ఆరు టీ స్పూన్ల గులాబీ రేకులను, ఆరు టీ స్పూన్ల సోపు గింజలను కలిపి నూరి రెండు కప్పుల నీళ్లకువేసి మరిగించి వడపోసి రోజుకు రెండుసార్లు తీసుకుంటుంటే క్రమంగా రక్తహీనత నుంచి బయటపడతారు.
ఒక టీ స్పూన్ గులాబీ నూనెను, నాలుగు టీ స్పూన్ల బాదం నూనెను కలిపి ఛాతి మీద ఉదయసాయంకాలాలు ప్రయోగించి మర్థనా చేసుకుంటుంటే గుండెనొప్పిలో హితకరంగా ఉంటుంది.
రెండు టేబులు స్పూన్ల గులాబీ పూల రేకులను ఒక గ్లాసు నీళ్లకు కలిపి కషాయం తయారుచేసి తీసుకుంటే ఆందోళన, నర్వస్‌నెస్ వంటివి తగ్గుతాయి.
రోజ్‌వాటర్‌ని, ఉల్లిపాయల రసాన్ని ఒక్కోటి ఒక్కో టీ స్పూన్ చొప్పున కలిపి పరిశుభ్రమైన దూది ప్యాడ్‌ని తడిపి మూసిన కనురెప్పలమీద పరుచుకుంటే కంటి మంటలు, ఎరుపుదనం, దురద వంటివి తగ్గుతాయి.
రోజ్‌వాటర్‌ని, ఉల్లిపాయల రసాన్ని కలిపి గాయాల మీద ప్రయోగిస్తే త్వరితగతిన మానతాయి.
రోజ్‌వాటర్‌ని, నిమ్మరసాన్ని 3:1 నిష్పత్తిలో తీసుకొని రెండు కళ్లలోనూ చుక్కల మందుగా వేసుకుంటూ ఉంటే క్యాటరాక్ట్‌లో ఉపయోగముంటుంది.
ఒక టేబుల్ స్పూన్ గులాబీ రెక్కలను ఒక కప్పు నీళ్లకువేసి మరిగించి తీసుకుంటే తల తిరగటం, తలనొప్పి వంటివి తగ్గుతాయి.
రెండు టీ స్పూన్ల రోజ్‌వాటర్‌కి చిటికెడు పటిక పొడిని కలిపి దూది వుండను ముంచి కళ్లలో డ్రాప్స్‌గా వేసుకుంటే కళ్లనుంచి నీళ్ళు కారటం, కన్నీటి గ్రంథికి వచ్చిన ఇనె్ఫక్షన్ వంటివి తగ్గుతాయి.
రోజ్‌వాటర్‌ని, వెనిగార్‌ని సమాన నిష్పత్తిలో చల్లని నీళ్లకు కలిపి, నూలు గుడ్డను తడిపి మడతలుపెట్టి నుదుటి మీద పరిస్తే శరీరం చల్లబడి జ్వరందిగుతుంది.
రోజ్‌వాటర్‌కి తోక మిరియాల పొడి, శొంఠి పొడిని ఒక్కో టీ స్పూన్ చొప్పున కలిపి పేస్టుమాదిరిగా చేసి తల నొప్పిమీద ప్రయోగిస్తే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఎండిన గులాబీ రెక్కలను పొడిచేసి తేనెకు కలిపి కొద్దికొద్దిగా చప్పరిస్తుంటే గొంతు నొప్పినుంచి ఉపశమనం లభిస్తుంది.
ఒక కప్పు గులాబీ నీళ్లకు ఒక టీ స్పూన్ సోపు గింజలు, అర టీస్పూన్ ధనియాలు, 10 ఎండు ద్రాక్షలను కలిపి రాత్రంతా నానబెట్టి మర్నాడు ఉదయం వడపోసుకొని తీసుకుంటే గుండె దడ, ఆందోళన వంటివి తగ్గుతాయి.
గులాబీలు 100గ్రా., ద్రాక్షపండ్లు 100గ్రా. నీళ్లకు వేసి కషాయం కాచి చిటికెడు ఏలక్కాయ గింజల పొడికి కలిపి కొద్దికొద్దిగా చప్పరిస్తుంటే దీర్ఘకాలంనుంచి బాధించే తల నొప్పినుంచి ఉపశమనం లభిస్తుంది.
రోజ్‌వాటర్‌కి కుంకుమ పువ్వు, బాదం పలుకులను కలిపి మెత్తగా నూరి ముఖంమీద ఫేస్ ప్యాక్ మాదిరిగా ప్రయోగిస్తే ముఖ చర్మం కుసుమ కోమలంగా తయారవుతుంది. మంగు మచ్చలు, మొటిమలు వంటివి తగ్గుతాయి.
గులాబీలు వేసి నానబెట్టిన నీళ్లను సున్నపు తేటకు కలిపి, కమలాపండ్ల రసానికి చేర్చి తీసుకుంటే ఎసిడిటీవల్ల వచ్చే ఛాతినొప్పి, వికారం, అజీర్ణం, ఆమ్లపిత్తం వంటి సమస్యలు తగ్గుతాయి.
గులాబీలను వేసి తయారుచేసిన కషాయాన్ని తీసుకుంటే టాన్సిల్స్‌వాపు తగ్గుతుంది.
గులాబీ రెక్కలు 1 భాగం, పంచదార 2 భాగాలు తీసుకొని తగినన్ని కలిపి పానకం మాదిరిగా మారేంతవరకూ మరిగించి దింపి చల్లారనిచ్చి కొద్దిగా ఏలకులు, పచ్చకర్పూరం కలిపి ఒకటి రెండు కుంకుమ పువ్వు కేసరాలను కూడా చేర్చి నిల్వచేసుకోవాలి. దీనిని 1-2 టీస్పూన్ల మోతాదులో చన్నీళ్లకు కలిపి తీసుకుంటూ ఉంటే మూత్రంలో మంట, శరీరంలో వేడి వంటి పిత్తసంబంధ సమస్యలు తగ్గుతాయి.
తాజా గులాబీ పువ్వులను మెత్తగా నూరి వ్రణం పైన పట్టుమాదిరిగా లేపనంచేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
ఎండు గులాబీ రేకులను పక్కమీద జల్లి చికెన్‌పాక్స్ వచ్చిన వ్యక్తిని పడుకోబెడితే అసౌకర్యం, దురద వంటివి తగ్గుతాయి.
రోజా పూలతో తయారుచేసిన పన్నీటిని కళ్లలో చుక్కలు చుక్కలుగా వేసుకుంటే కళ్లలో మంటలు, పుసులు కట్టడం వంటి సమస్యలు తగ్గుతాయి.
గులాబీ పువ్వులతో కషాయం తయారుచేసుకొని పుక్కిట పడితే దంత సంబంధ సమస్యల్లో చక్కని ఫలితం కనిపిస్తుంది.
గులాబీ పూలరెక్కలు, అక్కలకర్ర పొడి వీటిని మూడేసి గ్రాముల చొప్పున కలిపి కొద్దికొద్దిగా నాలుక మీద వేసుకొని చప్పరిస్తుంటే నాలుక మీద ఉండే రుచి గ్రాహకాలు (టేస్ట్‌బడ్స్) చైతన్యవంతమవుతాయి. దీంతో ఆహార పదార్థాల రుచి తెలుస్తుంది.
గులాబీ పూల రెక్కలతో చేసే జామ్‌ని లేదా లేహ్యాన్ని గుల్కంద్ అని కూడా పిలుస్తారు. దీనిని పాలతో కలిపి టీ స్పూన్ మోతాదులో తీసుకుంటే చక్కని మృధువిరేచనకారిగా పనిచేస్తుంది.
0 Comments