Full Style

>

కేన్సర్‌ను అంతం చేయవచ్చు

మృత్యువుకు మారుపేరుగా ేకన్సర్‌ వ్యాధి ఇప్పటికీ మానవాళిని భయపెడు తోంది. చికిత్సకు అందని ప్రాణాంతక వ్యాధుల్లో ప్రథమ స్థానంలో నిలిచి, ఎన్నో మానవ జీవితాలను మింగేసిన భయంకర వ్యాధి ేకన్సర్‌. కానీ, ప్రాణాంతక వ్యాధులను ఎదుర్కోవడా నికి నిరంతరం పరిశోధిస్తున్న ఆధునిక వైద్యశాస్త్రం ేకన్సర్‌ని ఎదుర్కోనడానికి గతంలో కన్నా మరింత సమర్థవంతమైన చికిత్సా విధానాన్ని కనుకో్కవడమే కాకుండా, సంపూర్ణంగా నయం చేసే స్థారుుకి చేరుకుంది.

వైద్య పరిశోధనల ప్రకారం దాదాపు 286 కేన్సర్లున్నాయి. మనదేశ సామాజిక పరిస్థితుల్లో అత్యధిక శాతం కేన్సర్‌ వ్యాధులు మూడు మాత్రమే. 1. గర్భాశయ ముఖ ద్వార కేన్సర్‌, 2. రొమ్ము కేన్సర్‌, 3. గొంతు, నోటి కేన్సర్‌. అయితే కేన్సర్‌ వ్యాధి ముదిరిపోతేనే ప్రాణాంతకమవుతుంది. ప్రాథమిక స్థాయిలో గుర్తించి, తగిన చికిత్సను చేసే కేన్సర్‌ నుంచి పూర్తిగా విముకిత పొందవచ్చు.ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న కేన్సర్‌ మరణాల్లో సగం మరణాలు అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే సంభవిస్తున్నాయి. దీనికి ముఖ్య కారణం అవగాహనారాహిత్యమే. తెలియని తనంతో కేన్సర్‌ని తొలిదఃలో గుర్తించకుండా నిర్లక్ష్యం వహించడంతో అది వృత్యురూపం ధరించి ప్రాణాలు తీస్తోంది.
గర్భాశయ ముఖద్వార కేన్సర్‌
ప్రపంచ వ్యాప్తంగా ఏడాదికి కనీసం 2.3 లక్షల మంది మహిళలు ఈ గర్భాశయ ముఖద్వార (సర్విక్స్‌) కేన్సర్‌తో చనిపోతున్నారు. వీరిలో నిరక్షరాస్యులు, నిరుపేదలే ఎక్కువ. మన దేశంలో మొత్తం కేన్సర్లలో 22 నుంచి 25 శాతం ఈ రకం కేన్సరే కనబడుతోంది. దీన్ని కాస్త ముందుగా గుర్తిస్తే వ్యాధిని పూర్తిగా నిర్మూలించే అవకాశం ఉంది. కాని ప్రస్తుతం అధిక జానాభా, నిరక్షరాస్యత, పేదరికం, సరైన అవగాహన లేకపోవడం వంటి సమస్యల వల్ల మన దేశంలో ఈ కేన్సర్‌ను బాగా ముదిరిన తర్వాతే గుర్తిస్తున్నారు.
కారణాలు:
చిన్న వయసులోనే వివాహాలు, చిన్న వయసులోనే గర్భధారణ, ఎక్కువ కాన్పులు, ఎక్కువ మందితో లైంగిక సంబంధాలు... ఇవన్నీ గర్భాశయ ముఖద్వార కేన్సర్‌కు దోహదం చేసేవి. హెర్పిస్‌ వైరస్‌ -2, హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ (ఎచ్‌పీవీ)లు ఈ రకం కేన్సర్‌కు కారణమయ్యేవని గుర్తించినా... హెచ్‌పీవీని దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఈ వైరస్‌ - లైంగిక సంబంధం ద్వారా జీవితకాలంలో ఎప్పుడో ఒకప్పుడు స్ర్తీ శరీరంలో ప్రవేశించి, నిద్రాణంగా ఉండిపోతుంది. ఒంట్లో రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు విజృంభించి వ్యాధి కారకంగా మారుతుంది. తర్వాత - మొత్తం ఈ కేన్సర్‌ పెరగటానికి 10-20 ఏళ్ల సమయం పడు తుంది. దీన్ని సాధ్యమైనంత త్వరగా గుర్తించటం ద్వారా పూర్తిగా నయం చేయవచ్చు.
పురుషుల పాత్ర: పురుషులు ఎప్పటికప్పుడు తమ పురుషాంగం పూర్వచర్మం కింద పేరుకునే స్రావాలను శుభ్రం చేసుకోకుండా సెక్స్‌లో పాల్గొనడం వల్ల కూడా స్త్రీల్లో ఈ రకం కేన్సర్‌ పెరుగుతుందని గుర్తించారు.
లక్షణాలు:
  • మెనోపాజ్‌ తర్వాత గానీ, సెక్సు తర్వాత గానీ, రక్తస్రావం, నెలసరి సమయంలో అధిక స్రావం కనిపించడం.
    యోని స్రావాల నుంచి దుర్వాసన.
  • నడుములో నొప్పి.
    నివారణ:
  • 30 ఏళ్లు దాటిన ప్రతి స్ర్తీ ఏడాదికి ఒకసారి తప్పనిసరిగా ‘పాప్‌ స్మియర్‌ పరీక్ష’ చేయించుకోవాలి.
  • గర్భాశయ ముఖద్వారం వద్ద ఏ రకమైన మార్పులు గమనించినా వెంటనే వైద్యులు దృష్టికి తీసుకువెళ్లడం అవసరం. అక్కడి నుంచి కొన్ని కణాలను సేకరించి పరీక్షిస్తే కేన్సర్‌ ఆనవాళ్లు బయటపడ తాయి. ఈ దశలో కేన్సర్‌ను గుర్తిస్తే 100 శాతం చికిత్స చెయవచ్చు.

    రొమ్ము కేన్సర్‌ ఎవరికి రావచ్చు
  • 40 సంవత్సరాలకు పైబడినవారు, ముఖ్యంగా 50 ఏళ్ల పైబడిన వారికి.
  • న్నిహిత బంధువుల్లో రొమ్ము కేన్సర్‌ చరిత్ర ఉన్న వారికి, ముఖ్యంగా తల్లి, తోబుట్టువులకు మెనోపాజ్‌కు ముందే రెండు రొమ్ములకు కేన్సర్‌ వచ్చిన వారికి.
  • అస్సలు పిల్లలు పుట్టని వారికి, లేదా 30 తర్వాత పుట్టిన వారికి.
  • చిన్న వయసులోనే రజస్వలై... బాగా లేటు వయసులో ముట్టుడిగిన వారికి.
    లక్షణాలు:
  • సాధారణంగా రొమ్ముల్లో కనిపించే గడ్డలన్నీ కేన్సర్‌ గడ్డలు కావు. చేతులతో తడిమితే అటూ ఇటూ కదులుతుండే గడ్డలు సాధారణంగా కేన్సర్‌ గడ్డలు కావు. వక్షజాల్లో గట్టిగా, కదలకుండా అంటిపెట్టుకొని ఉండే గడ్డలు కేన్సర్‌గా మారే అవకాశం ఉంది.
  • వక్షోజాల్లో వాపు, సొట్టలు పడుతుండటం గాట్లు పడినట్లు ఉండటం, చనుమొనలు లోపలికి ఉండటం, చర్మ ముడతలు పడటం వంటి మార్పులు కనిపిస్తాయి. ఈ మార్పులను వెంటనే గుర్తిస్తే చికిత్స ద్వారా నిర్మూలించవచ్చు.
    నివారణ:
  • క్రమం తప్పకుండా ఎవరికి వారు రొమ్ములను పరీక్షించుకుంటూ ఉండాలి. దీన్ని ‘బ్రెస్ట్‌ సెల్ఫ్‌ ఎగ్జామినేషన్‌’ అంటారు. ఈ పరీక్ష ఎప్పుడు ఎలా చేసుకోవాలన్న దానికి ఒక పద్ధతి ఉంది. దాన్ని అందరూ ఖచ్చితంగా పాటించాలి. ఏ మాత్రం అనుమానంగా ఉన్నా వైద్యుల్ని సంప్రదించాలి.
  • అప్పుడప్పుడు చేతివేళ్లతో చనుమొనల్ని సున్నితంగా నొక్కి ద్రవం కారుతుందేమో గమనిస్తుండాలి. పాలు కాకుండా, ఇతరత్రా ద్రవాలేమైనా కనబడితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

    నోటి కేన్సర్‌:
    లక్షణాలు:
  • నోటిలో తెల్లని - ఎర్రని మచ్చలు, మానని పుండ్లు, తరచూ రక్తస్రావం.
  • మాట్లాడటం, ఆహారం మింగటం కష్టంగా ఉండటం.
  • దీర్ఘకాలంగా దగ్గు, గొంతు బొంగురుపోవడం.
  • నోటిలో గానీ, కంఠం మీద గానీ పుండు ఏర్పడటం, రసి కారటం.
    నివారణ:
  • నోటి కేన్సర్‌కు పొగాకు ప్రధాన కారణం. పొగాకు ముక్కుపొడి, పాన్‌పరాగ్‌, జర్దాకిళ్లీ, మద్యపానం మొదలైన వాటికి దూరంగా ఉండటం వల్ల నోటి కేన్సర్‌ రాకుండా చూసుకోవచ్చు.
  • నోటి కేన్సర్‌ లక్షణాలను ప్రారంభ దశలోనే తేలికగా గుర్తించే వీలున్నప్పటికీ నేటికీ 50 శాతం మంది రోగులు వ్యాధి ముదిరిన తర్వాతే చికిత్సకు సిద్ధపడుతున్నారు. ప్రారంభదశలో గుర్తిస్తే చికిత్స తేలిక.
    (తరువాయి భాగం వచ్చేవారం)

Post a Comment

0 Comments