Full Style

>

జాయింట్ పెయిన్స్ ను దూరం చేసే 6 ఆహారాలు..


జాయింట్ పెయిన్స్ వృద్ధాప్యంలో వచ్చేవి మాత్రమే కావు. 6ఏళ్ళ నుండి 60 ఏళ్ళ పైబడినా కూడా ఏ వయస్సులోని వారికైనా ఈ నొప్పులు వచ్చే అవకాశం ఉంది. యుక్తవయస్సులో వారికి ఈ నొప్పులు వచ్చినా ఆశ్చర్యపోవనవసరం లేదు. జాయింట్ పెయిన్స్ వచ్చేందుకు వందకు పైగానే కారణాలున్నాయి. వృద్ధ్దాప్యం కారణంగా క్షీణించిన కీళ్ళ వల్ల సాధారణంగా వృద్ధులు కీళ్ళనొప్పులకు గురవుతుంటారు. యుక్తవయస్సులో ఉన్నవారు మాత్రం ఇన్‌ఫ్లమేటరీ లేదా ఇన్‌ఫెక్టివ్‌ వ్యాధులకు గురవుతుంటారు. కొన్ని సందర్భాల్లో వృద్ధులు కూడా ఈ వ్యాదులకు లోనవుతుంటారు. దెబ్బల కారణంగా కూడా ఈ నొప్పులు వచ్చే అవకాశం ఉంది. ఒక్కోసారి శరీరానికి కావలసినంత కాల్షియం తక్కువైనా మనకి కీళ్లనొప్పులు వస్తుంటాయి. వయసుతో సంబందం లేకుండా ఈ రోజుల్లో చిన్నవారి నుంచి పెద్దవాళ్ల వరకూ ఈ కీళ్లనొప్పుల సమస్యలు అధికంగా ఉంటున్నాయి. కీళ్ళనొప్పులు వచ్చేందుకు దారి తీసిన పరిస్థితులను బట్టి చికిత్స ఉంటుంది.

 మన ప్రతి కదలికకూ కీలే.. కీలకం! జాయింట్లు మృదువుగా, సజావుగా, సున్నితంగా కదులుతుంటేనే... మన జీవితం హాయిగా, సుఖంగా, సౌకర్యవంతంగా సాగుతుంటుంది. అది వేళ్ల జాయింట్లు కావచ్చు, మణికట్టు జాయింట్లు కావచ్చు.. భుజం జాయింట్లు కావచ్చు.. మోకాలి కీళ్లు కావచ్చు.. చివరికి పాదాల, వేళ్ల జాయింట్లు కావచ్చు.. దేనికైనా.. ఏ కదలికకైనా ఈ కీళ్లే కీలకం. మరి మన శరీరంలో ఈ కీళ్లు ఉగ్రరూపం దాల్చి సమస్యలను సృష్టించటం మొదలుపెడితే..? కాలు కదపాలంటే కష్టం. చేయి మెదపాలంటే కష్టం. సంకెళ్లు వేసినట్టు.. జీవితం అడుగడుగునా సమస్యలా తయారవుతుంది. అందుకే జాయింట్లకు అంతటి ప్రాధాన్యం! మరి అంతటి ప్యాధాన్యత ఉన్న కీళ్ళకు తగిన చికిత్స తీసుకోవడంతో మంచి ఆహారాన్ని తీసువడం కూడా ముఖ్యం. మనం తీసుకొనే ఆహారం మీద ఆరోగ్య ప్రభావం ఆధారపడి ఉంటుంది. కీళ్ళ నొప్పులు రాకుండా ఉంచే ఆ ఆహారాలేంటో చూద్దాం...

సాల్మన్ ఫిష్

సాల్మన్ ఫిష్ మరియు వెజిటేబుల్స్ మన శరీర నిర్మాణంలో ప్రొటీన్స్‌ ప్రముఖ పాత్రను పోషిస్తాయి. విరివిగా లభించే సాల్మన్‌ ఫిష్‌ ప్రొటీన్‌ తో సమృద్ధి. వారంలో మూడు సార్లు సాల్మన్‌ను ఆరగించండి. సాల్మన్ ఫిష్ లో ఉండేటటువంటి ప్రోటీనులు, పోషకాల గుండె ఆరోగ్యానికి ఒక మంచి పౌష్టికాహారం.సాల్మన్ ఫిల్ లో ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉండి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది, జీవక్రియను బాగా మెరుగపరచడమే కాకుండా శరీరంలోని రక్త ప్రసరణను బాగా పెంచుతుంది.


బెర్రీస్

బెర్రీస్: ఈ పళ్లలోని పీచు పదార్ధాలు, వర్ణకాలు, రక్త కణాలపైన, మెదడుపైనా ప్రీరాడికల్స్‌ ప్రభావం చూపి చురుకుగా పనిచేసేట్లు చేస్తుంది. పైగా బెర్రీలె క్రమం తప్పకుండా తినటం వల్ల చర్మంలో నిగారింపు జరిగి, మీలో యవ్వనత్వాన్ని పెంచి, వయసు తక్కువ ఉండేలా చూస్తుంది. బ్లూ బెర్రీస్‌, బ్లాక్‌ బెర్రీస్‌ మనకు లభించే ఫలాల్లో ఇదోక రకమైన ఫలం ఇందులో అధిక శాతం శక్తివంతమైన ఆంటిఆక్సైడ్స్‌ లభిస్తాయి. ఇందులో శరీరానికి అవసరమయ్యే విటమిన్‌ సి లభిస్తుంది. శరీరంలో రక్త వృద్ధిని పెంచుతుంది. ఖనిజలవణాలు, బెర్రీస్‌ వల్ల శరీరంలో సోడియం శాతాన్ని తగ్గించి శరీరాన్ని కాపాడుతుంది. అంతేగాక వయసు దాచి ఉంచేలా శరీరాన్ని తేజోవంతంగా చేస్తుంది. శరీరంలో తేమ శాతాన్ని పెంచి ముఖవర్చస్సును కలిగిస్తాయి.

వెజిటేబుల్స్

వెజిటేబుల్స్: ఆకుపచ్చని కూరగాయ లను వాడుట వల్ల శరీ రంలోని అనేక రకాలైన రుగ్మతలను తగ్గించే ఆంటి ఆక్సైడ్స్‌ లభిస్తా యి. వీటితోపాటు విటమిన్‌-సి ని అందిస్తాయి. దీంతో శరీరానికి శక్తిని కలిగిస్తాయి. పోషక పదార్థాలపై ప్రభావం పడకుండా, అతినీల లోహిత కిరణాల ప్రభావం శరీరంపై పడకుండా ఆకుపచ్చని కూర గాయల వంటకాలు శరీరంలోని విష పదార్థాల భారీనుండి కాపాడుతాయి.

నట్స్

నట్స్: నట్స్ తినడం చాలా మంచిది. అందులోనూ వాల్ నట్స్ తినడం ఆరోగ్యానికి ఇంకా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వాల్ నట్స్ లో ఉండే ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలో కొవ్వును కరిగించడంలో బాగా తోడ్పడతాయి. రోజూ 8 నుంచి 10 వాల్ నట్స్ తినడం వల్ల రక్తంలో చక్కెర శాతం

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్: ఇతర నూనెలకన్నా ఖరీదు ఎక్కువే అయినా ఆలివ్ నూనె లో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో మోనో అన్క్ష్ సాచ్యురేటెడ్ కొవ్వు ఆమ్లాలు అత్యధికము. వెజిటేబుల్ ఆయిల్ ను ఉపయోగించకన్నా ఆలివ్ ఆయిల్ ను ఉపయోగిస్తే ఆరోగ్యానికి అందానికి కూడా మంచిది. ఇందులో లోక్యాలరీస్ తక్కువ ఫ్యాట్ కలిగి ఉంటుంది. అందువల్లే కొలెస్ట్రాల్ ఆరోగ్యకరంగా ఉండేదుకు ఉపయోగపడుతుంది. కీళ్ళను గట్టిపరుస్తుంది. ఆలివ్ ఆయిల్ జాయింట్ పేయిన్స్ ను తగ్గించడమే కాకుండా బరువును కూడా తగ్గిస్తుంది.
కూడా తగ్గిపోతుందని వారు అంటున్నారు.


ఆరెంజ్ జ్యూస్

ఆరెంజ్ జ్యూస్: ఆరెంజ్ జ్యూస్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. సి విటమిన్ కీళ్ళ నొప్పులను పోగుట్టుటలో చాలా బాగా పనిచేస్తుంది. ఆరంజ్ లో ఫైబర్ శాతం ఎక్కువ కాబట్టి జ్యూస్ లా కాకుండా తొనలతో తినడమే మంచిది.ఆరంజ్ లో ఫైబర్ శాతం ఎక్కువ కాబట్టి జ్యూస్ లా కాకుండా తొనలతో తినడమే మంచిది. ప్రతి రోజూ 200 ఎం.ఎల్ ఆరెంజ్ జ్యూస్ తాగడం ద్వారా 60ఎంజీ విటమిన్ సి లభిస్తుందని పరిశోధనలో తేలింది.

Post a Comment

0 Comments