మెదడు అసాధారణ రీతిలో పనిచేస్తున్నప్పుడు విపరీతంగా ఊగిపోతూ వుండడం దీనితో మూర్ఛ వంటిది రావడం సంభవిస్తుంది, కదలికలలో మార్పులు, దృష్టిని దేనిమీద నిలపలేకపోవడం, చైతన్యం, స్పృహ వంటి స్ధాయిలో మార్పులకు దారితీస్తూ. మెదడులో వివిధ భాగాలలో అనేక రూపాలలో ఈ మార్ఛ అనేది సంభవించవచ్చు, అలాగే ఒక చోటే స్ధిరంగా ఉండిపోవచ్చు (శరీరంలో కేవలం ఒక భాగాన్ని మాత్రమే దీని ప్రభావానికి గురిచేస్తూ). మూర్ఛ రావడం అనేక కారణాల వల్ల జరగవచ్చు, ముఖ్యంగా పిల్లలలో. అప్పుడే జన్మించిన పిల్లలలో వచ్చే మూర్ఛ రోగం, చంటిపాపలలోనూ, బడికే వేళ్లే వయసున్న పిల్లలోనూ మరియు యవ్వనావవస్ధలో ఉన్నవారి కంటే కొంచెం తేడాతో ఉండవచ్చు. ఇంతకు ముందెన్నడూ ఎరుగని, అనుభవించని, ఈ మూర్చ ముఖ్యంగా పిల్లలలో మొదటిసారి వచ్చినప్పుడు తలిదండ్రులకు, పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటూ వారిని సాకుతూ వుండే వారిని ఇది భయ, భ్రాంతులకు గురిచేస్తుంది.
- 15 సంవత్సరాలకంటే చిన్న వయసులో ఉన్న పిల్లలలో ఇంచుమించు 3 శాతం ఈ మూర్చకు గురవుతున్నారు.
- ఇందులో సగం వరకు జ్వరంతో కూడిన మూర్ఛ వచ్చిన వారే (జ్వరం వల్ల వచ్చిన మూర్ఛ).
- 100 మందిలో ప్రతి 1 బిడ్డ ఆపస్మారకంతో పాటు తిరిగి వస్తూ వుండే మూర్ఛ వ్యాధి కలిగి ఉన్నవారే
మూర్ఛలో రకాలు
- జ్వరంతో పాటుగా వస్తూ వుండే మూర్ఛ
- నియో నెటల్ మూర్ఛలు
- పాక్షిక మూర్ఛలు
- సాధారణీకరించబడిన మూర్ఛలు
- స్ధిరంగా కొనసాగుతూ వుండే మూర్చ, మధ్యలో విరామమనేది లేకుండా, మనిషి తెలివిలోకి రాకుండా, ఆగకుండా వస్తూ వుండేది
పిల్లలలో మూర్ఛ రావడానికి కారణాలు
మూర్చ రావడానికి చాలా తెలిసున్న కారణాలున్నప్పటికీ, 4 గురి పిల్లలలో 3 గ్గురి విషయంలో దీనికి కారణమేమిటో ఇంకా తెలియకుండానే వుంది. ఇటువంటి చాలా కేసులలో కుటుంబపరంగా ఇది సంక్రమించవచ్చు. ఇతర కేసులలో మాత్రం ఇది నాడీ మండలం, మజ్జరోగం వల్ల, పెరుగుదలలో ఉండే సమస్యల వల్ల అంటే మస్తిష్కం, మెదడుకు సంబంధించిన పక్షవాతం మరియు తలకు తగిలిన గాయాలు, అఘాతం వంటి కారణాల వల్ల కూడా కావచ్చు.
మూర్ఛ రోగం ఉందని భావించబడే పిల్లలలో ఇంచుమించు నాలుగో వంతు, వాస్తవంగా చెప్పాలంటే, వేరే ఇతర లోపాలతో ఉన్నట్లు కనుగొనబడింది., పూర్తి స్ధాయిలో అటువంటి వారి పరిస్ధితిని మదింపు (ఇవాల్యుయేషన్) చేసిన తరువాత. ఇటువంటి ఇతర లోపాలు, వైకల్యాలు ఏమిటంటే కళ్లుతిరిగి పడిపోవడం, శ్సాస ఆగిపోయి మళ్లీ వస్తూ వుండడం, రాత్రి భయం, పార్శ్వం నొప్పులు మరియు మనస్తత్వ సంబంధిత విఘాతాల వంటివి.
మూర్ఛ రోగం ఉందని భావించబడే పిల్లలలో ఇంచుమించు నాలుగో వంతు, వాస్తవంగా చెప్పాలంటే, వేరే ఇతర లోపాలతో ఉన్నట్లు కనుగొనబడింది., పూర్తి స్ధాయిలో అటువంటి వారి పరిస్ధితిని మదింపు (ఇవాల్యుయేషన్) చేసిన తరువాత. ఇటువంటి ఇతర లోపాలు, వైకల్యాలు ఏమిటంటే కళ్లుతిరిగి పడిపోవడం, శ్సాస ఆగిపోయి మళ్లీ వస్తూ వుండడం, రాత్రి భయం, పార్శ్వం నొప్పులు మరియు మనస్తత్వ సంబంధిత విఘాతాల వంటివి.
- పిల్లలలో సర్వసాధారణంగా సంభవిస్తూ వుండేది విపరీతంగా ఊగిపోతూ, వణికిపోతూ వుండే ఒక రకమైన మూర్ఛ, తీవ్రమైన జ్వరంతో పాటుగా, అంటువ్యాధి (ఇన్ఫెక్షన్) సోకినప్పుడు వస్తుంది.
- మూర్ఛ రావడానికి ఇతర కారణాలుః
- అంటువ్యాధులు (ఇన్పెక్షన్స్)
- జీవకణాలలో జరుగు మార్పులలో సంభవించు వైకల్యం, లోపాలు.
- మాదక ద్రవ్యాలు (డ్రగ్స్)
- ఔషధాలను వాడుతూ వుండడం
- విష పదార్ధాలు
- లోపభూయిష్టమైన రక్తనాళాలు.
- మెదడులో స్రావం (బ్లీడింగ్)
- ఇవి మెదడులో గడ్డలు కట్టడం, అంటురోగాలు, జ్వరం, పుట్టుకతోనే ఉన్న గాయాలు, గాయం లేక అఘాతం తో సహా కూడి వుండవచ్చు.
వైద్య చికిత్స
వయోజనులకు చేసే వైద్య చికిత్స కంటే మూర్ఛ వ్యాధితో ఉన్న పిల్లలకు చికిత్స చేయడం విభిన్నమైనది. ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకోనంతవరకూ, మొదటి సారిగా ఈ మూర్ఛ రావడం జరిగినప్పుడు చాలా మంది పిల్లలకు మందుల వాడకాన్ని ప్రారంభించ కూడదు.
- మందుల వాడకాన్ని మొదలుపెట్టకపోవడానికి ప్రధానమైన కారణాలు.
- మొదటిసారిగా చూడడానికి వచ్చిన చాలా మంది వైద్యులకు ఈ సంఘటన మూర్ఛ వంటిదా లేక మరేదైనా వ్యాధా అని ఖచ్చితంగా తేల్చి చెప్పడం సాధ్యంకాదు.
- మూర్ఛ రోగ నివారణకు వాడే చాలా మందుల వల్ల అనుషంగ ప్రభావాలు (సైడ్ ఎఫెక్ట్స్) కలుగ వచ్చు – మీ బిడ్డ లివరుకు లేక పళ్లకు హాని కలగడంతో సహా.
- చాలా మంది పిల్లలు కేవలం ఒకటి లేక అతి తక్కువ మూర్ఛల బారిన పడి ఉంటారు.
- ఒకవేళ మందుల వాడకం మొదలు పెట్టినట్లయితే
- మందులిచ్చే స్ధాయిలను వైద్యులు అనుసరిస్తారు. ఇవి తరచుగా రక్త పరీక్షలు చేయించుకోవలసిన అవసరం ఉన్నటువంటివి మరియు వీటి వల్ల సంభవించే అనుషంగ ప్రభావాల (సైడ్ ఎఫెక్ట్స్)ను జాగ్రత్తగా పరీశీలిచం వలసి వుంటుంది. ఒకోసారి ఈ మందుల వాడకంలో సర్దుబాటు (ఎడ్జెస్ట్) చేసుకోవడం, సమతుల్యం పాటించడం అన్నవి కొన్ని వారాలనుండి నెలల వరకు పట్టవచ్చు. అలాగే కొన్ని సందర్భాలలో ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలో మందులను వాడవలసి వుంటుంది.
ఒకవేళ మీ బిడ్డ స్ధిరంగా కొనసాగుతూ వుండే మూర్చ, మధ్యలో విరామమనేది లేకుండా, మనిషి తెలివిలోకి రాకుండా, ఆగకుండా వస్తూ వుండే (Status epilepticus) టటువంటి దానితో బాధపడుతూ వుంటే అతనికి/ఆమేకు చాలా వేగవంతంగా, కాస్త దురుసుగానూ కూడా చికిత్స చేస్తారు, మూర్ఛరోగాన్ని అరికట్టే మందుల వాడకంతో, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేర్చడం కూడా జరుగుతుంది, అలాగే శ్సాసనిచ్చే ఒక మెషిన్ పై ఉంచవలసిన అవసరం కూడా రావచ్చు.
నివారణ
మూర్ఛలు చాలా వరకు వివారింపశక్యం గానివి. అయితే దీనికీ కొన్ని మినహాయింపులున్నాయి. కానీ వీటిని అదుపుచేయడం చాలా కష్టం – అంటే తలకు తగిలిన విఘాతం మరియు గర్భిణీగా ఉన్నప్పుడు సంక్రమించిన అంటువ్యాధి వంటి వాటిని.
- జ్వరంతో వస్తూ వుండే మూర్ఛ వ్యాధి ఉన్న పిల్లలలో వారు అనారోగ్యంతో ఉన్నప్పుడు ముందుగా జ్వరాన్ని అదుపులో ఉండేటట్లు చూడాలి,
- ఒక వేళ మూర్చ రావడం సంభవిస్తే, ఇంకా గాయాలయ్యే అవకాశాన్ని లేకుండా చేయడం.
ఇతర పిల్లల మాదరిగానే, ఈ సమస్యకు గురయి, బాధపడుతూ ఉండే పిల్లలు కూడా అన్ని కార్యకలాపాలలోనూ పాల్గొనగలరు. అయితే, తలిదండ్రులు మాత్రం అదనపు భధ్రతా చర్యలపై ఆవగాహనను కలిగి వుండాలి. అంటే ఒక వేళ అటువంటి పిల్లలు నీటిలో ఈదుతున్నప్పుడు దగ్గరలో పెద్దవారుండడం లేక వేరే ఇతర కార్యకలాపాలలో పాల్గొంటున్నప్పుడు అటువంటి వాటివల్ల మూర్ఛ వచ్చినప్పుడు హాని జరగకుండా చూడడం కోసం. ప్రతివారిలోను ఈ మూర్చ వచ్చే అవకాశం వుండవచ్చు. కొంతమందికి ఇవి తరుచుగా వస్తూ వుండేవే. మూర్ఛలో వుండే ఇతర వైకల్యాలు విపరీతమైన వైవిధ్యాన్ని కలిగివుంటాయి. కొంతమంది ఎప్పుడైనా ఏదో ఒకసారి ఈ మూర్ఛ బారిన పడి వుంటే, మరికొంత మంది ఇతరులు ప్రతి రోజూ లేక అతి తరచుగాను దీని బారిన పడుతూ వుంటారు.
- వివిధ రకాలైన మూర్ఛలున్నాయి -- మూర్చ సంఘటన పేలవంగా, జీవం లేని చూపుల నుండి అచేతనంగా పడివుండడం, తెలివిలో లేకపోవడం, నరాలు బిగుసుకుపోయి ఉన్న స్ధితిలో ఊగిపోతూ వుండడం వరకూ.
- మామూలుగా మూర్ఛను ఈ క్రింది పరిస్ధితులలో అత్యవసర పరిస్ధితిగా పరిగణించవచ్చు.
- కొద్ది నిముషాలలో ఆగిపోనటువంటి .మూర్ఛలు
- మూర్చ ఆగిపోయి, తొలగిపోయినప్పుడు కూడా చాలా సేపు వుండే అయోమయ పరిస్ధితి.
- మూర్చ వచ్చిన తరువాత అటువంటి వ్యక్తి ప్రతిస్పందించనప్పుడు
- శ్వాసను పీల్చుకోవడంలో అటువంటి వ్యక్తి ఇబ్బంది పడుతున్నప్పుడు.
- మూర్ఛ వచ్చిన స్ధితిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి గాయాలయినప్పుడు
- మూర్ఛ మొదటిసారిగా వచ్చినప్పుడు.
- మామూలుగా అతనికి వస్తూ వుంటే మూర్ఛ లక్షణాలు, ప్రత్యేకతల కంటే ఇప్పుడు వచ్చిన మూర్ఛ వచ్చిన రీతిలో వైవిధ్యం కనిపిస్తున్నప్పుడు
హెచ్చరికలు
స్నానాలగది అతి జాగ్రత్తగా, అదనపు మెలకువతో ఉండవలసిన సామాన్య ప్రదేశం .బాత్ టబ్ ల కంటే షోవర్ (నీటి జల్లు పై నుండి పడే విధానం) తో స్నానం చేయడం ఆభిలాషణీయమైనది, ఎందుకంటే దీనివల్ల బాత్ టబ్ లో లాగ మునిగిపోయి, ఉక్కిరిబిక్కిరి అయ్యే ఆవకాశం చాలా తక్కువ కాబట్టి. ఎంతోమంది ఈ మూర్ఛకు గురవుతూ వుంటారు, తెలియని కారణాల వల్ల. ఇతరులు కొంతమంది ఈ మూర్ఛ వ్యాధిని కలిగివుంటారు, ఇతర కారణాల వల్ల,, వారి మెదడు పనిచేసే విధానంపై ప్రభానాన్ని చూపిస్తూ
- మెదడు పని చేయడంలో చెడుప్రభానాన్ని చూపిస్తూ, మూర్ఛకు దారితీసే ఇతర సమస్యలు మాదక ద్రవ్యాలు, మందుల వాడకం, మత్తు పానీయాలు, తక్కువ స్ధాయిలో ఉండే రక్తపు షుగర్ (మధుమేహం), లేక ఇతర రసాయన-సంబందిత అసాధారణమైన అంశాలతో సహా కూడి ఉంటాయి.
- అతివేగంగా, ఒక్కసారిగా వెలిగి, ఆరిపోయే ఫ్లాష్ లైట్లు, అధిక ఒత్తిడి, భారం లేక నిద్రలేమి మొదలైనవి కొంతమందిలో ఈ మూర్ఛను ప్రేరేపించేవిగా పనిచేస్తాయి.
- చిన్న పిల్లలో వచ్చే మూర్ఛలు ఒక ప్రత్యేక శ్రేణికి చెందినటువంటివి. వీటిని వైవిధ్యభరితంగా చక్కబెట్టవలసి వుంటుంది. ఒక వ్యక్తి అరవడం గాని లేక ఏదైనా ఒక శబ్దాన్ని చేయడం గాని చేయడంతో సాదారణీకరణ చేయబడిని (జనరలైజ్డ్) మూర్ఛ రావడం మొదలవుతుంది. వెంటనే అనేక సెకన్లపాటు ఆసాధారణంగా మనిషి బిగుసుకుపోవడం జరుగుతూ, మెల్లగా ఇంకా అధికమౌతూ, ఒక లయబధ్దంగా కాళ్లనూ, చేతులను ఊపుతూ
- కళ్లు సాధారణంగా తేరుచుకునే వుంటాయి కాని అటువంటి వ్యక్తిలో ప్రతిస్పందన ఉండదు, చైతన్యంతో ఉండడు.
- మనిషి శ్వాసను పీలుస్తున్నట్టుగా కనిపించడు కానీ వాస్తవంగా ఇటువంటి వారు మామూలుగానే లోపలికి గాలిని పీలుస్తూనే వుంటారు సరిపోయేంత మేరకు, మూర్ఛతో ఉన్న ఆ కొద్ది సేపూ కూడా. ఈ సంఘటన జరిగిన తరువాత వారు కొద్దిసేపు లోతుగా లోపలికి గాలిని పీల్చుకుంటారు.
- అనేక నిముషాల కాలం గడిచిన తరువాత క్రమేపి అతడు/ఆమె తెలివిలోకి వస్తారు
- నిగ్రహ రాహిత్యం లేక మూత్రాన్ని పోగొట్టుకోవడం అన్నవి సామాన్యంగా జరిగేవి.
- తరుచుగా వీరు కొద్దిసేపు దురుసుగా ప్రవర్తిస్తారు, ఇటువంటి సాధారణీకరణ చేయబడిన (జెనరలైజ్డ్) మూర్ఛ (మొత్తం మెదడుపై ప్రభానాన్ని చూపేది) వచ్చి ఆగిపోయిన తరువాత.
- అనేక ఇతర రకాలైన మూర్ఛలు కూడా ఉన్నాయి - వేరుపరచబడిన (ఐసోలేటెడ్) అసాధారణ కలదలికలతో ఏదో ఒక కాలునో, పాదాన్నో ఊపుతూ వుండడం, దిక్కులు చూస్తూ వుండడం లేక లయబధ్దంగా లేని ఊపుతో అసాధారణమైన రీతిలో బిగుసుకుపోవడం మొదలైన వాటితో సహా.
0 Comments