ఎందుకు వస్తుంది...
ఊపిరితిత్తులు మనం బతకడానికి కావలసిన ప్రాణవాయువుని శ్వాస ప్రక్రియ ద్వారా అందిస్తాయి. ప్రతి రోజూ మన శ్వాస కోశాలు వివిధ రకమైన వాతావరణ పరిస్థితులకు, ఎలర్జెన్స్‌కి, రసాయ నాలకి, పొగ, దుమ్ము, ధూళి తదితర వాటికి లోనవుతుంటా యి. వీటి వలన వివిధ రకాల దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి.ఆస్థమా సర్వసాధారణమైన దీర్ఘకాలిక జబ్బులలో ఒకటి. మన ముక్కులోకి, ఊపిరితిత్తులలోకి లేదా శరీరంలోకి సరిపడని సూక్ష్మపదార్థాలు (ఎలర్జెన్స్) గాలి ద్వారా లేదా ఆహారం ద్వారా ప్రవేశించినప్పుడు వాటికి ప్రతి చర్యగా మన శరీరం స్పందించి వివిధ రకాల రసాయనాలను విడుదల చేస్తుంది.
వీటి ప్రభావం వలన మన శ్వాస నాళాలు కుంచించుకొని పోతాయి. ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. ఆస్థమా ఉన్నవారిలో తరచుగా ఆయాసం రావడం, పిల్లి కూతలు, దగ్గు, ఛాతీ బరువుగా ఉండడం, వ్యాయామం చేయలేక పోవడం లేదా వ్యాయామం చేస్తే ఆయాసం రావడం తదితర లక్షణాలు కనిపిస్తాయి. వీరిలో తుమ్ములు ఎక్కువగా రావడం, ముక్కు నుంచి నీరు కారడం, తరచుగా జలుబు చేయడం వంటి లక్షణాలు ఉంటాయి. చాలా మందిలో ఈ ఆస్థమా లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.
వాతావరణ కాలుష్యంతో...
ఇంటి లోపలి గాలి కాలుష్యం వలన కూడా ఆస్థమా ఎక్కువ వచ్చు. ఇల్లు ఊడ్చడం వలన, గ్యాస్ స్టవ్ వాడడం వలన, వేపు డులు చేయడం వలన, అగరబత్తీలు వాడడం, ధూమపానం, వంట చేయడం వలన వచ్చే పొగలు తదితరాలు గాలిలోకి పార్టి క్యులేట్ మెటీరియల్స్, రసాయనాలు, నైట్రోజన్ డై ఆకై్సడ్, ఓజోన్ వంటి వాటిని విడుదల చేస్తాయి. వీటి వలన ఆస్థమా పెరగవచ్చు. ఇంట్లో వాడే ఎయిర్ ఫ్రెష్‌నర్స్, అయోనైజర్స్, జిరా క్స్ యంత్రాలు, ఎయిర్ క్లీనర్స్, ఫిల్టర్స్, ప్యూరిఫయర్స్ తదితర వాటి వలన ఇంట్లో ఓజోన్ ఉత్పత్తి అవుతుంది. బయటి వాతా వరణం కాలుష్యం వలన ఆస్థమా చాలా పెరుగుతుంది.
హైదరాబాదులో 70 శాతం గాలి కాలుష్యం వాహనాల వలన జరుగు తుంది. ముఖ్యంగా డీజిల్ వాహనాల వలన గాలిలోని పార్టిక్యు లేట్ మేటర్, నైట్రోజన్ డై ఆకై్సడ్, సల్ఫర్ డై ఆకై్సడ్, సీసం పొగ లు, కార్బన్ మోనాకై్సడ్ వంటివి సూర్యరశ్మితో చర్య జరిగి ఓ జోన్, పొగమంచును విడుదల చేస్తాయి. వీటి వలన బ్రాంకై టిస్, ఆస్థమా లాంటి సమస్యలు పెరుగుతున్నాయి. వీటన్నింటి వలన వేసవిలో ఆస్థమా వచ్చేవారి సంఖ్య పెరుగుతూ ఉంది. ఆస్థమా ఉన్నవారు జబ్బుని సరిగా అదుపులో ఉంచుకొనకపో యినా, దీర్ఘకాలికంగా అశ్రద్ధ చేసినా, ఎయిర్ వే రీమోడలింగ్ జరిగి సిఒపిడిగా పరిణామం చెంది తద్వారా గుండె ఫెయిల్ అవుతుంది. చిన్న పిల్లలో ఎదుగుదల, చురుకుదనం తగు ్గతాయి. తరచూ వచ్చే ఆయాసం వలన వృత్తికి లేదా బడికి సెలవు పెట్టడం తద్వారా కెరీర్ దెబ్బతినడం, కుటుంబ వైద్య ఖర్చులు పెరగడం జరుగుతుంది.
ఆస్థమాలో రకాలు...
ఎలర్జిక్, నాన్ ఎలర్జిక్ ఆస్థమా, యర్లీ, ఆన్‌సెట్ ఆస్థమా, వ్యాయామం వలన వచ్చే ఆస్థమా, పొడిదగ్గులాగా వచ్చే ఆస్థమా, వృత్తి ఆస్థమా, స్టిరాయిడ్ రెసిస్టెంట్ ఆస్థమాలు నేడు వస్తున్నాయి. వీటన్నింటిని సరిగా కనుక్కొని మందులను వాడుకోవాలి.
ఆస్థమా మాదిరిగా...
కొన్ని జబ్బులు ఆస్థమాలాగే ఉంటాయి. దీర్ఘకాలి బ్రాంకైటిస్, సిఒపిడి, పోస్ట్ నాసల్ డిశ్చార్జ్, జిఇఆర్‌డి, స్వర పేటికలోని ఓకల్ కార్డ్స్ పనిచేయకపోవడం, ఆస్టిరేషన్ (కడుపులోని పదార్థాలు ఊపిరితిత్తులలోకి వెళ్లడం), దీర్ఘకాలిక మైకోప్లాస్మా ఇన్‌ఫెక్షన్, బ్రాంకెస్టాసిస్ తదితర వాటిని సరిగ్గా కనుక్కొని వాటికి సంబంధించిన మందులు వాడాలి. చిన్న పిల్లలు, ముసలివారి జబ్బుకి సంబంధించిన లక్షణాలని గుర్తించలేరు. దీని వలన జబ్బు ముదిరి ప్రాణాంతకం కావచ్చు.
మందులు తప్పనిసరి...
ఆస్థమా ఉన్నవారు మందులు క్రమం తప్పకుండా వైద్యులు సూచించిన విధంగా వాడుకోవాలి. పీల్చే మందులే మంచివి. అవి ఎలా వాడుకోవాలో తగు శిక్షణ తీసుకోవాలి. ఒకసారి ఆస్థమా ఎటాక్ వస్తే దాని వలన కలిగే నష్టం తిరిగి మరమత్తు అవడానికి సుమారు ఆరు వారాలు పడుతుంది. అలాగే ఇంకొక ఎటాక్ రాకుండా చూసుకోవాలి. పీల్చే మందులలో ఇందు కొరకు ప్రివెంటర్స్ , రిలీవర్స్ అని రెండు రకాల మందులు ఉన్నాయి. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఉదా. గర్భిణీ స్ర్తీలు, శస్త్ర చిిత్స సమయంలో, ముక్కులో పాలిప్స్ ఉన్నవారు, ఇన్‌ఫెక్షన్ వచ్చినవారు, వృత్తి ఆస్థమా ఉన్నవారు ఆ కారణాన్ని బట్టి సూచించిన మందులు తప్పనిసరిగా వాడుకోవాలి.
జాగ్రత్తలు...
ఆస్థమా ఉన్నవారు క్రింది జాగ్రత్తలు పాటిస్తే తీవ్రతను తగ్గిం చుకోవచ్చు. ధూమపానానికి, ధూమపానం చేసేవారికి దూరం గా ఉండాలి. డస్ట్‌మైట్స్ రాకుండా దుప్పట్లు, దిండ్ల కవర్లు ప్రతివారం వేడినీటిలో తరచూ ఉతికి ఎండలో ఆరబెట్టాలి. ఇం ట్లో తివాచీలు ఉంచకూడదు. దుమ్మదూళికి దూరంగా ఉండా లి. ముఖ్యంగా పాత పుస్తకాలు, పేపర్ల జోలికి వెళ్లకూడదు. ఇల్లు ఊడవడానికి బదులు తడిగుడ్డతో తుడుచుకోవడం లేదా వాక్యూమ్ క్లీనర్స్ వాడుకోవడం మంచిది. ఇట్లో బూజులు దులపడం లాంటివి ఆస్థమా ఉన్నవారు చేయకూడదు. ముక్కు కి గుడ్డ కట్టుకొంటే మంచిది. పెంపుడు జంతువులని సాధ్యమై నంత దూరంగా ఉంచాలి. ఇంట్లో పురుగు మందులను స్ప్రే చేసేటప్పుడు ఇంట్లో ఉండకూడదు. శీతల పానీయాలు, ఐస్‌క్రీమ్‌లు, ఫ్రిజ్ వాటర్ వంటి పడని పదార్థాలకు దూరంగా ఉండాలి. పుప్పొడి రేణువులు గాలిలో ఎక్కువగా ఉన్న కాలంలో సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉంటే మంచిది.
ఆస్థమా తీవ్రతకు కారణాలు...

- చలికాలం
- పెంపుడు జంతువులు, వాటి వెంట్రుకల వలన
- గాలిలో రసాయనాల తుంపరల వలన
- దుమ్ములోని మైట్స్ వలన
- మందుల వలన (ఆస్ప్రిన్, బీటా బ్లాకర్స్)
- ఘాటు వాసనలు
- ఇంటి పరిసరాలలో బొద్దింకలు, ఎలుకలు ఎక్కువగా ఉన్నా
- జంతువుల చుండ్రు వలన
- వ్యాయామం వలన
- పుప్పొడి రేణువుల వలన
- వైరల్ ఇన్‌ఫెక్షన్ రావడం వలన
- పొగలు, ధూమపానం
- బాగా నవ్వినా లేదా ఏడ్చినా
ఆస్థమాకి కారణాలు చాలా ఉన్నాయి. ప్రధానమైనది జన్యు సంబంధిత కార ణాలు, వాతావరణ పరిస్థి తులు, ఇంటి లోపల, బయట వాతా వరణ కాలుష్యం వలన ఆస్థమా రావచ్చు లేదా పెర గవచ్చు.
ఇంటి లోపల వాతారవణ కాలుష్య కారకాలలో ము ఖ్యమైనవి డస్ట్‌మైట్స్. ఇవి ఒకరకమైన సూక్ష్మ జీవు లు. మన చర్మం నుండి చనిపోయి రాలిన కణాలపై పడతాయి. ఎక్కువగా తివాచీలు, దుప్పట్లు, పరుపులు, దిండ్లపై ఉంటాయి. కుక్కలు, పిల్లులు, పక్షులు తదితర ఇంట్లోని పెంపుడు జంతువుల వెం ట్రుకలు, చుండ్రు తదితర వాటి వలన ఆస్థమా పెరుగుతుంది. అలాగే ఎలుకలు, బొద్దింకలు ఇంట్లో ఉండడం వలన వాటి మలమూత్ర విసర్జనల నుండి వచ్చే రసాయనాల వలన ఆస్థమా పెరుగుతుంది. ఇంటి వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నా ఫంగస్ పెరుగుతుంది. దీంతో ఆస్థమా వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
0 Comments