Full Style

>

పేలాలతో రోగాల నివారణ


తెలుగులో పేలాలు, ఇంగ్లీషులో ఔ్యఔఔళజూ, ఔ్యఔఔజశ, ఔ్యఔఒ.. ఇవి ధ్వన్యనుకరణ పదాలు. ధాన్యపు గింజను వేయిస్తే అవి పేలి, పువ్వులా విచ్చుకొంటాయి. అందుకని పేలాలు అంటారు. వడ్లు, బియ్యం, బార్లీ, జొన్నలు, మొక్కజొన్నలు, శనగలు, పెసలు ఇలాంటి ధాన్యాలను పేల్చి పేలాలు తయారుచేస్తారు. పేలాలను లాజలు, లాజులు, బొరుగులు, బొరువులు పేర్లతో తెలుగులో పిలుస్తారు. ఋగ్వేదకాలం నాటికే ధాన్యాలను పేల్చుకొని పేలాలు తిన్నారు. పేలాలను బెల్లం ముక్కతోనో, తేనెతోనో తినటం అలవాటు. ఉప్పూ, కారం అయినా కలిపి తినాలని నియమం.


మొక్కజొన్న పేలాలు: 

మొక్కజొన్న గింజ లోపల 14 శాతం నీరు ఉంటుంది. 400 డిగ్రీల వరకూ వేడిని ఈ గింజలకు ఇచ్చినపుడు గింజ లోపలి నీరు ఆవిరై, వత్తిడి ఫలితంగా గింజలోని పిండి పదార్థం పేలి, దాని అసలు పరిమాణానికన్నా 40 శాతం ఎక్కువగా పువ్వులా విచ్చుకొంటుంది. అమెరికన్ రెడ్డిండియన్ జాతులవారు దేవతా విగ్రహాలను మొక్కజొన్న పేలాల దండలతో అలంకరిస్తారు. బెల్లం పాకం పట్టి ఉండలు చేసుకొంటారట కూడా. వీటిలో ఫైబర్ ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉంటాయి. బి-విటమినూ, ప్రొటీన్లూ అధికం.

వరి పేలాలు: 

ఇవి తియ్యగా, చలవచేసేవిగా ఉంటా యి. మలమూత్రాలు ఎక్కువగా కాకుండా కాపాడుతాయి. వాంతులు, విరేచనాలు, దప్పికను తగ్గిస్తాయి. రక్తదోషాలను పోగొడతాయి.





పెసర పేలాలు:
 ఇవి విరేచనాలను బంధించి, నీటి శాతాన్ని తగ్గిస్తాయి. వాతాన్ని పెరగనీయవు.







జొన్న పేలాలు:
 షుగరు రోగులకు, స్థూలకాయం, జీర్ణకోశ వ్యాధులున్నవారికి మంచి చేస్తాయి.






రాగి పేలాలు: 
రాగులతో పేలాలు కన్నడం వారికి బాగా అలవాటు. ఒక కప్పు రాగులకు నాలుగు చెంచాలు పెరుగు కలిపి అరగంటసేపు ఆరనిచ్చి పేలాలుగా పేలుస్తారు. ఈ పేలాల పిండిలో కొబ్బరి తురుము, పాలు, పంచదార, నెయ్యి కలిపి ఉండలు చేసుకొంటారు. రాగి హురిహుట్టు అని పిలుస్తారు దీన్ని.



ఉలవ పేలాలు: 
ఉలవల సుగుణాలన్నీ ఉలవ పేలాలుగా తీసుకున్నపుడు మరింత ప్రభావాన్ని చూపిస్తాయి. అతిగా చెమట పట్టే లక్షణాలు తగ్గిస్తాయనీ, కొవ్వు కరిగేలా తోడ్పడతాయనీ శాస్త్రం చెప్తోంది.


కంది పేలాలు: 
కంది పేలాలు బలకరం. వాతాన్ని, రక్తదోషాలను, జ్వరాన్ని తగ్గిస్తాయి. వేయించిన కందిపప్పుతోగానీ, కంది పేలాలతోగానీ పప్పు వండుకొంటే తేలికగా అరుగుతుంది. మంచి రుచికరం.


శనగ పేలాలు: 
ఎండిన శనగలను వేయించి తిన్నట్లయితే వాతం పెరిగి చర్మరోగాలకు కారణవవుతాయి. నానబెట్టి సాతాళించుకున్న శనగలు మేలు చేస్తాయి. శనగ పేలాలు బొల్లి, ఎగ్జీమా లాంటి చర్మవ్యాధులకు కారణం అవుతాయని ఆయుర్వేద గ్రంథాలు చెపుతున్నాయి. టిఫిన్లు తినడం ఎక్కువయ్యాక చట్నీల కోసం కిలోల కొద్దీ పుట్నాల శనగపప్పు వాడుతున్నాం మనం.



బఠాణీ పేలాలు:
 కొంచెం వగరుగా ఉంటాయి. వాతం చేస్తాయి. ఉబ్బరాన్ని తెస్తాయి. అతిగా తింటే నడవలేని స్థితి వస్తుందంటూ వైద్య శాస్త్రం హెచ్చరించింది.




గుప్పెడు బియ్యం కన్నా దోసెడు మొర్మరాలు తేలికగా అరుగుతాయి కదా! పిల్లలకు ఇష్టమైన రీతిలో పేలాల భక్ష్యాలను తయారుచేయటం మంచిది. శనగ పేలాలు, బఠాణీ పేలాల గురించి శాస్త్రం వ్యతిరేకంగా చెప్పడం గమనార్హం.

Post a Comment

0 Comments