ప్రస్తుత కాలంలో అనేక మంది మూత్రంలో మంట సమస్యతో
బాధపడుతున్నారు. వేసవికాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి
కారణం శరీరంలోని నీటి శాతం తగ్గిపోయి లవణాల గాఢత పెరిగి కిడ్నిల్లో రాళ్లు
మరియు యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్స్ (యు.టి.ఐ) ఏర్పడే అవకాశం ఉండటమే.
మానవ శరీరాన్ని సురక్షితంగా కాపాడే విషయంలో మూత్రపిండాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. శరీర ద్రవా ల్లోని లవణాల సమతుల్యత కాపాడి శరీరంలోని నీటి పరి మాణాన్ని తగ్గకుండా చూస్తూ జీవకార్య నిర్వహణలో పేరుకునే కాలుష్యాన్ని విసర్జిస్తాయి. ఇలాంటి విధులు నిర్వర్తించే కిడ్నీలు ఇన్‌ఫెక్షన్‌కు గురైనప్పుడు మూత్రంలో మంట వస్తుంది.
కారణాలు
చాలా కారణాల ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి ముత్రా వయవాల్లో వచ్చే ఇన్‌ఫెక్షన్ యురినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ (యు. టి.ఐ), మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం, మూత్రకోశంలో ఇన్ ఫెక్షన్, నీరు తగినంతగా తాగకపోవడం, ఆహారపు అలవాట్లు, కొన్ని జన్యుపరమైన ఇన్‌ఫెక్షన్ల వలన మూత్రంలో మంట వస్తుంది.
లక్షణాలు
- మూత్ర విసర్జన మంటతో కూడి ఉండుట.
- పొత్తి కడుపులో నొప్పి రావడం, మూత్రం ఎక్కువ సార్లు చేయడం.
- మూత్రం రంగు మారడం, వేడిగా, ఎరుపుగా రావటం.
- పిల్లల్లో ఈ సమస్యను ఎదుర్కునే వారు మూత్రం పోయాలంటేనే భయపడిపోయి, ఏడుస్తుంటారు.
- నీరసం, జ్వరం లాంటి లక్షణాలుంటాయి.
పరీక్షలు
సి.యు.ఇ. (కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్), వి.డి.ఆర్.ఎల్, ఎక్స్‌రే-కె.యు.బి. పరీక్షల ద్వారా మూత్రంలో మంటకు కారణం తెలుసుకోవచ్చు.
జాగ్రత్తలు - మద్యం ఇతర మత్తుపానీయాలు సేవించకూడదు టీ, కాఫీలు మానేయాలి.
- మాంసాహారం తగ్గించాలి.
- పొగాకు ఉత్పత్తుల వినియోగం ధూమపానం త్యాజించాలి.
- ఫాస్ట్‌ఫుడ్స్, మసాలాలు, నూనె పదార్థాలు, ఉప్పు ఎక్కువగా వాడటం వంటివి తగ్గించాలి.
- వీటిని వీలైతే పూర్తిగా మానుకుంటే మంచి ప్రయోజనం పొందవచ్చు.
- సాత్వికాహారం తీసుకోవాలి.
- తగినంత నీరు తాగాలి. కనీసం రోజుకు 4 లీటర్ల నీరు తాగాలి.
- ద్రవపదార్థాలు పండ్లు తాజా కూరగాయాలు ఎక్కువగా తీసుకోవాలి.
చికిత్స
వ్యాధి నిర్ధారణ జరిగిన ప్రారంభ దశలో హోమియో మందులను వాడితే శస్త్ర చికిత్స నుండి నివారణ పొందవచ్చు.
మందులు
లైకోపోడియం : మూత్ర విసర్జన మంటతో కూడి, మూత్రం ఇటుక రంగులో ఉంటుంది. ఈ పర్సనాలిటి వ్యక్తులు చూడటానికి సన్న గా కనబడతారు. వీరు దైనందన జీవితంలో ఆచి తూచి అడుగు వేస్తారు. మానసిక స్థాయిలో కొంచెం భయస్తులు. భయం వలన సామర్థ్యం ఉన్నా నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తారు. ఇలాంటి వ్యక్తులకు ఈ మందు ముఖ్యమైనది.
బెర్బెరీన్ వల్గారిన్ : ఎడమ కిడ్నీ వైపు నొప్పి ప్రారంభమై ముం దుకు వ్యాపింస్తుంది, నొప్పి మంటతో కూడి భరించలేకుండా ఉం టుంది. ఇలాంటి లక్షణాలు ఉండి, మూత్రం మంటతో బాధపడే వారికి ఈ మందు ఆలోచించదగినది, ఆలోచించదగినది.
టెరిబెంటైనా : మూత్రం నల్లగా ఉండి చుక్కలు చుక్కలుగా వస్తుం ది. మూత్రం తరచుగా ఎక్కువసార్లు పోస్తూ ఉంటారు. మూత్రం ఎరుపు రంగులో ఉండి మంటగా అనిపిస్తుంది. ఇలాంటి సంద ర్భాల్లో ఈ మందు వాడుకోదగినది.
కాంథారిస్ : మూత్రం వచ్చినట్లుగా అనిపించటం, మూత్రం చక్క లు చుక్కలు వస్తూ చురుక్కు మనిపించుట, మూత్రం తరచుగా ఎక్కువసార్లు పోస్తూంటారు. మూత్రం పోసే సమయంలో మంట తీవ్రంగా వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో ఈ మందు వాడి ప్రయో జనం పొందవచ్చు.
ఈ మందులే కాకుండా హైడ్రాంజియా, నక్స్‌వామికా, తూజా, మెర్కురియన్, ఫాస్పారస్, టాబాకమ్ వంటి మందులను లక్షణ సముదాయం పరిగణలోకి తీసుకొని వైద్యం చేసిన యెడల మూతరలో మంట సమస్య నుండి విముక్తి పొందవచ్చు.
0 Comments