తీసుకోవాలి.
మద్యపానం సేవించుట, స్మోకింగ్, గుట్కాలు, పాన్‌పరాగ్, నార్కోటిక్స్ తీసుకోవటం వంటి వ్యసనాలను వదిలి వేయాలి. తక్షణ లైంగిక సామర్ధ్యం కోసం 'స్టిరాయిడ్స్' నిత్యం వాడటం వలన లైంగిక పటుత్వం క్రమేపి తగ్గిపోతుంది.
తీవ్ర మానసిక ఒత్తిళ్లు హార్మోన్ల పై ప్రభావం చూపి లైంగిక సామర్ధ్యంను తగ్గిస్తుంది. కావున మానసిక ఒత్తిడి నివారణకు నిత్యం యోగా, మెడిటేషన్‌తో పాటు ఒత్తిడి లేని మంచి జీవన విధానంను అలవరుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రతిరోజు ఉదయం వేకువ జామున 30 ని॥ నుంచి 45 ని॥ల వరకు నడవటం వలన మానసిక ప్రశాంతతో ఒత్తిళ్లను అదిగమించవచ్చు.
చికిత్స:
లైంగిక సమస్యలను రూపుమాపే శక్తివంతమైన ఔషదాలెన్నో హోమియో వైద్యంలో ఉన్నాయి. వ్యక్తి యొక్క మానసిక, వ్యక్తిత్వ, శారీరక లక్షణాలను ఆధారం చేసుకొని వైద్యం చేస్తే లైంగిక సమస్యలను నివారించవచ్చు.
మందులు:
ఫాస్పారన్: వీరికి లైంగిక వాంఛ అధికం. కాని సంభోగించు శక్తిని త్వరగా కోల్పోయి, లైంగిక వాంఛ మాత్రం మిగలడం గమనించ దగిన లక్షణం. మానిసిక స్థాయిలో వీరు సున్నిత స్వభావులు. ఎదుటి వారి సానుభూతిని కోరుకుంటారు. ప్రతి దానికి తేలికగా ఆకర్శితులవుతారు. భయం, ఆందోళన ఎక్కువగా కనిపిస్తాయి. ఇటువంటి లక్షణాలు ఉన్న వారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది.
లైకోపోడియం: ఈ మందు యువకుల్లో వచ్చే నపుంసకత్వానికిది ముఖ్యమైనది. అతిగా కామకలాపాల్లో పాల్గొనడం వల్ల, హస్త ప్రయోగానికి గురై లైంగిక సామర్ధ్యం కోల్పోయిన వారికి ఈ మందు ప్రత్యేకమైనది. వీరు మానసిక స్థాయిలో దిగులుగా, ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. ద్వేషం, అహం, పిరికితనం కలిగి ఉంటారు. ముసలితనం ముందుగానే వచ్చినట్లుగా నుదిటిపై ముడతలు పడతాయి. ఎవరైనా కృతజ్ఞతలు తెలిపితే వెంటనే కంటతడి పెడతారు. ఇటువంటి లక్షణాలు ఉన్నవారు లైంగిక సామర్ధ్యం కొరకు ఈ మందు వాడి ప్రయోజనం పొందవచ్చు.
ఆసిడ్ ఫాస్: వీరికి నీరసం, నిస్త్రాణ ఎక్కువ శ్రీఘ్రస్కలన సమస్యతో ఎక్కువగా బాధపడుతుంటారు. శ్రీఘ్రస్కలన నివారణకు ఈ మందు బాగా పని చేస్తుంది. అలాగే అంగం పూర్తిగా ఉద్రేకం చెందక ముందే, లేదా అంగ ప్రవేశం అయిన వెంటనే స్కలనం అవుతున్నట్లు అయితే ఈ మందు వాడి ప్రయోజనం పొందవచ్చు.
ఎగ్నస్ కాక్టస్: వీరు పూర్తిగా నపుంసకత్వంతో బాధపడుతూ ఉంటారు. కామ వాంఛ తక్కువగా ఉండి అంగస్తంభన జరగదు, అలాగే స్కలనం కూడా తెలియకుండానే తరచుగా జరుగును, వీరికి సంభోగ వాంఛ కూడా ఉండకపోవుట గమనించ దగిన లక్షణం. ఇలాంటి లక్షణాలు ఉన్న వారికి ఈ మందు ప్రయోజనకారి.
అవైనాసెటైవా: నిత్యం మద్యం సేవిస్తూ, సరైన నిద్రలేక నరాల బలహీనత ఏర్పడి, సంభోగ శక్తిని కోల్పోయిన వారికి ఈ మందు బాగా ఉపకరిస్తుంది.
సెలీనియం: మానసికంగా కామవాంఛ కోరిక ఉన్నా శారీరకంగా అంగస్తంభన జరగక తెలియకుండానే స్కలనం జరిగిపోతుంది. స్కలనం అనంతరం తీవ్ర నీరసంతో బాధపడేవారికి ఈ మందు ఆలోచించదగినది.
ఈ మందులే కాకుండా డామియానా, కెలాడియం, ఒనాస్మోడియం, చైనా వంటి మందులను లక్షణ సముదాయమును బట్టి డాక్టర్ గారి సలహా మేరకు వాడుకొని లైంగిక సమస్యల నుండి విముక్తి పొందవచ్చు.

0 Comments