ప్రస్తుత కాలంలో మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు వల్ల అనేక రకాలైన అనారోగ్యాల భారీన పడుతున్నారు. అధిక బరువు, తలనొప్పి, బ్యాక్ పెయిన్ వంటి సాధారణ సమస్యలతో పాటు మరొకటి పైల్స్. సాధారణంగా ఇది వంశపారంపర్యంగా వచ్చే వ్యాదే అయినప్పటికి.. జీవన శైలిలో మార్పుల వల్ల పైల్స్ ఏర్పడుతున్నాయి. హెమరాయిడ్స్‌ని సామాన్య పరిభాషలో పైల్స్ అంటారు. మనం తెలుగులో వీటిని మొలలు అని అంటాం. ఇది సర్వసాధారణమైన సమస్య. కదలకుండా ఒకే ప్రదేశంలో కూర్చుని చేసే ఉద్యోగాల్లో ఉన్నవారికి తరచుగా వచ్చే సమప్య పైల్స్. అందుకు కారణం సరియైనా ఆహార నియమాలు పాటించకపోవడం, తీవ్రమైన మానసిక ఒత్తిళ్లు, మలబద్ధకం వంటి వాటితోనే ఈ సమస్య ఏర్పడుతుంది. నీరు తక్కువగా త్రాగడం, మద్యం అతిగా సేవించుటం, ఫాస్ట్ ఫుడ్స్, వేపుళ్లు అతిగా తినడం, మాంసాహరం తరుచుగా తినటం- వీటన్నింటి వలన పైల్స్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
లక్షణాలు:
మల విసర్జన సాఫీగా జరుగదు. తీవ్రమైన నొప్పి, రక్తస్రావం, మంట వుంటాయి. అప్పుడప్పుడు రక్తం పడుతుంది. మల విసర్జన అనంతరం
కూడా కొందరిలో నొప్పి మంట రెండు గంటల వరకు ఉంటుంది. మల విసర్జన సమయంలో మొలలు (పైల్స్) బయటకు పొడుచుకొని వచ్చి బాధిస్తాయి. ఒకసారి వస్తే చాలాకాలంపాటు వేధించే సమస్య ఇది. ముఖ్యంగా జీవనశైలి, ఆహారం, కూర్చుని చేసే ఉద్యోగం- ఈ వ్యాధికి కారణం అవుతాయి. ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స తీసుకోవడం ఉత్తమం.
కూడా కొందరిలో నొప్పి మంట రెండు గంటల వరకు ఉంటుంది. మల విసర్జన సమయంలో మొలలు (పైల్స్) బయటకు పొడుచుకొని వచ్చి బాధిస్తాయి. ఒకసారి వస్తే చాలాకాలంపాటు వేధించే సమస్య ఇది. ముఖ్యంగా జీవనశైలి, ఆహారం, కూర్చుని చేసే ఉద్యోగం- ఈ వ్యాధికి కారణం అవుతాయి. ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స తీసుకోవడం ఉత్తమం.
జాగ్రత్తలు :
పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. నీరు ఎక్కువగా తాగాలి (కనీసం రోజుకు 4నుండి 5లీటర్లు). ప్రతిరోజు వ్యాయామం చేయాలి. రోజూ మల విసర్జన సాఫీగా జరుగునట్లుగా చూసుకోవాలి. మద్యం, ఫాస్ట్ ఫుడ్స్, వేపుళ్లు, మాంసాహరం, చిరుతిళ్లు మానేయాలి. మానసిక ఒత్తిడి నివారణకు బాగా వివ్రాంతి తీసుకోవడం, నిత్యం యోగా, మెడిటేషన్ చేయాలి.
పైల్స్ ను సహజంగా పోగొట్టే ఆహారాలేంటో చూద్దాం...
గ్రీన్ వెజిటేబుల్స్-గ్రీన్ లీవ్స్
గ్రీన్ వెజిటేబుల్స్-గ్రీన్ లీవ్స్: పైల్స్ నివారణకై పీచు అధికంగా వుండే ఆహారం తీసుకోండి. ఇది మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది. తాజా దొరికే గ్రీన్ వెజిటేబుల్స్, గ్రీన్ లీవ్స్ తరచూ ఆహారంలో తప్పని సరిగా వుండేలా చూసుకోవాలి
సోయా బీన్స్
సోయా బీన్స్: బఠాణీ జాతి అయిన బీన్స్, కిడ్నీ బీన్స్, సోయా బీన్స్, బ్లాక్ బీన్స్, పీచు అధికంగా వుండే కాయ ధాన్యాలు పైల్స్ రోగులకు మంచివి. ఇవి తేలికగా జీర్ణమై పేగులు శుభ్రపడేలా చేస్తాయి.
పండ్లు
పండ్లు: మామిడి, నిమ్మ, బొప్పాయి, ఫిగ్, మొదలైన పండ్ల రసాలు ప్రతి రోజూ తాగి మలబద్ధకం లేకుండా చూసుకోండి. కాఫీ వంటి కేఫైన పదార్ధాలు వాడరాదు. నిమ్మ, బెర్రీలు, ఛీస్ పెరుగు, ఆపిల్స్, టమాటాలు మొదలైనవి పైల్స్ నివారణకు ఉపయోగపడతాయి. ఆహారంలో చేర్చండి.
అంజీర పండు
అంజీర పండు: అంజీర పండు రాత్రంతా నీటిలో నానపెట్టి ఉదయం పరగడుపును తింటే మలబద్ధకం పోయి పైల్స్ వ్యాధి నయమైపోతుంది.డుపును
తింటే మలబద్ధకం పోయి పైల్స్
అరటి పండు
అరటి పండు: అరటిపండు తింటే మలబద్ధకం నివారిస్తుంది. ప్రతిరోజూ ఉదయం లేదా ప్రతి భోజనం తర్వాత అరటిపండు తినండి.
నీరు
నీరు: పైల్స్ తగ్గాలంటే, నీరు అధికంగా తీసుకోండి. 8 నుండి 10 గ్లాసుల నీరు ప్రతిరోజూ తాగండి. తాజా పండ్ల రసాలు, వెజిటబుల్ సూప్ మొదలైనవి పైల్స్ నివారణకు సహకరిస్తాయి. పై తిండిపదార్ధాల జాబితాను మీ ఆహారంలో చేర్చి, పైల్స్ వ్యాధిని సహజంగా నివారించవచ్చు.
0 Comments