Full Style

>

బీట్రూట్ జ్యూస్ లోని నైట్రేట్ రక్తపోటును తగ్గిస్తుంది

లండన్లోని క్వీన్ మేరీ యూనివర్సిటీ జరిపిన పరిశోధనలో బీట్రూట్ జ్యూస్ లో ఉన్నటువంటి నైట్రేట్ కు రక్తపోటును తగ్గించే గుణాలున్నట్లు నిరూపించబడింది .

రక్తపోటు ఉన్నవారిలో కొంత మందికి నైట్రేట్ మాత్రలూ, మరికొందరికి బీట్రూట్ జ్యూస్ ఇచ్హినప్పుడు 24 గంటలలో వారికి రక్తపోటు తగ్గిందట.

బీట్రూట్ జ్యూస్ ను గుండె జబ్బు ఉన్నవారు తాగితే అందులో ఉన్నటువంటి నైట్రేట్ వారి రక్తంలోని నైట్రిక్ ఆసిడ్ గ్యాస్ ను అధికం చేసి వారి గుండె ఆరొగ్యంగా ఉండటంలో సహకరిస్తుందని క్వీన్ మేరీ విల్లియం హార్వే రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్లో వ్యాస్కులర్ బయాలజీ ప్రొఫెసర్ గా ఉంటున్న అమిత్రా అహుల్వాలియా తెలిపేరు.

నైట్రేట్ మాత్రలూ, బీట్రూట్ జ్యూస్ రక్తపోటుని తగ్గించటంలో ఒకే విధంగా పనిచేస్తున్నాయి. రోజుకు 250 ML బీట్రూట్ జ్యూస్ తీసుకుంటే చాలుట. రక్తంలో నైట్రిక్ ఆసిడ్ గ్యాస్ ఎంత తక్కువగా ఉంటే, రక్తపోటు అంత అధికంగా ఉంటుందట. అది ఎప్పుడు తగ్గుతుందో, ఎప్పుడు రక్తపోటు అధిక మవుతుందో కనుక్కోవటం కష్టం కనుక రోజూ బీట్రూట్ జ్యూస్ తాగితే చాలా మంచిదట.

రెండు సంవత్సరాల క్రితం బీట్రూట్ జ్యూస్ తాగితే రక్తపోటు తగ్గుతుందని మాకు తెలిసింది కానీ బీట్రూట్ లోని ఏ గుణం వలన అనేది ఇప్పుడే తెలుసుకున్నామని ఆయన తెలిపేరు.

బీట్రూట్లో ఆరోగ్యానికి కావలసినంత మంచి గుణాలున్నయట. అవి:



1) బీట్రూట్లో రోజుకు కావలసినంత ఫోలిక్ ఆసిడ్, విటమిన్లు బి1, బి2, బి3, విటమిన్ ఏ, విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం,ఫాస్ ఫరస్, పొటాషియం మరియూ సోడియం ఉన్నాయి.

2) బీట్రూట్ జ్యూస్ తాగితే రక్తం బల పడుతుంది. రక్తపోటు తగ్గిస్తుంది మరియూ గుండె జబ్బులకు నివారణగా పనిచేస్తుంది.

3) బీట్రూట్ ని నీటిలో ఉడకపెట్టినప్పుడు, ఆ నీరు మొటిమలూ మరియూ సెగ్గెడ్డలను తగ్గిస్తుంది.

4) బీట్రూట్ ని పచ్హిగా తింటే మంచిది. ఉడక బెట్టినప్పుడు అది కొంత విటమిన్లను పొగొట్టుకుంటుంది.

5) పసిపిల్లలలో న్యూరల్ ట్యూబ్ లోని లోపాలని పొగొడుతుంది కనుక గర్భిణీ స్త్రీలు కు ఇది చాలా మంచిది. 



చలికాలంలో ఆరోగ్యానికి బీట్రూట్


చలికాలంలో బీట్రూట్ సేవిస్తుంటే ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది శరీరంలో శక్తిని నింపడమే కాకుండా ప్రేగులను శుభ్రపరిచే గుణం ఇందులో ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

బీట్రూట్ అంటేనే శరీరంలో రక్తవృద్ధికి తోడ్పడుతుందంటుంటారు పెద్దలు. కాని ఆరోగ్యపరంగా చూస్తే బీట్రూట్‌‍లో కొవ్వు పదార్థాలు లేనేలేవు. దీంతో ఈ కాయగూర ఆరోగ్యప్రదాయిని అని అంటారు ఆరోగ్య నిపుణులు. 

ఇందులో చాలా తక్కువ క్యాలరీలున్నాయి. అందునా పీచు(ఫైబర్) పదార్థం చాలా ఎక్కువ మోతాదులో ఉంది. అలాగే ఇందులో విటానిన్, బీటాకెరోటీన్‌లుండటం మూలానా ఇది వ్యాధి నిరోధకంగా కూడా పనిచేస్తుందంటున్నారు వైద్యులు. 

నిత్యం బీట్రూట్ సేవిస్తుంటే శరీర చర్మంలో నునుపదనంతోపాటు కాంతిని పెంపొదిస్తుంది. అలాగే శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంపొదిస్తుంది. కళ్ళ కాంతికి కూడా బీట్రూట్ ఎంతో లాభదాయకంగా పనిచేస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. బీట్రూట్ శరీరంలో కొవ్వు శాతాన్ని పెంచకుండా నిరోధిస్తుంది.

Post a Comment

0 Comments