బాగా చదినినప్పటికీ పరీక్షల సమయంలో సహజంగానే ఎక్కువ మంది మానసిక
ఒత్తిడికి గురై పరీక్షలు సరిగా రాస్తామో లేదో అని భయపడుతుంటారు. పరీక్ష
హాలులోకి వెల్లగానే కొందరు ప్రశ్నా పత్రం చూడకముందే ఆందోళనతో చెమటలు వచ్చి
భయపడిపోతుంటారు. ఇలా పరీక్షలంటే భయపడే వారికి హోమియోలో మంచి మందులున్నాయి.
మందులతో పాటు వీరిలో ఆత్మ విశ్వాసం పెంపొందించ టానికి కౌన్సిలింగ్ లాంటివి
ఇస్తే ‘భయాన్ని’ అధిగమించి పరీక్షలు సక్రమంగా రాయగలుగుతారు.
భయానికి కారణాలు
నెగెటీవ్ ఆలోచనా విధానంతో పరీక్షలంటే భయం ఏర్పడు తుంది. చదివినవి వస్తాయో రావో... చదివినవి వచ్చినా సరి గా రాస్తానో లేదో.. అన్ని గుర్తుకు వస్తాయో రావో... మంచి మార్కులు రాసిన వాటికి వేస్తారో లేదో... తక్కువ మార్కులు వస్తే ఎలా...? అని పరీక్ష రాయకముందే ఆలోచన చేస్తూ భయపడుతుంటారు.
కొందరు సరైన ప్రణాళికతో పరీక్షలకు సిద్ధం కాకపోవడం. పరీక్షల సమయానికి కొన్ని సబ్జెక్ట్స పూర్తిగా చదవకపోవడం. ఆయా సబ్జెక్ట్సకు చెందిన స్టడీ మెటీరియల్ పరీక్షల సమ యానికి అందుబాటులో లేకపోవడం.
భయం-లక్షణాలు
భయానికి కారణాలు
నెగెటీవ్ ఆలోచనా విధానంతో పరీక్షలంటే భయం ఏర్పడు తుంది. చదివినవి వస్తాయో రావో... చదివినవి వచ్చినా సరి గా రాస్తానో లేదో.. అన్ని గుర్తుకు వస్తాయో రావో... మంచి మార్కులు రాసిన వాటికి వేస్తారో లేదో... తక్కువ మార్కులు వస్తే ఎలా...? అని పరీక్ష రాయకముందే ఆలోచన చేస్తూ భయపడుతుంటారు.
కొందరు సరైన ప్రణాళికతో పరీక్షలకు సిద్ధం కాకపోవడం. పరీక్షల సమయానికి కొన్ని సబ్జెక్ట్స పూర్తిగా చదవకపోవడం. ఆయా సబ్జెక్ట్సకు చెందిన స్టడీ మెటీరియల్ పరీక్షల సమ యానికి అందుబాటులో లేకపోవడం.
భయం-లక్షణాలు
- చెమటలు పట్టడం, కాళ్ళు చేతులు వణుకు రావడం.
- ఆకలి తగ్గి ఆహారం సరిగా తీసుకోకపోవడం.
- ఆలోచనలతో నిద్ర పట్టకపోవడం.
- మాటలు తడబడటం. ఎవరితో మాట్లాడలేక పోవడం.
- చదువు మీద శ్రద్ధ, ఆత్మ విశ్వాసం కోల్పోవడం.
- వీరి ప్రవర్తన భాద్యతా రాహితంగా ఉంటుంది.
- చిరాకు, ధ్వేషం, కోపం ఎక్కువగా ఉంటుంది.
- శ్రద్ధ పెట్టకపోవడం, పనులను వాయిదా వేయటం.
- ఏకాగ్రత లోపించడం, తలనొప్పి రావడం.
- తమలో తామే బాధపడటం వంటి లక్షణాలతో ఉంటారు.
తల్లిదండ్రులు ఏం చేయాలి?
మానసిక ఒత్తిడికిలోనై భయపడే పిల్లలను గుర్తించాలి. వారి భయానికి కారాణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. చిరా కు పడకుండా పరీక్షల భయాన్ని తొలగించడానికి ప్రయత్నిం చాలి. అవసరమైతే వైద్యుల దగ్గరికి తీసుకెల్లి కౌన్సిలింగ్ లేదా సలహాలను ఇప్పించాలి. పరీక్షల సమయంలో పిల్లలకు మంచి పోషక ఆహారం అందించాలి. పరీక్షలకు అవసరమైన అన్ని విషయాలకు సంబంధించి పుస్తకాలు పిల్లలకు అందు బాటులో ఉండే విధంగా చూడాలి.
పరీక్షల సమయంలో తల్లిదండ్రులు పిల్లలతో స్నేహంగా ఉం డాలి. వారిని భయపెట్టి చదివించే ప్రయత్నం చేయకూడదు. వారికి చదువు మీద శ్రద్ధ కలిగించే ఆదర్శవంతమైన మంచి మాటలు చెప్పి చదివించే ప్రయత్నం చేయాలి.
ఇలా బయటపడాలి
పరీక్షల భయంతో బాధపడేవారు తమ చుట్టు ప్రశాంత వాతావరణం ఉండేలా చూసుకోవాలి. ఒంటరిగా ఉండ కుండా మిత్రులతో గడపటం, అంతర్మధనాలకు దూరం గా ఉండడం, భావోద్వేగాలను, ఆలోచనలను, అభి ప్రాయాలను అణచిపెట్టకుండా ఎప్పటికప్పుడు ఆత్మీయు లతో, తల్లిదండ్రులతో పంచుకోవడం వంటివి చేస్తే భయం నుండి తొందరగా బయటపడవచ్చు. అలాగే హార్మోన్ల సమ తుల్యతను కాపాడటానికి మంచి ఆహారం తీసుకోవాలి. మానసిక ఒత్తిడి, పరీక్షల భయం నివారణకు నిత్యం యోగా, మెడిటేషన్‌తో పాటు సరైన ప్రణాళికతో పరీక్షలకు సిద్ధం కావాలి. నెగెటీవ్ ఆలోచన విధానాన్ని విడనాడి ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకొని మంచి జీవన విధానంను అలవరుచుకొనుటకు విద్యార్థులు ప్రయత్నం చేయాలి.
చికిత్స
వీరిని వెంటనే గుర్తించి నలుగురితో కలిసి ఉండే విధంగా కౌన్సిలింగ్ ఇప్పించాలి. పరిసరాలను మార్చడం వంటివి చేస్తూ హోమియో మందులను వాడి ప్రయోజనం పొంద వచ్చు. హోమియో వైద్యవిధానంలో ప్రతి ఔషదం మాన సిక లక్షణాలతో కూడి ముడిపడి ఉంటుంది. కావున మాన సిక రుగ్మతలకు హోమియో ఒక వరం. మందుల ఎంపి కలో కూడా మానసిక, శారీరక తత్వాన్ని ఆధారంగా చేసు కొని మందులను సూచించడం జరుగుతుంది కనుక సమూలంగా రుగ్మతలను నయం చేయడం సాధ్యం అవు తుంది.
మందులు
ఎకోనైట్ : పరీక్షలకు ముందు ‘టెన్షన్’ పడేవారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది. వీరికి మానసిక స్థాయి లో ఆందోళన, ఆస్తిమితం, ఉద్వేగపూరితమైన భయానికి లోపవుతారు. వీరికి నాడి వేగంగా, బలంగా కొట్టుకుం టుంది. వీరు భయంతో చనిపోతామన్న భావనకు గురవు తారు. వీరికి జన సమూహం, చీకటి అన్న ఎక్కువగా భయం. భయంతో వీరు నిద్రలేమితో బాధపడుతుంటారు. ఇటువంటి లక్షణాలు ఉన్న వారికి ఈ మందు వాడి ప్రయో జనం పొందవచ్చు.
జెల్సిమియం: విద్యార్థులు పరీక్షలంటేనే భయపడి పోతారు. పరీక్ష హాలుకు వెళ్లాలంటే తత్తరపడిపోతారు. తత్తరపాటుతో విరేచనాలు కావడం ఈ రోగి యొక్క గమ నించదగిన ప్రత్యే లక్షణం. పరీక్షలంటేనే వణుకు, దడ, తలనొప్పి మొదలవుతుంది. మూత్ర విసర్జన అనంతరం తలనొప్పి తగ్గిపోవుట ఈ రోగి యొక్క మరొక విచిత్ర విశిష్ట లక్షణం. ఇలాంటి లక్షణాలున్న వారికి ఈ మందు ప్రయోజనకారి.
ఆర్జెంటం నైట్రికం: వీనికి ఏ పని తలపెట్టాలన్నా గంద రగోళం పడిపోతుంటారు. రేపు పరీక్షలంటే ఈ రోజు రాత్రి వీరికి నిద్రపట్టదు. పరీక్ష హాలుకు ఒక గంట ముందే వెళ్లి కూర్చోవాలనిపిస్తుంది. వీరు పరీక్షకు వెళ్లే ముందు విరేచ నానికి వెళ్తారు. ‘ఎగ్జామినేషన్ ఫంక్’కి ఇది మంచి ఔషధం. మానసిక స్థాయిలో ఈ రోగికి పంచదార, తీపి అంటే ప్రాణం. వీరు లిఫ్ట్‌లో వెళ్లాలన్నా, రోడ్డు మీద నడవా లన్నా, వంతెన దాటాలన్నా భయాందోళనకు గురవుతారు. ఇటువంటి లక్షణాలతో పరీక్షలంటే భయపడే వారికి ఈ మందు బాగా పనిచేస్తుంది.
నైట్రోమోర్ : వీరు భయంతో దిగులుగా కనిపిస్తారు. చిన్న చిన్న విషయాల పట్ల కూడా ఉద్రేకపడతారు. వీరు ఓదా ర్పును ఇష్టపడరు. జాలి చూపిస్తే కోపం తెచ్చుకునే వాళ్లకు ఈ మందు ఆలోచించదగినది. తలనొప్పితో బాధపడే పిల్లలకు ఈ మందు ముఖ్యమైనది. జ్ఞాపక శక్తి తగ్గి మతి మరుపుతో బాధపడుతుంటారు. వీరు మౌనస్వభావులు. ఇటువంటి లక్షణాలున్న వారికి ఈ మందు బాగా పని చేస్తుంది.
ఈ మందులే కాకుండా కాల్కేరియాఫాస్, జెన్సింగ్, సెఫి యా, ఫాస్ఫారస్, బెల్లడొనా, కాల్కేరియాకార్బ్, సల్ఫర్, జిం కంమెట్, ఆరంమెట్ వంటి మందులను లక్షణ సముదా యంను అనుసరించి డాక్టర్ సలహా మేరకు వాడుకొని పరీక్షల భయం నుండి విముక్తి పొందవచ్చు. తగు చికిత్స తో చక్కటి ఫలితాలను ఆశించవచ్చు.
0 Comments