Full Style

>

డయాబెటిక్‌ కోమా

డయాబెటిక్‌ కీటో అసిడోసిస్‌ నుంచి డయా బెటిక్‌ కోమాలోకి పోవటం సడన్‌గా కాకుండా క్రమేపి జరుగుతుంది. ఈ పరిస్థితికి చాలా రోజులు ముందుగానే మూత్రంలో ‘ఎసిటోన్‌’ ఉంటుంది. మూత్రంలో ఎసిటోన్‌ ఉండటం ఎప్పుడూ ప్రమాదకరమే.

bld0మూత్రంలో ఎసిటోన్‌ విషయంలో శ్రద్ధ తీసుకోకపోతే నోరు ఎండిపోవటం, అధిక దా హం, అతిమూత్రం, వాంతులు మొదలవుతాయి.క్రమేపి శ్వాసక్రియలో కూడా మార్పులు వస్తాయి. ఎగశ్వాస, దిగశ్వాస ఉంటుంది. శ్వా సలో తీపివాసన ఉంటుంది.సాధారణంగా డయాబెటిస్‌ వ్యాధి ఉన్న వారికి ఏదైనా జబ్బు చేసినప్పుడు ఆహారం తక్కువ తీసుకుంటున్నాం కదా అని కొందరు ఇన్సులిన్‌ను అసలు తీసుకోకపోవటం లేక తక్కువ తీసుకోవటం చేస్తుంటారు. అసలు వచ్చే ప్రమాదం అంతా ఇక్కడే.

మరో సంగతి ఏమిటంటే ఈలాంటి సంద ర్భాలలో ఇన్సులిన్‌ అంతగా పనిచేయదు కూడా కాబట్టి డాక్ట రు సలహామేర ఇన్సులిన్‌ను ఎక్కువ గానే తీసు కోవాలి.రక్తంలో చక్కెర అత్యధికంగా ఉండటం, శరీరంలో నీరు తరిగిపోవటం, ఈ రెండూ డయాబెటిక్‌ కోమా కి ముఖ్యకారణాలు. ఈ పరిస్థితి ఏర్పడ్డప్పుడు వెంటనే హాస్పిటల్‌కు తీసుకుపోయి చికిత్స ప్రారం భింపచేయాలి.డాక్టరు వెంటనే శరవేగంతో పనిచేసే ఇన్సులిన్‌ లే దా మొదట ఇన్సులిన్‌ ఇంజెక్షన్‌ ఎక్కువ మోతా దులో ఇచ్చి, తర్వాత అవసరానుసారం చిన్న చిన్న మోతాదుల్లో ఇస్తారు. శరీరంలో నీరు తరిగిపోయి ఉంటుంది. కనుక ఫ్లూయిడ్‌ని కూడా ఇస్తారు.

డయాబెటిక్‌ కోమా చాలా ప్రమాదకరమైన ప్రాణా పాయకరమైన పరిస్థితి. డాక్టరు చాలా అప్రమత్తతో ఎప్పటికప్పుడు రక్తంలోని గ్లూకోజు, పొటాషియం, ఇతర ఎలక్ట్రోలైట్స్‌ని పరీక్ష చేస్తూ ఉండాలి.
‘హైపోగ్లైసీమిక్‌ డయాబెటిక్‌ కోమా’, టైప్‌ -2 డయా బెటిస్‌కి సంబంధించిన ‘హైపర్‌గ్లై సీమిక్‌ డయా బెటిక్‌ కోమా’ ఈ రెంటిలో పేషెంటుకు వచ్చింది ఏ రకమైన కోమా అన్న విషయంలో డాక్టరు సరి అయిన నిర్ధారణ చేయకపోతే ప్రాణాపాయం జరుగుతుంది. ఎందుకంటే ఈ రెండూ వేర్వేరు కారణాలవల్ల వస్తాయి.

రక్తంలో గ్లూకోజు పరిమాణం తగ్గిపోవటం వలన ‘హైపోగ్లైసీమిక్‌ కోమా’ వస్తుంది. దీనికి రక్తంలో గ్లూకోజు పరిమాణాన్ని పెంచే చికిత్స జరగాలి.రక్తంలో గ్లూకోజు పరిమాణం విపరీతంగా పెరిగి పోవటం వలన ‘డయాబెటిక్‌ కోమా’ వస్తుంది. దీనికి రక్తంలో గ్లూకోజు పరిమాణాన్ని తగ్గించే విధంగా చికిత్స జరగాలి. త్వరగా పని చేసే ఇన్సు లిన్‌ ఇవ్వాలి.రోగనిర్ధారణ విషయంలో పొరబడి ఒకదాని బదు లు మరో చికిత్స చేస్తే రోగి ప్రాణానికే ప్రమాదం ఏర్పడుతుంది.

హై బ్లడ్‌ షుగర్‌
రక్తంలో చక్కెర అత్యధిక స్థాయికి చేరుకోవటం ‘హై బ్లడ్‌ షుగర్‌‌‌’. దీనినే హైపర్‌ గ్లైసీమియా అనీ అంటా రు.మితిమీరి భుజించటం, ఇన్సులిన్‌, డయాబెటిక్‌ టాబ్లెట్లను సరయిన సమయానికి తీసుకోక వాటి ప్రభావం తక్కువగా ఉండటం, అనారోగ్యం, మానసిక ఒత్తిడి లాంటివి ‘హైపర్‌ గ్లైసీమియా’కు దారి తీస్తాయి.సరయిన చికిత్స తీసుకోకుండా ముదరబెడితే ‘హైప ర్‌ గ్లైసీమియా’ క్రమంగా డయాబెటిక్‌ కోమాకు దారితీస్తుంది.

హై బ్లడ్‌ షుగర్‌ లక్షణాలు
  • మాటి మాటికి మూత్రానికి వెళ్ళడం
  • అతిగా దప్పిక
  • అతిగా ఆకలి
  • మసక చూపు
  • నిద్ర మత్తు
  • వికారం

    ఏంచేయాలి?
    బ్లడ్‌ గ్లూకోజ్‌ని పరీక్షించండి. కీటోన్స్‌ని పరీక్షిం చండి.బ్లడ్‌గ్లూకోజ్‌ 250 ఎం.జీ/డిఎల్‌ కంటే ఎక్కువైతే డాక్టరును సంప్రదించండి.హై బ్లడ్‌ షుగర్‌‌‌ తగ్గకుండా ఎక్కువకాలం పాటు అదే స్థాయిలో కొనసాగితే భవిష్యత్తులో శరీరం లోని ముఖ్యాంశాలు - గుండె, రక్తనాళాలు, కిడ్నీ లు, కళ్ళు -మొదలైనవి దెబ్బ తినే ప్రమాదం ఉంది.కాబట్టి డాక్టరు సలహా ప్రకారం నిర్దేశించిన రీతిలో మందులు, ఇన్సులిన్‌లను క్రమబద్ధం గా తీసుకోవాలి. ఆహార నియమాలను పాటించాలి. శరీరాన్ని నిత్యం చురుకుగా ఉంచు కోవాలి. అప్పుడు భవిష్యత్తులో వచ్చే ప్రమాదాలను నివారించుకున్న వారవుతారు.

Post a Comment

0 Comments