డయాబెటిస్ వ్యాధి ఉన్న వ్యక్తి శరీరంలోని జీవకణాలు
రక్తంలోని గ్లూకోజ్‌ని గ్రహించలేవు. దానితో అతడి రక్తంలో గ్లూకోజ్ అత్యధిక
స్థారుుకి చేరుతుంది. రక్తంలో గ్లూకోజ్ అత్యధికస్థారుుకి చేరు కోవటాన్ని
‘హైపర్ గ్లైసీమియా’ అంటారు. రక్తం లో గ్లూకోజ్ స్ధాయి 150 ఎంజీ%కి మించి
ఉండటం ‘హైపర్‌గ్లైసీమియా’ కిందికి వస్తుంది. డయాబెటిస్‌కి సరైన వైద్యం
జరగనప్పుడు హైపర్‌గ్లైసీమియా వస్తుంది.
రక్తంలో గ్లూకోజ్ పరిమాణం అధికంగా ఉంటే (హైపర్ గ్లైసీమియా) ఆ క్షణాన ఆ వ్యక్తి సుస్తీగా ఫీలవుతాడు. రెగ్యులర్ ప్రాతిపదికన ఇది మాటిమాటికీ జరుగుతుంటే కొంతకాలానికి డయాబెటిస్ మూలంగా వచ్చే రాకూడని అనర్థాలన్నీ వస్తాయి.అందుకనే డాక్టర్లు రక్తంలో గ్లూకోజ్‌ని 60- 150 ఎంజీ% మధ్య ఉం డేట్లుగా చూసుకోవాలని డయాబెటిక్ పేషెంట్లకు సలహా ఇస్తుంటారు. డయాబెటిస్‌ని ఎంతగా కంట్రోల్ ఉంచు కోవటానికి ప్రయత్నించినా కూడా వివిధ కార ణాలవల్ల ఒకోసారి రక్తంలో గ్లూకోజ్ 150 ఎంజీ% కి మించి అసాధారణ పరిమాణానికి చేరుకుంటుంది.
- జీవితంలో తరచుగా ఎదురవుతుండే వివిధ ఒత్తిళ్ళ మూలంగా
- అస్వస్థత మూలంగా
- ప్రయాణాలు లేక ఫంక్షన్ల హడావిడిలో ఉండి ఇన్సులిన్‌ని లేక టాబ్లెట్‌లను సరయిన డోనులో వాడకపోవటం
ఇలాంటి కారణాలవల్ల ఇన్సులిన్‌ని తీసుకుంటున్నా, టాబ్లెట్లను వాడు తున్న లేక సరయిన ఆహారపు అలవాట్లతోపాటు వ్యాయామం ద్వారా డయాబెలిస్‌ని కంట్రోల్‌లో ఉంచుకుం టున్నా కూడా డయా బెటిక్ పేషెంట్లుకు ఎప్పుడో ఒకప్పుడు ‘హైపర్‌గ్లైసీమియా’ స్థితి వచ్చే అవ కాశం ఉంది.
కారణాలు, నివారణ
డయాబెటిస్‌ని కంట్రోల్‌లో ఉంచుకోవాలంటే రక్తంలో గ్లూకోజ్ ఏ ఏ సమయాల్లో పెరుగు తోందో కనిపెట్టాలి. రక్తంలో చక్కెర పరిమాణా న్ని ఎప్పటికప్పుడు రెగ్యులర్‌గా పరీక్షించు కోవటం ద్వారా ఇది సాధ్య మవుతుంది.
బ్లడ్ షూగర్ రీడింగ్ 60-150 ఎంజీ% మధ్య కాకుండా ఇంకా ఎక్కు వ పరిమాణంలో ఉంటే డయాబెటిస్ ఆ మనిషి కంట్రోల్‌లో ఉండటం లేదని అర్థం చేసుకోవాలి.
రక్తంలో గ్లూకోజ్ పరిమాణం మాటిమాటికీ అత్యధికంగా చేరుకుం టుంటే (ఉదాహరణకు 180-210ఎంజీ% మధ్య) వెంటనే తగు చికి త్స కోసం ప్రయత్నించాలి.లక్షణాలు ఇంకా కనిపించటం లేదు కదా అని నిర్లక్ష్యం చేయ కూడదు. అలా చేస్తే రక్తంలో చక్కెర త్వరలోనే 240ఎంజీ% కి దాటిపోయే ప్రమాదం ఉంటుంది.
ఆహారం, ఎక్సర్‌సైజ్‌లు
హైపర్‌గ్లైసీమియా రావటానికి చాలా స్పష్టంగా కనిపించే కారణం ఏమి టంటే మితిమీరి భుజించటం. దీనివల్ల శరీర కణాలు గ్లూకోజ్‌ని అం తగా గ్రహించలేక గ్లూకోజ్ అంతా రక్తంలోనే నిలిచిపోతుంది. అలాగే తీసి పదార్థాలను అధికంగా తినటంవల్ల కూడా రక్తం లో గ్లూకోజ్ పరి మాణం పెరుగుతుంది .కొన్ని ఆహారపు నియమాల్ని, కట్టుబాట్లను పాటించటం, శరీరానికి తగు శ్రమనిస్తూ చురు కైన జీవనాన్ని సాగించడటం ద్వారా హైపర్ గ్లైసీమియా రాకుండా చూసుకోవచ్చు.
జబ్బు పడ్డప్పుడు
ఏదన్నా అస్వస్థతతో ఉన్న ప్పుడు లేక జబ్బు పడ్డప్పుడు కాలేయంలోని గ్లూకోజుకింద మార్చబడి రక్తంలోకి ప్రవేశిస్తుంది.
అస్వస్థతతో ఉన్నప్పుడు స్ట్రెస్‌కి సంబందించిన హార్మోనులు విడుదలై ఇన్సులిన్ సక్రమంగా పని చేయకుండా అడ్డు కుంటాయి.
ఈ రెండు కారణాలవల్లా జబ్బుపడ్డ రోజుల్లో రక్తంలో గ్లూకోజ్ పరి మాణం అధికమవుతుంది. అందుకే జబ్బుపడ్డ రోజుల్లో మాటిమాటికీ రక్తంలో గ్లూకోజ్ పరిమాణాల్ని పరీక్షించు కోవటం అవసరం. దాని వల్ల ట్రీట్‌మెంట్‌లో మార్పులు చేర్పులు చేసుకోవాలేమో తెలుస్తుంది.
స్ట్రెస్ హార్మోన్లలో మార్పులు
స్ట్రెస్ హార్మోనులు శరీరంలో ఇన్సులిన్ సక్రమంగా పని చేయకుండా అడ్డుకుంటాయి. దానివల్ల రక్తంలో గ్లూకోజ్ పరిమాణం అధికమవు తుంది.
అంతేకాకుండా స్ట్రెస్‌లో ఉన్న మనుషూలు అతిగా భుజించటమో లేక అడ్డమైన తిండినీ నోటికి అప్పగించడమో చేస్తుంటారు. దీనివల్ల కూడా రక్తంలో గ్లూకోజ్ పరిమాణం పెరుగుతుంది.
స్త్రీలకు మెన్సెస్ కాలంలో, ముఖ్యంగా మెన్సెస్ ముందు రోజుల్లో రక్తంలో గ్లూకోజ్ పెరుగు తుంది. అలాగే మధ్యవయసు దాటుతూ మెనో పాజ్ దశలో ఉన్న స్త్రీలు కూడా వాళ్ళ శరీరంలో జరిగే హార్మోన్ల మార్పుమూలంగా ‘హైపర్ గ్లైసీ మియా’కు లోనయ్యే అవకాశం ఉంది.
ఇన్సులిన్, డయాబెటిస్ టాబ్లెట్లు
ఏ కారణం వల్లనైనా ఇన్సులిన్‌ని లేక, టాబ్లెట్‌లను సరయిన సమయానికి తీసుకోకపోతే రక్తంలో గ్లూకోజ్ పరిమాణం పెరిగిపోతుంది. ఒకోసారి ఇన్సులిన్‌ని లేక టాబ్లెట్‌లను సరిగ్గా వేసుకున్నా కూడా ఇతరత్రా కారణాలవల్ల హైపర్‌గ్లైసీమియా రావచ్చు. ఇలాంటి సందర్భంలో ఇన్సులిన్‌ని లేక డయాబెటిక్ టాబ్లెట్ల డోసుని మార్చాల్సి ఉంటుంది.దీన్ని డాక్టరు నిర్ణయిస్తారు.
లక్షణాలు - హైపర్ గ్లైసీమియా లక్షణాలు తొలిసారిగా డయాబెటిస్ గుర్తించినప్పటి లక్షణాలలాగే ఉంటాయి.
- మాటిమాటికి అధిక పరిమాణంలో మూత్రాన్ని విసర్జించటం
- నోరు పొడారటం, తీవ్రంగా దప్పిక
- ఆకలి, నీరసం
- బరువును కోల్పోవటం
- మసక చూపు
- నిద్రమత్తు
- మూత్రవిసర్జనలో మంట
- తెమలటం, వికారం మొదలైనవి.
టైప్-2 డయాబెటిస్ కలవాళ్ళకు హైపర్ గ్లైసీమియా వస్తే పెద్దగా లక్షణాలేమీ కనిపించ కపోవచ్చు. బహుశా అందుకు కారణం వాళ్ళ శరీరం రక్తంలో గ్లూకోజ్ అధిక పరిమాణంలో ఉండటానికి అల వాటు పడిపోయి ఉండటం కావచ్చు.
చికిత్స
హైపర్‌గ్లైసీమియా ఏ కారణం వల్ల వస్తోందో గుర్తించి అందుకు తగ్గ చికిత్స చేయాల్సి ఉంటుంది.
ముఖ్యంగా చేయాల్సినవి - మితంగా తినటం, ఎక్సర్‌సైజుల్ని లేక శారీరక శ్రమను పెంచడం
- మీకు టైప్-2 డయాబెటిస్ ఉండి దానికి ఏ మందులూ వాడకుండా ఆహార నియమాల్ని పాటించటం, ఎక్సర్‌సైజులు చేయటం ద్వారా కంట్రోల్ చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నప్పుడు అనుకోకుండా రక్తంలో గ్లూకోజ్ అధికమ వుతోంటే (హైపర్ గ్లైసీమియా), అదీ 150ఎంజీ % కి పైబడి మాటిమాటికీ వస్తోంటే, బహుశా మీరు పాటిస్తున్న నియమాలు, క్రమబద్ధ అలవాట్లకు తోడు టాబ్లెట్ల వాడకాన్ని కూడా ప్రారంభించాల్సిన అవసరం ఉంటుంది. మీ డాక్టరు నిర్ణ యిస్తారు దీనిని.
- ఏదన్నా జబ్బు చేసి ఉంటే ఆ జబ్బుకు సంబంధించిన ట్రీట్‌మెంట్‌ను సక్రమంగా తీసుకోవాలి.
దానివల్ల జబ్బు నయమవ్వటమే కాకుండా హైపర్‌గ్లైసీమియా రాకుండా నిరోధించినట్లూ అవు తుంది. - రక్తలోని
అధిక గ్లూకోజును తగ్తించటానికి మీరు ఏ చర్యలు తీసుకుంటున్నా కూడా తరచుగా
బ్లడ్ టెస్టుల్ని చేయించుకోవటం మాత్రం చాలా అవసరం. దీనివల్ల రక్తంలో
గ్లూకోజ్ అదుపులో ఉందో లేదో ఎప్పటికప్పుడు తెలుస్తుంది.
విపరిణామాలు
ఎప్పుడన్నా ఏదన్నా సందర్భంలో రక్తంలో గ్లూకోజ్ పరిమాణం పెరిగి హైపర్ గ్లైసీమియా స్థాయికి చేరుకున్నా కూడా తాత్కా లికంగా కొద్ది పాటి అసౌకర్యాన్ని ఫీలవుతారు తప్ప అదంత ప్రమాదకరమైన విషయం కాదు.
కాని, మాటిమాటికీ రక్తంలో గ్లూకోజ్ అసా ధారణంగా పెరిగిపోతుంటే మాత్రం స్వల్ప కాల కంగానూ దీర్ఘకాలంమీదా విపరిణామాలు ఏర్పడే ప్రమాదం ఉంది.
స్వల్పకాలికంగా ఏర్పడే విపరిణామాలు ఏమిటంటే:
టైప్ -1 డయాబెటిస్ కలవారికి ‘డయాబెటిక్ కీటో అసిడోసిస్’ అనే తీవ్రపరిణామం ఉత్పన్నమవుతుంది.
టైప్-2 డయాబెటిస్ కలవారు ‘హైపర్ ఆస్మా టిక్ కోమా’లోకి వెళ్తారు.
సంవత్సరాల తరబడిగా హైపర్‌గ్లైసీమియా కొనసాగితే కళ్ళు దెబ్బతినటం, కిడ్నీలు పాడవటం, గుండె జబ్బులు, నరాల వ్యవస్థ పాడవటం లాంటి దీర్ఘకాలిక దుష్పలితాలు ఏర్పడుతాయి
స్వీట్లను వెంట ఉంచుకోవాలి!
డయాబెటిక్ పేషెంట్లు ఎప్పుడూ చాక్లెట్లు, గ్లూకోజ్ బిస్కట్లు గాని పంచదారను గాని తమ వెంట ఉంచుకోవటం మంచిది. ఇందుకు కారణం ఏమిటంటే- ఈ పేషంట్లకు ఎప్పుడో అనుకోకుండా రక్తంలో చక్కెరశాతం పడి పోయే అవకాశం ఉంది. ఈ స్థితిని ‘హైపోగ్లైసీమియా’ అంటారు.
ఇలాంటి సందర్భంలో వీళ్ళు తమ వెంట ఉన్న ఒకటి రెండు స్వీట్లను నమిలితే రక్తంలో చక్కెరశాతం పెరుగుతుంది.
డయాబెటిక్ పేషెంట్లు ఆకలితో ఎప్పుడూ ఉండకూడదు. సమయా నికి భోజనం చేయకపోవడం, శరీరానికి అధిక శ్రమనివ్వటం లాం టివి వాళ్ళకు రక్తంలో చక్కెర శాతం పడి పోయేట్లుగా చేస్తాయి.
తలనొప్పి వచ్చి, చల్లగా చెమటలు పట్టటం, లేకపోతే కళ్ళు బైర్లు కమ్మటం లాంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే ఏదో ఒక తీపి పదార్థాన్ని తినటం లేక తీపి పానీయాన్ని తాగటం చేయాలి. రెండుమూడు స్పూన్ల పంచదారను తిన్నా సరిపోతుంది.
ఈ చెప్పిన లక్షణాలు రక్తంలో చక్కెరశాతం పడిపోవటం మూలం గానే జరిగితే అయిదు నిముషాల లోపే రిలీఫ్ కనిపిస్తుంది.
0 Comments