Full Style

>

పాలీ హైడ్రామ్నియాస్‌ ఉమ్మనీరు అధికంగా ఉండడం

పాలీ హైడ్రామ్నియాస్‌ లేక ఉమ్మనీరు ఉండవలసిన దానికంటే బాగా ఎక్కువగా, 2000 మి.లీ. కంటే ఎక్కువ ఉండే అసాధరణ స్థితి. అల్ట్రాసౌండ్‌ పరీక్షద్వారా ఈ పరిస్థితిని సులభంగా, కచ్చితంగా గుర్తించ వచ్చు. 0.4 - 1.5 శాతం గర్భాలలో ఈ సమస్య ఉంటుంది.
కారణాలు

pregn1.తల్లికి సంబంధించినవి:
  • మధుమేహవ్యాధి ఉన్న గర్భాలలో 1.5-6.6 శాతానికి పాలీహైడ్రా మ్నియాస్‌ సమస్య ఉంటుంది.
  • తల్లికి గుండె జబ్బు, మూత్రపిండాల వ్యాధులు
  • ఆర్‌.హెచ్‌. ఇంకంపొటబిలిటీ సమస్య వల్ల కూడా ఉమ్మనీరు అధికంగా ఉండవచ్చు.
    2.మాయకు సంబంధించినవి:
  • మాయ అసహజంగా ఉన్నప్పుడు, మాయ రక్తనాళాలకు సంబంధించిన సమస్య ఉన్నప్పుడు ఉమ్మనీరు అధికంగా ఉండవచ్చు.
  • మాయలో కణితి
    3.శిశువుకు సంబంధించినవి:
  • ఒకే అండాన్నుండి ఏర్పడిన కవలలు ఉన్నప్పుడు 25 శాతం కేసుల్లో ఈ సమస్య ఉంటుంది. ఉమ్మనీరు అధికంగా ఉండే కేసుల్లో 12.7 శాతానికి కారణం శిశవుకు వైకల్యాలు
  • గర్భం సమయంలో ఇన్ఫెక్షన్లు
  • రక్తానికి సంబంధించిన సమస్యలు

    రకాలు
  • కొద్ది వారాలలో నెమ్మదిగా పెరగడం
  • అకస్మాత్తుగా కొద్దిరోజులలో పెరగడం
  • సామాన్యంగా ఉమ్మనీరు క్రమంగా, నెమ్మదిగా ఎక్కువవుతుంది.

    లక్షణాలు
  • తల్లి పొట్ట చాలా పెద్దదిగా ఉండి నడవడమే అతి ప్రయాసగా ఉంటుంది.
  • ఆయాసం, సొమ్మసిల్లిపోవడం, గుండెదడ ఉండొచ్చు.
  • పాదాలు, కాళ్ళవాపు, సిరలు పొంగడం ఉంటుంది.
  • పొట్టను పరీక్షించినప్పుడు విపరీతంగా పెరిగిన గర్భాశయం ఉంటుంది.
  • పొట్టమీద చర్మం బిగసి, సాగి, మెరుస్తుంది.
  • ప్రక్కలు నిండుగా ఉంటాయి.
  • శిశువు శరీర భాగాల్ని తాకడం కష్టమవుతుంది. ఏ పొజిషన్లో బిడ్డవుందో తెలుసుకోవడం,
  • గుండె చప్పుడును వినడం కష్టమవుతుంది.
  • యోనిద్వారా పరీక్ష చేసినప్పుడు సర్విక్స్‌ తెరుచుకుని ఉండి బిడ్డను చుట్టి న పొరలు ఉబ్బి వేలికి తగలుతాయి.

    ఇతర పరీక్షలు
  • రక్తం గ్రూపు, ఆర్‌.హెచ్‌, టైపు పరీక్ష
  • హిమోగ్లోబిన్‌, పూర్తి బ్లడ్‌ కౌంట్స్‌
  • బ్లడ్‌ షూగర్‌
  • మూత్రం పరీక్ష
  • షూగర్‌, ఆల్బుమిన్‌, చీముకణాలు
  • ఎక్స్‌-రే అల్ట్రాసౌండ్‌

    రాగల ప్రమాదాలు
  • తల్లికి, బిడ్డకు కూడా కొన్ని ప్రమాదాలు, అనారోగ్యాలు రావచ్చు. ఉమ్మనీరు ఎక్కువగా ఉండడం, గర్భాశయం కండరాలు విపరీతంగా సాగడం కార ణంగా సమస్యలు వస్తాయి.
  • గర్భం కారణంగా వచ్చే అధిక రక్తపోటు
  • నెలలు నిండకమునుపే ప్రసవం
  • ప్రసవానికి ముందే ఉమ్మనీటి సంచి పగలిపోవడం
  • గుండె, ఊపిరితిత్తులమీద ఒత్తిడి కారణంగా ఊపిరి అందడం కష్టమవడం
  • ప్రసవ సమయంలో మాయ విడిపోయి అధిక రక్తస్రావం, షాక్‌లోకి వెళ్ళడం
  • బొడ్డుతాడు కిందికి ఉండడం, కిందకు జారడం
  • ఆపరేషన్‌ చేసే అవకాశం ఎక్కువవడం
  • ప్రసవమయాక అధిక రక్తస్రావం
  • ఏమ్నియాటిక్‌ ఫ్లూయిడ్‌ ఎంబాలిజమ్‌
  • ప్రసవం తరువాత గర్భాశయం సక్రమంగా ముడుచుకోకపోవడం, గర్భం పూర్వస్థితికి రాకపోవడం
  • ఇన్ఫెక్షన్‌ ప్రమాదం ఎక్కువ ఉండడం

    బిడ్డ
  • నెలలు నిండక మునుపే ప్రసవమయే అవకాశం ఎక్కువ ఉండడం వల్ల, బొడ్డుతాడు కిందకు జారడం, మాయ విడిపోయి అధిక రక్తస్రావం కార ణంగా శిశువుకు ఊపిరి అందకపోవడం వలన చనిపోవచ్చు.
  • శిశువుకు ఉన్న కొన్ని వైకల్యాలు వల్ల కూడా చనిపోవచ్చు.

    సంరక్షణ
  • హాస్పటల్లో ఉంచి తల్లిని సంరక్షించి ఆమెకు ఉన్న బాధల్ని తగ్గించడానికి తగిన చర్యల్ని తీసుకోవాలి.
  • శిశువుకు చాలా ప్రధానమైన వైకల్యాలు ఉన్నాయేమో తెలుసుకోవడానికి పరీక్షల్ని చెయ్యాలి.
  • ప్రోటీన్‌ ఎక్కువ, ఉప్పు తక్కువ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.
  • ఈ సమస్యతోపాటు ప్రీ ఎంక్లాప్సియా, డయాబెటిస్‌ ఉంటే వాటికి తక్ష ణం చికిత్స చెయ్యాలి.
  • శిశువుకు వైకల్యాలు లేనప్పుడు, మందులతో చికిత్స వల్ల ఆయాసం, గుండె దడ తగ్గకుండా
  • తీవ్రమయినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుం టూ 400-500 మి.లీ. ఉమ్మనీటిని గర్భాశయం లోపలినుండి తీసే యాలి. ఇలా ఉమ్మనీటిని తీసినప్పుడు 50 శాతం కేసుల్లో ఉంటే ప్రారం భమవచ్చు.
  • శిశువుకు వైకల్యం ఉంటే గర్భస్రావం చెయ్యాలి.
  • బొడ్డుతాడు కిందకు జారిందేమో, బిడ్డ అసహజమైన స్థితిలో ఉందే మోనని జాగ్రత్తగా గమనించాలి.
  • బిడ్డపుట్టాక రక్తస్రావం ఎక్కువ అవకుండా ఉండటానికి తగిన చర్యల్ని తీసుకోవాలి.

Post a Comment

0 Comments