Full Style

>

అతి లావు తగ్గడానికి వ్యాయామాలు


సర్వ సాదారణంగా మనం గమనిస్తూ ఉంటాం, పొట్ట భారీగా పెరగడం, మిగతా శరీరం సన్నగా ఉండటం, దినితో శరీరానికి ఉన్న అందం, ఆకర్షణ, ఆరోగ్యం ఉన్నవి కాస్త దెబ్బ తింటుంది.  శరీరం అంద వికారం గా తయారవు టుంది.  ఒక్కొక్కరికి 5 కిలోల నుండి 15-20 కిలోల బరువు ఒక్క పొట్ట లోనే ఉంటుంది.  దీనితో వారి ఆకారం 3 నెలలు నుండి 9 నెలల గర్భిణిలా అగుపిస్తు ఉంటుంది.  అందరు అవహేళన చేయడం వెనకాల విరి గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది.  ఇక తనకు తను ప్రేమించుకునే వ్యక్తి తనను తానూ అసహ్యహించుకుంటాడు.
 ఆకలి మందగించి, నడక తగ్గి,  చురుకుతనం తగ్గి బి.పి, షుగర్ కు, గుండెపోటుకు నిలయమై విలసిల్లుతుంది.  ఎప్పుడు ఏదో ఒక ఆరోగ్య సమస్య పుట్టుకొస్తుంది.  అందుచే వీటన్నిటిలో నుండి దూరంగా ఉండాలి అంటే నేను నేర్ప బోయే వ్యాయామాన్ని రోజు తప్ప కుండా సాధన చేయాలి,  బాణ కుండ లాంటి పొట్ట తగ్గించుకోవాలి.
ఉదర వ్యాయామం  :  వెల్లకిలా పడుకుని చేసేది.

కాళ్ళు చేతులు శరీరానికి దగ్గరగా ఉంచి గాడ శ్వాస పీల్చి పొట్టను ఉబ్బించాలి,  గాలి వదులుతూ పోత్తలోనికి లాక్కోవాలి  ఇలా 1 నుండి 5 నిముషాలు సాధన చేయాలి.
ప్రయోజనాలు:
పొట్టలోని గ్యాస్ బయటికి పోతుంది.  పొట్ట తేలిక అవుతుంది.  1-2 అంగుళాల పొట్ట తగ్గుతుంది.
ఏకపాద  ఉత్థాన పాదాసనం

చక్కగా పడుకుని గాలి పిలుస్తూ కుడి కాలు పైకి ఎత్తి కొన్ని క్షణాలు ఆపి గాలి వదులుతూ దించాలి.  ఇదే ప్రకారం ఎడమ కాలు కూడా చేయాలి,  ఇలా చేసేటపుడు రెండవ కాలు భూమికి అని ఉండాలి.  ఈ మాదిరిగా 10 నుండి 30 సార్లు చేయాలి.
ద్విపాద ఉత్తాన పాదాసనం

మొదటి విధానం: చక్కగా పండుకుని రెండు కాళ్ళు దగ్గరగా ఉంచి గాలి పిలుస్తూ కాళ్ళను దగ్గరగా ఉంచి గాలి పీలుస్తూ కాళ్ళను పైకి ఎత్తాలి.  మోకాళ్ళ వంచరాదు. కొన్ని క్షణాలు అక్కడే ఆగి గాలి వదులుతూ దించాలి,  ఇలా 5 నుండి 20 సార్లు వారి వారి శక్తిని బట్టి, మధ్య మద్యన విశ్రాంతి పొందుతూ చేయాలి.
రెండవ విధానం:  రెండు కాళ్ళను పైకి ఎత్తుతూ, దించుతూ నేలకు అనకుండా ఆపుతూ మళ్ళి మళ్ళి చేయాలి, ఇలా 5 నుండి 20 సార్లు విశ్రాంతి పొందాలి.
మూడవ విధానం:  రెండు కాళ్ళను ఒక అడుగు పైకి లేపి ఆపి అందులో నుండి ఒక కాలు పైకి ఎత్తాలి, రెండవ కాలు అలాగే గాలిలో ఉండాలి తిరిగి లేపిన కాలును నేలకు దగ్గరగా తెచ్చి ఆపి 2 కాలును పైకి ఎత్తాలి,  ఈ మాదిరిగా 4 నుండి 20 సార్లు చేయాలి.
ఉత్తాన పాదాసన ఫలితాలు: పొట్ట లోని కొవ్వు అమోఘంగా తగ్గి పోతుంది, పొట్ట కండరాలు బలపడతాయి  నాభి చలన సమస్య ఉన్న వారికీ ఇది వర ప్రసాదం.
ఏకపాద పవనముక్తాసనం

చక్కగా పడుకుని ఎడమకాలును నేలకు ఆన్చి ఉంచి కుడి కాలును కొద్దిగా లేపి మోకాలు వద్ద ముడిచి 2 చేతులతో పట్టుకుని గాలి వదులుతూ పొట్టకు వత్తుకుని తల లేపి దవడను మోకాలుకు ఆన్చి కొద్ది సేపు ఆపి తిరిగి గాలి పీలుస్తూ తలను కాలును యధాస్తానంలో  ఉంచుతూ గాలి వదలాలి,  ఇదే ప్రకారం గా ఎడమ కాలు చేయాలి.

ద్విపాద పవన ముక్తాసనం

చక్కగా పడుకుని రెండు కాళ్ళు ముడిచి రెండు చేతులతో మోకాలు వడ పట్టుకుని గాలి వదులుతూ తొడలతో వత్తాలి,  తల ఎత్తి మొక్కల్లు  మద్యన ఉంచాలి. కొద్ది క్షణాలు ఆగి తిరిగి గాలి పీలుస్తూ యధాస్తనానికి వచ్చి గాలి వదలాలి.  ఇలా అయిదు నుండి ఇరవై సార్లు చేయాలి.

ద్విపాద పవన ముక్తాసనంలో ఊగడం

ఫై ఆసనం చేస్తూ ముందుకు వెనకకు 10 నుండి 30 సార్లు ఊగాలి  ఒక నిమిషం విశ్రాంతి.

ద్విపాద పవన ముక్తాసనంలో దొర్లడం

పై ఆసనం వేసి పక్కలకు (కుడి ఎడమలకు) దోర్లాలి.  10 నుండి 40 సార్లు చేయాలి.

పవన ముక్తాసన ఫలితాలు: పొట్టలోని గ్యాస్ పై నుండి నోటి ద్వారా కింద నుండి గుద స్థానం ద్వారా వెళ్లి పోతుంది.  పొట్ట తేలిక అవుతుంది.  పొట్టలో మరియు చర్మం క్రింద నిల్వ ఉన్న కొవ్వు పదార్ధం కరిగి, చర్మం, ఉపిరి తిత్తులు (శ్వాస), ప్రేవులు, మూత్ర పిండాలు(మూల ముత్రాలు) ద్వారా బహిష్కరింప బడుతుంది.
పచ్చిమొత్తానాసనం

చక్కగా పడుకుని రెండు పాదాలు దగ్గరగా ఉంచి రెండు చేతులు తలపైకి లేపి నేలకానించి గాలి పీలుస్తూ లేచి కుర్చుని గాలి వదులుతూ ముందుకు వంగాలి.  తల మోకాళ్ళ వైపు, చేతులు పాదాల వైపు పోనిచ్చి వాటిని అన్చాడానికి  ప్రయత్నిచాలి. ప్రారంభంలో తల మోకాళ్ళకు తగలకపోవచ్చు, చేతులు పాదాలకు అందకపోవచ్చు,  కాని రోజు సాదన వల్ల సాధ్యమవుతుంది.  తిరిగి పండుకుని మళ్ళి మళ్ళి లేస్తూ ఈ ఆసనం చేయాలి.  కనిసం 5 నుండి 20 సార్లు చేయాలి.
గమనిక:  తీవ్రమయిన నొప్పి గలవారు ఈ ఆసనం చేయరాదు.

పచ్చిమొత్తానాసనం ఫలితాలు: నడుము బలపడుతుంది.  పొట్ట కరుగుతుంది, మలబద్దక నివారణ జరుగుతుంది,  వెన్నుబలంగా తయారవుతుంది.

పోట్టభారం తగ్గించే-భుజంగాసనం

రెండు అరచేతులు భూమిపై చాతిని ఇరువైపులా ఉంచి,  గాలి పీలుస్తూ తలను చాతి పైకి నిదానముగా ఎత్తాలి.  పది నుండి ఇరవై క్షణాలు అలాగే ఆగి,  గాలిని వదులుతూ తిరిగి మెల్లగా యధాస్థానానికి రావాలి.  ఇలా అయిదు నుండి పది సార్లు ఎవరి శక్తీ కొలది వారు చేయాలి.  చేసిన తరువాత పది నుండి ఇరవై సెకండ్లు  విశ్రాంతి పొందాలి.


భుజంగాసన ప్రయోజనాలు
ఈ ఆసనాన్ని క్రమబద్దంగా ప్రతీ రోజు ఆచరిస్తూ ఉంటె, అతిగా కొవ్వు పెరిగిన వారికి నాభి క్రింద గల కొవ్వు క్రమంగా తగ్గిపోతుంది, అంతేగాక, స్త్రీలలో గర్భాశయ శుద్ది జరిగి గర్భాశయంలోని గడ్డలు, కరిగిపోవడం లేదా పుట్టకపోవడం జరుగుతుంది.  ఇంకా మలబద్దక సమస్య కుడా నివారించండి వెన్నెముక బలపడుతుంది.


శరీర సౌందర్యానికి-శలభాసనము
రెండు చేతులను అర చేతులు క్రిందికి ఉండే విధంగా రెండు తొడలు క్రింద ఉంచి, నిదానంగా గాలికి పీలిస్తూ మొదట కుడికాలును తరువాత ఎడమ కాలును ఆ తరువాత రెండు కాళ్ళను పైకి లేపడం, ప్రతిసారి పది నుంచి ముపై సెకండ్లు ఆపటం,  ఆ తరువాత గాలి వదులుతూ నిదానముగా దించడం చేయాలి.  తరువాత అర నిమిషం విశ్రాంతి పొందాలి ఒక్కక్క విధానం అయిదు నుండి పది సార్లు ఆచరించాలి.

సూచన:  ఇందులో ఏకపాద శలభాసనం (కుడి-ఎడమ) అందరూ చేయవచ్చు ద్విపాద శలభాసనం గుండె రోగులు, హైబిపి కలవారు, గర్భిణి స్త్రీలు చేయకోడదు.

శలభాసనము-ప్రయోజనాలు
ఈ శలభాసనం అభ్యసనం చేయడం వల్ల క్రమంగా నడుముల్లో పేరుకు పోయిన చేడువాయువులు, కొవ్వు కరిగి పోయి నడుమునొప్పి తగ్గిపోతుంది, నడుములోని వెన్నుపూసలు బలపడతాయి, స్లిప్ డిస్క్ సమస్యలు తీరిపోతాయి మరియు గ్రధ్రసీ వాతపు(సియటికా)నొప్పులు తగ్గుతాయి. తోడలలోని కొవ్వు కూడా కరుగుతుంది, స్త్రీలకు ప్రసవించిన తరువాత జారిపోయిన పొట్టలోని కొవ్వు కరిగిపోయి తిరిగి పొట్ట నడుము సన్నగా తాయారు అవుతాయి.

Post a Comment

0 Comments