Full Style

>

ల్యాప్‌టాప్ వాడే సమయంలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు...

అదేపనిగా ల్యాప్‌టాప్ ఉపయోగిస్తున్నారా...? ల్యాప్‌టాప్ వాడే సమయంలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు...


కొందరు అదేపనిగా ల్యాప్‌టాప్‌ను ఉపయోగిస్తున్నారు. ఎక్కడికైనా తీసుకెళ్లడానికి అనువుగా ఉంటుందని దాన్నే వాడుతుంటారు. ల్యాప్‌టాప్ అనేది చాలా ప్రధానమైన పనులను కొద్దిసేపు చేసుకోడానికే అన్నమాట గుర్తుంచుకోడాలి. అయితే అది డెస్క్‌టాప్‌కు ప్రత్యామ్నాయం కాదు. చాలాసేపు పనిచేయాల్సి వస్తే తప్పనిసరిగా డెస్క్‌టాప్ వాడటం మంచిది. ల్యాప్‌టాప్ ఉపయోగించే సమయంలో మెడ బాగా ముందుకు సాచి పనిచేయాల్సి వస్తుంటుంది. దాంతో మెడ దగ్గర ఉండే సెర్వికల్ డిస్క్‌లపై ఒత్తిడి పెరుగుతుంది. 

అలాంటి ఒత్తిడే నడుం మీద ఉండే ఎముకలపై కూడా పడవచ్చు. ల్యాప్‌టాప్ కీబోర్డు దీర్ఘకాలం పనిచేసేందుకు అనువైనది కాదు. ఎందుకంటే దాని కీబోర్డు సాధారణ కంప్యూటర్ కీబోర్డులా మన వేళ్లు పూర్తిగా కదలడానికి అనువుగా ఉండదు. అయితే సాధారణ కంప్యూటర్ కీ-బోర్డు కొద్దిగా వాలుగా ఉండి వేళ్లు కదలడానికి అనువుగా ఉంటుంది. కానీ ల్యాప్‌టాప్ కీబోర్డు పూర్తిగా ఫ్లాట్‌గా ఉంటుంది. కాబట్టి మన వేళ్లపై, మెడపై అదనపు ఒత్తిడి పడుతుంది. అందుకే దాన్ని ఎక్కువసేపు ఉపయోగించకూడదు. 

ల్యాప్‌టాప్ వాడే సమయంలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు... 


  • ల్యాప్‌టాప్‌పై దీర్ఘకాలం పనిచేయాల్సి వస్తే దానికి మామూలు కీబోర్డు అమర్చుకోండి. ఎక్స్‌టర్నల్ కీ-బోర్డు, మౌస్‌లను అమర్చుకోండి.
  • ల్యాప్‌టాప్ మానిటర్ మీ కంటికి సరైన ఎత్తులో ఉండేలా చూసుకోండి.
  • చాలాసేపు పనిచేయాల్సి వచ్చినప్పుడు గంటకోసారి కొద్ది నిమిషాలు విశ్రాంతి (బ్రేక్) తీసుకోండి.
  • ల్యాప్‌టాప్‌ను పడక, తలగడ వంటి మృదువైన ఉపరితలం (సాఫ్ట్‌సర్ఫేస్)పై ఉంచకండి....

Post a Comment

0 Comments