Full Style

>

స్ట్రెచ్ మార్క్స్ ను తొలగించే 8 సులభమైన చిట్కాలు


సాధారణంగా అమ్మాయిలకు డెలవరీ టైంలో పొట్టమీద ఏర్పడే స్ట్రెచ్ మార్క్స్ కాకుండా, బరువు తగ్గిన తర్వాత అమ్మాయి, అబ్బాయిలందరిలోను నడుము చుట్టూ, భుజాల చుట్టూ హిప్స్ మీద స్ట్రెచ్ మార్స్క్ వచ్చే అవకాశం వుంది. ఈ పరిస్థితిలో చర్మం కింద కొల్లాజున్ ఫైబర్స్ సాగిపోయి విడిపోవడం వల్ల నడుము మీద, భుజాల చుట్టూ ఏర్పడే తెల్లని పొడవైన చారలనే స్ట్రెచ్ మార్క్స్ అంటారు.

కొందరు స్ర్తీలలో తొలి యవ్వన దశలో అంటే రజస్వల అయిన అనంతరం, బిడ్డ ఆరోగ్యంగా పుట్టేందుకు గర్భం ధరించినప్పటి నుంచి బలమైన ఆహారం తీసుకోవడం, శారీరక శ్రమ లేకుండా ఉండటం, బిడ్డపుట్టిన తర్వాత కూడా అదేవిధమైన జీవన శైలికి అలవాటు పడటం వల్ల పొట్ట బాగా సాగి, ముడతలు పడుతుంది. ఈ విధంగా ఒక్క గర్భిణులకే కాదు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటూ, ఏ విధమైన ఎక్సర్‌సైజూ చేయకుండా, ఉండవలసిన దానికన్నా అధిక బరువు ఉండే ప్రతి ఒక్కరికీ ఆ విధంగా ముడతలు పడటం సహజం.

వీరికే కాదు, స్టెరాయిడ్స్ ఎక్కువగా తీసుకునేవారిలోనూ, అధికంగా ఎక్సర్‌సైజులు చేసేవారిలోనూ కూడా ఈ విధంగా చర్మం బాగా సాగి, చారికలు పడతాయి. అయితే అవి కొంతకాలానికి అంటే మామూలుగా రోజూవారీ పనులు చేసుకుంటూ, ఆహారంలో కొవ్వు తక్కువగా ఉండేట్టు చూసుకుంటూ, సహజ పద్ధతిలో బరువు తగ్గితే నెమ్మదిగా చర్మంలో కలిసిపోతాయి. కొద్దిమందిలో మాత్రం ఆ విధంగా కలవకుండా మచ్చల్లాగా, చారికల్లాగా ఏర్పడతాయి. మరి అటువంటి వారు కూడా ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవడం వల్ల స్ట్రెచ్ మార్క్స్ ను అతి సులభంగా పోగొట్టవచ్చు.



స్ట్రెచ్ మార్క్స్ పోగొట్టడానికి ఇది ఒక అద్భుతమైన ప్రయోగం. కండరాలపై చర్మం సాగిన గుర్తులు ఏర్పడటానికి కారణం అయ్యే గుణాలను తొలగిస్తుంది.




ప్రతి రోజూ మీరు తీసుకొనే ఆహారంలో ప్రోటీనులు, విటమిన్ సి మరియు విటమిన్ ఇ అధికంగా ఉండేట్లు చూసుకోవాలి. వీటివల్ల శరీర పెరుగుదలకు, కొత్తకణాలు ఏర్పడటానికి, చర్మంలో వచ్చే మార్పులను తొలగించడానికి బాగా ఉపయోగపడుతాయి. జింక్ అధికంగా కలిగిన ఆహారాలైన నట్స్, విత్తనాలను ప్రతి రోజూ తీసుకొనే డైయట్ లో చేర్చడం వల్ల స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడకుండా అడ్డుకొంటుంది. విటమిన్ కె అధికంగా కలిగిన ఆహారాలు, పాలు ఉత్పత్తులు, లివర్, ఆకుకూరలు, మరియు టమోటాలు వంటివి సాగిన చర్మ గుర్తులను తొలగించడానికి ఉపయోగపడుతుంది.

 రోజుకు మూడుసార్లు ఈ మచ్చలు ఉన్నచోట లావంగ నునే లేదా అలోవిరా జెల్ రాసి మర్దన చేయండి. స్ట్రెచ్ మార్క్సును పోగొట్టడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా చర్మాన్ని ఆరోగ్యంగా, తేమగా ఉండేలా చేస్తుంది.




 స్ట్రెచ్ మార్క్సును పోగొట్టడంలో లావెండర్ ఆయిల్ అద్భుతమైనటువంటి వంటింటి ఔద్యం. లావెండర్ ఆయిల్ ను స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట మర్ధన చేయడంతో పూర్తిగా తొలగిపోతాయి.




ఆప్రికాట్ తో స్ర్కబ్ చేయడం వల్ల డెడ్ స్కిన్, డ్యామేజ్డ్ స్కిన్ తొలగిపోతుంది. అలాగే చర్మం సాగి ఏర్పడే చారికలను అదృశ్యం చేసేందుకు సహాయం చేస్తుంది.





 ఆరోమాటిక్ ఆయిల్స్ చమోమైల్, అవొకాడో, బాదాం ఆయిల్ మరియు జోజోబా ఆయిల్ వంటి సుగంధ తైలాలు చర్మంపై ఏర్పడే స్ట్రెచ్ మార్క్స్ ను పోగొట్టడానికి సహాయపడుతాయి. ఈ ఆరోమాటిక్ ఆయిల్స్ కి లావెండ్ ఆయిల్ మిక్స్ చేసి ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలను అంధిస్తుంది. అంతే కాదు కొత్తగా ఎటువంటి స్ట్రెచ్ మార్క్సు ఏర్పడకుండా నిరోధించడానికి సహాయపడుతుంది.



 కోకో బట్టర్ గర్భధారణ సమయంలో ఏర్పడే స్ట్రెచ్ మార్కులను నివారించడానికి అద్భుతమైన ఔషదంగా ఉపయోగిస్తారు.




 ప్రెగ్నెన్సీ సమయంలో ప్రతిరోజు ఆల్మండ్ ఆయిల్, విటమిన్-ఇ ఆయిల్, కోకోవా బటర్‌లలో ఏదోఒకదానితో పొట్ట చర్మంపై గుండ్రంగా, మృదువుగా రాయాలి. పంచదార, ఆలివ్ ఆయిల్, విటమిన్-ఇ క్రీం, అలోవెరాజెల్ వీటిని సమభాగాలుగా కల్పి స్ట్రెచ్ మార్క్స్‌పైన మృదువుగా రాస్తూ వుండాలి. అలా ప్రతిరోజూ చేస్తుంటే క్రమంగా మచ్చలు తొలగిపోతాయి. డెలివరీ అయ్యాక కూడా స్ట్రెచ్ మార్క్స్ కోసం అందుబాటులో వున్న క్రీమ్స్ రెగ్యులర్‌గా వాడాలి. ఇలా చేస్తే సమస్యను చాలా వరకు తగ్గించవచ్చు.

Post a Comment

0 Comments