ఇది దీర్ఘకాలిక వ్యాధి. దీనిని జాగ్రత్తగా అర్థం
చేసుకొని కారణం కనిపెట్టి చికిత్స ఇవ్వవలసి ఉంటుంది. చికిత్స ఠినం అయినా
దీనికి హోమి యోపతిలో పరిష్కారం ఉంది. ఈ సోరియాసిస్ వ్యాధి చిన్న పిల్లల
నుండి వృద్ధుల వరకు ఎవరికైనా రావచ్చు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి స్త్రీ,
పురుషుల తేడా లేకుండా అందరికి వస్తుంది. యుక్తవయస్సు వారిలో ఎక్కువగా
కనిపించడానికి ఆస్కారం వుంది.సోరియాసిస్‌ను నివారించటానికి దైనందిన జీవితం
లో మార్పులు తీసుకరావటం, చర్మం ఆరోగ్యంగా ఉండేటట్లు కాపాడుకోవడం, వాతావరణ
మార్పులు, శారీరక, మానసిక ఆందోళ నలకు సరఇయిన జాగ్రత్తలు, యోగా, మెడిటేషన్,
తాజాపండ్లు, కూరగాయలు, పోషకాహారాలు సమపాళ్లలో తీసుకోవటం వలన కొంతవరకు
నివారించవచ్చు.ఇది ఒక చర్మ సంబంధ వ్యాధి. ఇందులో పొలు సులు నొప్పి, చర్మం
మందం అగుట, వాపు, దురద, చేప పొట్టులాంటి (వెండి రంగు) చర్మం ఊడుట ఉంటాయి.
వ్యాధి కాలంః
సరియైన చికిత్స లేనిచో జీవిత పర్యంతం వ్యాధి ఉండవచ్చును. కొన్ని వాతావరణ పరిస్థితులలో పెరుగుట, తగ్గుట జరుగును.
వ్యాధి కారణాలుః
1. ఇన్‌ఫెక్షన్, వంశపారంపర్యం 2. మానసిక ఒత్తిడి (స్ట్రెస్) 3. చర్మం ఎండబారినట్లుండుట (డ్రై స్కిన్) 4. కొన్ని రకాల మందుల వలన 5. ఆల్కహల్, పొగ తాగుట
ఏ వయస్సుః
ముఖ్యంగా 25-45 వయస్సువారిలో స్త్రీలలో ఎక్కువ శాతం. నేటి కాలంలో మానసిక, శారీరక బత్తిడుల వలన వ్యాధి శాతం పెరిగింది. అన్ని వయ సులలో కూడా రావచ్చు.
వంశపారంపర్యంః కొన్ని కేసులలో సంక్రమిం చవచ్చు.
రోగ నిరోధక శక్తిః
మామూలుగా రోగనిరోధక శక్తి ప్రక్రియ వలన శరీరంలో బ్యాక్టిరియా, వైరస్, ఇతర రకాలైన హనికరమైన ప్రోటీన్స్ నుండి రక్షణ లభించును. నిరోధక శక్తి తగ్గినప్పుడు వీటి నుండి రక్షణ కవచం తగ్గును.
వ్యాధి నిర్ధారణః
వ్యాధి నిర్ధారణ జాగ్రత్తగా పరీక్షించి తెలుసుకోవచ్చు. కొన్ని కేసులలో చర్మకణజాలం కొంత ముక్క తీసి మైక్రోస్కాపిక్ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు.
సోరియాసిస్ వలన వచ్చే ఇతర జబ్బులుః
1. సొరియాటిక్ నెయిల్స్: చర్మ వ్యాధి నుండి గోళ్లకు వ్యాపించినచో సొరియాటిక్ నెయిల్స్ అందురు. గోళ్లు చిట్లి విరిగి పోవును.
2. సొరియాటిక్ ఆర్థోరోపతి
సోరియాసిస్ చర్మం నుండి కీళ్ళకు వ్యాపించ వచ్చును. ముఖ్యంగా చేతి వ్రేళ్ళ ఆఖరి వేలు భాగం లో వచ్చును. మోకాలు నొప్పలు కూడా రావచ్చు.
సోరియాసిస్ వలన జీవితంలో కలిగే బాధలుః
ఈ జబ్బువలన ఆరోగ్యపరంగా అసంతృప్తి, మాన సిక క్షోభ, ఆందోళన, రోజువారి పనులలో, నడకలో, నిద్రలో తేెడాలు ఉంటాయి. పని సామర్థ్యం తగ్గు తుంది. కొన్ని రకములైన వృత్తులలో పనిచేయ లేకపోవుట, సామాజికంగా మసలుకోలేక పోవుట, ఫంక్షన్స్‌లలో పాల్గొనలేకపోవుట, ఎక్కడకు వెళ్ళినా ఇతరులు గుర్తిస్తారు అనే భయంతో బయటకు వెళ్ళలేకపోవడం ఉంటాయి.
వ్యాధి చికిత్సా విధానంః
సోరియాసిస్ వ్యాధి ఉధృతమైనది, దీర్ఘకాలికమైనది. కావున రోగికి, రోగికి మధ్య తేడా వుండవచ్చును. జబ్బు తీవ్రతను బట్టి చికిత్స జరుపవలెను.
మానసిక ఆందోళన తగ్గించుటః
కావల్సినంత శారీరక శ్రమ, విశ్రాంతి, సమతుల్య ఆహారం, మంచి అలవాట్లు, మెడిటేషన్, చర్మానికి సంబంధించిన జాగ్రత్తలు, ఇతర ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుట, రోజు రెండుపూటల స్నానం, తేమ, ఆయిల్ చర్మానికి మెయింటెయిన్ చేయవలెను,
హోమియో మందులుః
వ్యక్తి శారీరక మానసిక స్థితి, వ్యాధి కారకములు, వ్యాధి కారణమలు, వ్యాధి తీవ్రత, వ్యాధి లక్షణ ములు మొదలగున్నవి అన్ని పరిగణనలోకి తీసుకొని మందు నిర్ధారణ చేయబడును.
కొన్ని మందులు - వాటి లక్షణాలుః
1. arsenicum iodatum
చర్మం ఎండబారినట్లుండుట, పొలుసులుగా ఊడి పోవుట, దురద, వీపరీతంగా వుండును. గీరిన త ర్వాత ఎర్రటి చర్మం అగుపించును. ముఖం, గవద భాగంలో వచ్చే వ్యాధులు, ఎక్కువ చెమట పట్టుట, అతినీరసం, చాలా నీరసించి బక్క చిక్కిన వారికి మంచి మందు.
2. graphites
దీర్ఘకాలిక చర్మవ్యాధి, చర్మం, పగుళ్ళు, బండబారి నట్లుండుట, చర్మం మందమగుట, నలుపురంగు, కీళ్ళు మడతలు, చెవి వెనుక భాగం, జననేంద్రియా ల వద్ద, తోడల మడత లలో వచ్చే చర్మ వ్యాధి. దురద, రసికారుట, ఎక్కువ బరువు కల వారికి వాడే మందు.
3. kali arsenicum
తీవ్రమైన దురద, రాత్రివేళలో దుస్తులు మార్చిన తర్వాత అధికమగును. ఎండా కాలం లో పెరిగే చర్మవ్యాధి. సోరియాసిస్ కీళ్ళ నొప్పులతో వున్నప్పుడు వాడవచ్చును. అతితొందర, కోపం, రక్తహీనత గలవారికి మంచి మందు.
4. Carcinocum
వంశపారంపర్యంగా వచ్చు సోరియాసిస్ వ్యాధి. గోధుమరంగు చర్మం, కలర్ మచ్చలు సున్నిత స్వభావులు, బాధలను తట్టుకోలేరు, ఎదురు చెప్పలేరు.
5. Sulphur
చర్మవ్యాధులకు మంచి మందు చర్మం పొడారినట్లుండుట, అతివాగుడు, ఎక్కువగా చదువుకున్న వారిలో, మతము గురించి ఎక్కువగా మాట్లాడువారు, శుభ్రత పాటించరు, సరిగా స్నానం చేయరు, ఎప్పుడూ ఏదో ఆలోచనలలో మునిగి వుంటారు. మొండితనం, కుటుంబం గురించిన ఆందోళన.
సోరియాసిస్ వ్యాధి తొలిదశలోనే హోమియో వైద్య చికిత్స ఆరంభిస్తే త్వరగా సత్ఫలితాలు పొందవచ్చు. సరైన డాక్టర్‌ను సంప్రదిందించి, క్రమం తప్పకుండా మందులు వినియోగిస్తే ఈ వ్యాధి నయం అవుతుంది.
రకాలు
1. గట్టెట్ సోరియాసిస్‌ః నీటి బుడగల వంటి పొక్కులు ఛాతి భాగం, కాళ్లు, ముంజేతులు, తల, వీపు, భాగములలో వచ్చును. దీనికి తోడు వైరస్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు చీము పొక్కులుగా మారు ను.
2. చీము పొక్కులుః ఎక్కువ వేడి ప్రదేశాలలో, ఎండలో తిరుగట వల న, గర్భవతిగా వున్నప్పుడు, చెమటలు ఎక్కువ పట్టేవారిలో, మానసిక అలజడి, ఒత్తిడి, కొన్ని రకముల మందులు, కెమికల్స్ తయారీలో పని చేసే వారిలో, ఎక్కువ ఆంటిబయోటిక్స్ వాడే వారిలో రావచ్చు.
3. ఇన్‌వర్స్ సోరియాసిస్‌ః ఇన్‌వర్స్ సోరియాసిస్ పెద్ద, పొడి, సున్నితమైన, ఎర్రటి పొలుసులతో వుండును. ఎక్కువగా చర్మం మడతలతో, జననేంద్రియ భాగములలో, ఛాతీ భాగములలో, చంకలలో ఎక్కువ ఒత్తిడి, రాపిడి వుండే భాగములలో వచ్చును.
4. ఎరిత్రోడర్మిక్ సోరియాసిస్‌ః ఎక్కువ చర్మభాగము, ఎర్రనగుట, దురద, పొలు సులు రాలుట, నొప్పి, భరించరానిది, ఎండలో తిరుగటవలన స్టిరాయిడ్ మాత్రలు వాడుట వలన, ఆంటీబయోటిక్స్, అలర్జీ వలన వచ్చే అవకాశముంది.
ఎక్కడెక్కడ వస్తుంది...
ముఖ్యంగా ముంజేతి వెనుక భాగం, మో కాలు ముందు భాగం, తల, వీపు, ముఖం, చేతులు, పాదాల వద్ద ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. మామూలుగా చర్మంలో కణ జాల ఉత్పత్తి, కణజాల మార్పులు నెలకు ఒకసారి జరుగును. సోరియాసిస్ వ్యాధిలో కొన్ని రోజుల లోనే జరుగును. దీనినే సెల్ టర్నోవర్ అందురు. టి సెల్ (తెల్ల రక్తకణములలో ఒక రకం) ఎక్కువగును.
హోమియో వైద్యం
సోరియాసిస్ వ్యాధి దీర్ఘకాలికమైనది. రోగ నిరోధక శక్తిలో మార్పుల వలన సంభవించును. మందులు, పూతలు, ఇతర వైద్య విధానములు వలన తాత్కాలిక ఉపశమనం కలుగును.
హోమియో వైద్య విధానం రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
శరీరం యొక్క వ్యాధి నిర్మూలన విధానమును మెరుగుపరుస్తుంది.
హోమియోపతి రూట్‌లెవెల్‌లో పనిచేసి, వ్యాధి నిరోధక శక్తిని నార్మల్‌స్థాయికి తెస్తుంది.
వ్యాధికారకములైన మానసిక ఆందోళన, క్షోభ మొదలగువాటిని సమూలంగా నిర్మూలిస్తుంది.
హోమియో వైద్య విధానం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్‌స లేకుండా జబ్బును నిర్మూలిస్తుంది
0 Comments