Full Style

>

ఉద్యోగరిత్యా ఎక్కువ సమయాన్ని కంప్యూటర్ ముందు గడుపుతున్నారా..?



Health Tips for Computer Users


ఉద్యోగరిత్యా గంటల కొద్ది సమయాన్ని కంప్యూటర్ ముందు వెచ్చిస్తున్నారా..? అయితే, మీ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు పలు చిట్కాలు పాటించక తప్పదంటున్నారు వైద్యులు..
మీరు కంప్యూటర్ ముందు కూర్చొని ఎక్కువ సేపు పని చేస్తున్నట్లైతే, కంప్యూటర్ నుంచి దాదాపు 30 సెంటీమీటర్ల దూరంలో కూర్చోని పనిచేయండి. ఒకవేళ కంప్యూటర్ మానిటర్ బ్లింక్ అవుతుంటే దాంతో పని చేయడం మానివేయండి. గంటకొకసారి లేచి నడవడం అలవాటు చేసుకోండి. కంప్యూటర్ ముందు కూర్చొని ఎక్కువసేపు పని చేయాల్సి వచ్చినప్పుడు ప్రతి అరగంటకు ఒకసారి మీ దృష్టిని కాసేపు మరల్చండి, లేదా నీటితో శుభ్రం చేసుకోండి.
మీ మెడను మెల్లగా ఒత్తండి. అలాగే కుడి-ఎడమవైపుకు తిప్పండి. క్రమం తప్పకుండా కళ్ళకు సంబంధించిన వ్యాయామం చేయండి. వీలైనంత ఎక్కువ సమయం నిద్రపొండి. అలాగే మంచి పౌష్టికరమైన ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోండి. ఇలా చేస్తే ఆరోగ్యంగా ఉండటమే కాకుండా చలాకీగాకూడా ఉంటారంటున్నారు వైద్యులు.గంటలకొద్దీ కంప్యూటర్ ముందు కూర్చునేవారు సరైన పద్ధతిలో కూర్చోవాలి లేకుండే నడుం లేదా మెడ నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది, వాటిని నివారించటం కోసం చిన్న చిన్న వ్యాయామాలు చేస్తే సరిపోతుంది.

Post a Comment

0 Comments