వేసవి కాలం తర్వాత వేడి నుండి బయట పడటానికి శీతాకాలం వస్తుంది. శీతాకాలంలో
వీచి చల్ల గాలులు, చలి మిమ్మల్ని ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. అవునా?
అయితే మీ చర్మం మాత్రం అలా ఫీలవదు? శీతాకాలంలో వీచే బలమైనటువంటి చల్ల
గాలులు, లోలెవల్ మాయిశ్చరైజర్స్ వల్ల చర్మం మరియు కేశాలు అనేక సమస్యలను
ఎదుర్కొంటుంది. చర్మం, కేశాలు పొడిబారడం, దురుద, పాదాల పగుళ్ళు, ఒంటి మీద
గీతలు ఇలా ఇంకా ఎన్నో సమస్యలను తెచ్చి పెడుతుంది.
శీతాకాలంలో చర్మ సంరక్షణ జాగ్రత్తలు సరేసరి.. మొహంలో సున్నితభాగాలైన పెదాలు, కళ్ల విషయంలో కాస్త ఎక్కువ శ్రద్ధ చూపల్సి ఉంటుంది. ఈకాలంలో పెదాలు తొందరగా పొడిబారతాయి. ఎన్ని లోషన్స్ రాసినా కొద్దిసేపటికే పొడిబారిపోతాయి. మరి ఈ చలికాలంలో మీ పెదాలు నునుపుగా మెరిసిపోతూ ఉండాలంటే ఏం చేయాలో నిపుణులు చెబుతున్న సలహాలు చూద్దాం.
మనశరీరంలో ఎక్కువగా కనిపించే భాగం ముఖం. శీతాకాలంలో ఎక్కువగా అఫెక్ట్ అయ్యేది కూడా ఈ ప్రదేశమే. కాబట్టి శీతాకాలంలో చర్మం పొడిబారకుండా ఎప్పుడూ మాయిశ్చరైజింగ్ క్రీమ్ ను రాస్తుండాలి. స్ట్రాంగ్ గా ఉన్నటువంటి క్లెన్సర్సుకు దూరంగా ఉండాలి. మీ చర్మ ఆయిల్ చర్మ తత్వం అయితే మైల్డ్ ఫేష్ వాష్ ఉపయోగిస్తే చాలు. చల్లగాలు, శీతాకాలంలో ఎండకు రక్షణ కోసం సన్ స్క్రీన్ లోషన్ ఉపయోగించాలి.
శీతాకాలంలో కళ్ళు పొడిబారినట్లు కనిపిస్తుంటాయి. మరియు కళ్ళు మంటలు, కళ్ళు దురుదగా అనిపించడం వంటి లక్షణాలు ఉంటాయి. కాబట్టి కళ్ళను తేమగా ఉంచి, ప్రశాంతంగా ఉండేలా చేసేందు ఐ డ్రాప్స్ బయట మెడికల్ షాప్స్ లో దొరుకుతాయి వాటిని ఉపయోగిచడం వల్ల ఉపశమనం పొందవచ్చు. అంతే కాదు కళ్ళు చుట్టు ఉన్న సున్నితమైన చర్మాన్ని రక్షించడానికి ఐ క్రీమ్ ను అప్లై చేయొచ్చు. శీతాకాలంలో వీచే కఠినమైన గాలులు, సూర్యకాంతి నుండి కళ్ళను కాపాడుకోవడానికి సన్ గ్లాసెస్ ను ఉపయోగించండి.
చర్మం వలె కాకుండా పెదాలు మీద ఉన్న చర్మం మరింత సున్నితంగా ఉండటం వల్ల అతి తర్వగా పొడిబారి, పగుళ్ళు, చీలడం, రక్త రావడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. అందుకు కారణం పెదాల మీద నూనెగ్రంధులు లేకపోవడమే. కాబట్టి పెదాలు తేమగా ఉంచుకోవడం కోసం రోజుఎక్కువగా కనీసి 8గ్లాసుల నీళ్ళు తాగాల్సి ఉంటుంది. పెదాలను మృదువుగా ఉంచేందుకు లిప్ బామ్ మరియు పెట్రోలియం జెల్లి వంటి వాటిని తరచూ రాస్తుండాలి. ఇవి మంచి మాయిశ్చరైజర్ గా కూడా పనిచేస్తాయి. అంతే కాకుండా పొడి బారిన పెదాలను నాలుకతో తేమ చేయడం నిలిపివేయండి.
చలికాలంలో చర్మంతోపాటు జట్టు సంరక్షణ కూడా చాలా అవసరం. లేకపోతే చుండ్రు, జిడ్డు సమస్యలు అధికమై జట్టుబలహీనమై, జీవం కోల్పోయి పీచులా తయారవుతుంది. అందుకనే.. జుట్టు పట్టుకుచ్చులా జాలువారాలంటే కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తే సమస్యలనుంచి కురులకు రక్షణ కల్పించుకోవచ్చు. ఈ కాలంలో శిరోజాల రక్షణకు నీరు తగినంత తీసుకోవడం ద్వారా శిరోజాలు పొడి బారకుండా ఉంటాయి. శిరోజాలు చిట్లడానికి చలికాలం అనువైన వాతావరణం కాబట్టి జుట్టు కొసలను తరచూ కత్తిరించుకుంటూ ఉండాలి.
తేమను అందించే మాయిశ్చరైజర్స్ వాడాలి. అందుకు బాడీ లోషన్, శరీరానికి వెన్న వంటి ఉపయోగించడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. ఎక్కువగా నీరు తాగడం వల్ల చర్మం ఎప్పుడూ తేమగా ఉంటుంది. కఠినమైన, చల్లగాలులు శరీరానికి తగలకుండా పూర్తిగా కవర్ చేసేలా స్వెటర్లు, గ్లౌజుల, సాక్సులు వంటివి తొడుక్కోవాలి. చర్మ సంరక్షణకోసం ఎక్కువగా పండ్లను, వెజిటేబుల్స్ ను తీసుకోవాలి. ఇంకా బాదాం, ఆలివ్ ఆయిల్స్ తో బాడీని మసాజ్ చేసుకోవడం వల్ల దురద, పొడబారడం వంటి సమస్యల నుండి బయట పడవచ్చు.
శీతాకాలంలో పాదాల పగుళ్ళు మరింత ఎక్కువగా కనబడుతాయి. కాబట్టి పాదాలపై ప్రత్యేక శ్రద్ద అవసరం. వారానికి ఒక సారి పాదాలను ఎక్స్ ఫ్లోట్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి. ఫూట్ క్రీమ్, పెట్రోలియం జెల్లి వంటివి రాసుకొని కాళ్ళకు ఎప్పుడూ సాక్సులతో కవర్ చేసి ఉంచుకోవాలి. ఇంట్లోనే నెలకొకసారి పెడిక్యూర్ వంటివి చేసుకోవాలి.
0 Comments