Full Style

>

బ్లాక్‌హెడ్స్ భరతం పట్టండి!


యుక్తవయసులో అమ్మాయిల ముఖంపై నల్లమచ్చలు సర్వసాధారణం. ఇవి ముఖారవిందాన్ని పాడుచేయడమే కాకుండా ఆత్మన్యూనతనూ కలుగచేస్తాయి. దీంతో పదిమందిలోకి వె ళ్లాలంటే బిడియపడతారు. రిలేషన్స్ దెబ్బతినే ప్రమాదమూ ఉంది. ఇవి ఎంతగా బాధిస్తున్నా కొంతమంది డాక్టర్లను సంప్రదించడానికి ఆసక్తి చూపించరు. మార్కెట్లో దొరికే క్రీములను రాస్తూ ముఖాన్ని మరింత పాడుచేసుకుంటారు.
ఇటువంటివారు కొన్ని సౌందర్య చిట్కాలను పాటించడం ద్వారా వారి ముఖ సౌందర్యానికి అడ్డుగా ఉన్న నల్ల మచ్చలను చెరిపేసుకోవచ్చు. అవి...
  • అర స్పూన్ నిమ్మరసానికి కాస్తంత గ్లిజరిన్ జోడించి ఆ మిశ్రమాన్ని నల్లమచ్చలున్న ప్రాంతంలో రాస్తే తొందర్లోనే వాటి బాధ వదిలిపోతుంది.
  • చిటికెడు పసుపును రెండు మూడు గోరింటాకులతో కలిపి పేస్ట్‌లా చేసి మచ్చలపై రాసినా మంచి ఫలితం ఉంటుంది.
  • కొంచెం పసుపు, కరివేపాకును కలిపి మెత్తని పేస్టులా చేసి మచ్చలపై రాయాలి.
  • ఎండిన తులసి ఆకులను పొడిచేసి దానికి వేపాకు పొడి, పుదీనా 100గ్రామలు కలుపుకోవాలి. దానికి కొంత పసుపు, రోజ్‌వాటర్ కలిసి పేస్ట్‌లాగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మచ్చలపై రాస్తే నల్లమచ్చలు మాయమవడమే కాకుండా చర్మం మెరుపును సంతరించుకుంటుంది.
  • ఎండిన తమలపాకులను పొడి చేసి దానికి కొంచెం కొబ్బరినూనె కలిపి ఆ మిశ్రమాన్ని మచ్చలపై రాసినా ఉపయోగం ఉంటుంది.
  • రాత్రి పడుకునే ముందు కొంచెం నీళ్లలో చపాతీని నానబెట్టి మర్నాడు ఉదయం దాన్ని పేస్ట్‌లాగా చేసి ముఖానికి పట్టించండి. ఇలా కొన్ని రోజులపాటు క్రమం తప్పకుండా చేస్తే బ్లాక్‌హెడ్స్ తొలగిపోతాయి.
  • కుంకుమపువ్వును పొడి చేసి దానికి కొంత తేనె కలిపి ముఖానికి రాసుకుంటే బ్లాక్‌హెడ్స్ తొందరగా మాయమవుతాయి.
  • మచ్చలను తొలగించడంలో సిట్రస్ జాతికి చెందిన పండ్లరసాలకు మించింది లేదు. కొంచెం నిమ్మరసాన్ని కాటన్‌తో తీసుకుని నల్లటి మచ్చలపై రాసి సుతిమెత్తగా మసాజ్ చేయాలి. దీనిలో ఉన్న విటమిన్-సి మచ్చలపై మంచి ప్రభావం చూపిస్తుంది.
  • కొంచెం దూదిపై పాలు లేదా మజ్జిగ చుక్కలు వేసి దాన్ని మచ్చలున్న ప్రాంతంపై రాసుకోండి. వీటిలో ఉండే ల్యాక్టిక్ యాసిడ్ చర్మాన్ని తెల్లగా మార్చుతుంది.
  • మచ్చలున్న ప్రదేశంలో తేనెను రాసి 20 నిమిషాల తర్వాత కడిగేయండి. తేనెలో ఎన్నో చక్కటి ఔషధ గుణాలున్నాయి. అవి నల్లమచ్చలను తొలగించడంలో తోడ్పడతాయి.
  • విటమిన్-ఇ ఆయిల్‌ను రాత్రి నిద్రకు ముందు ముఖానికి రాసుకుని తెల్లారి లేచిన తర్వాత కడుక్కోండి.
  • వీటితోపాటు నిత్యం సన్‌స్క్రీన్ లోషన్‌ను ముఖానికి రాసుకోవడం మర్చిపోవద్దు.
  • సూర్యుడి కిరణాల కారణంగా చర్మంలో ఉండే మెలానిన్‌లో హెచ్చుతగ్గులు వస్తాయి. ఈ మెలానిన్ శాతం తగ్గినప్పుడు చర్మంపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి. కాబట్టి పైన చెప్పిన చిట్కాలను పాటించడం వల్ల చర్మం మెరుపును సంతరించుకోవడంతో పాటు నల్లమచ్చలు తొలగి ముఖం మరింత అందంగా కనబడుతుంది.

Post a Comment

0 Comments