వాతావరణం మారిందం ముఖం చర్మం రంగుమారిపోయి అందవిహీనంగా తయారవుతుంది. తిరిగి సహజమైన మెరుపు పొందడానికి ఇంట్లోనే దొరికే కొన్ని పదార్థాలతో ముఖానికి అప్లె చేస్తే సరి. మీ సహజమైన రంగు మీ సొంతమవుతుంది.
సాధారణ స్కిన్
- ఆరెంజ్ జ్యూస్ కానీ టమాటా జ్యూస్ కానీ తీసుకోండి. దానికి రెండు టీస్పూన్ల పెరుగును జతచేయండి. ఆ మిశ్రమాన్ని ముఖంపై కిందినుంచి పైకి మర్దనా చేయండి. ఆరిన దాకా ఉంచి చల్లని నీటితో కడిగి పొడి ట ల్‌తో తుడవండి. స్కిన్‌కు గ్లో వస్తుంది.
- పొప్పడి పండు తొన లోపలి పొరను మీ ముఖంపై మృదువుగా రుద్దండి. తర్వాత చల్లని నీటితో కడిగేయండి.
- 50 గ్రాముల క్యాబేజ్ నుంచి జ్యూస్ ( సగం కప్ ) తీయండి. దీనిని ముఖానికి అపె్లై చేయండి. ఆరిన తరువాత చల్లని నీటితో కడిగేయండి. స్కిన్ బిగుతుగా అయి ముడతలు నివారిస్తుంది.
- క్యారట్ జ్యూస్ తీసుకుని ముఖానికి మర్దనా చేయండి. ఆరిన తరువాత చల్లని నీటితో కడిగేయండి.
- ఐస్ క్యూబ్‌ను తీసుకుని ముఖానికి మర్దనా చేయండి. ఇది ముఖంలో రక్త ప్రసరణ పెంచి ముఖాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడుతుంది.
డ్రై స్కిన్
- అరటి పండు సగం తీసుకోండి. దీనికి ఓ టీస్పూన్ తేనెను కలిపి పేస్ట్‌చేయండి. ఆ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లె చేయండి. ఆరిన తరువాత చల్లని నీటితో కడిగేయండి.
- రెండు స్పూన్ల పచ్చి పాలను తీసుకోండి. ముఖంపై అప్‌వర్డ్‌లో మృదువుగా మర్దనా చేయండి. ఆరిన తరువాత కడిగేయండి.
ఆయిలీ స్కిన్
- రెండు స్పూన్ల పచ్చి పాలను, రెండు స్పూన్ల కీరదోస జ్యూస్‌ను కలపండి. దీనికి కొన్ని చుక్కల నిమ్మరసాన్ని జతచేయండి. దీనిని కాటన్‌తో మీ ముఖంపై అప్లె చేయండి. పూర్తిగా ఆరిన తరువాత నీటితో కడిగేయండి.
- రెండు లేదా మూడు స్పూన్ల ఎర్రపప్పు తీసుకోండి. దీనిని రాత్రంతా నానబెట్టండి. ఉదయమే దానిని పేస్ట్ చేసి మీ ముఖానికి అప్లె చేయండి. ఆరిన తరువాత చల్లని నీటితో కడిగేయండి. నల్లమచ్చలను తొలగిస్తుంది. ముఖంలోని అదనపు ఆయిల్‌ను తొలగిస్తుంది.
0 Comments