శరీరానికి సరైన వ్యాయామం లేక కండరాల నొప్పులు వస్తాయి. వ్యాయామం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి నొప్పులు తగ్గుతాయి. డైక్లోఫెనిక్ బిళ్ళలు, డోలో-650 బిళ్ళలు వాడ్తే తగ్గుతాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
శీతాకాలంలో సాధారణంగా వ్యాయామంగాని, నడకగాని, జాగింగ్, సైక్లింగ్‌గాని తప్పక చేెయాలి. రక్తప్రసరణ బాగా జరిగి శరీరం ఆరోగ్యంగా వుంటుంది.
ఉదయంగాని, సంధ్య వేళల్లో చలి ఎక్కువగా వుంటుంది. అందుకని శరీరాన్ని బాగా కప్పే దుస్తులు, స్వెట్టర్, ముక్కుకు మాస్క్ వాడాలి. తలకు, చెవులకు చల్లటి గాలితగలకుండా ‘మంకీక్యాప్’ పెట్టుకోవాలి. ఆ సమయంలో వాకింగ్, జాగింగ్ చేయకూడదు. కొద్దిగా ఎండ కాసినప్పుడు చేయాలి. ప్రయాణ సమయంలో కూడా ఈ జాగ్రత్తలు పాటించాలి.
స్నానం చేసే ముందు నువ్వుల నూనె లేదా ఆలివ్ ఆయిల్ రాసుకొని పదిహేను నిమిషముల తర్వాత అభ్యంగనం ఆచరించాలి. సున్నిపిండితోగాని, జొన్నపిండితోగాని రుద్దుకోవచ్చు. సోపు వాడకుంటే మంచిది. గ్లిజరిన్ సోపు అయితే వాడవచ్చు. స్నానం చేసిన తర్వాత మెత్తని బట్టతో తుడుచుకొని మాయిశ్చరైజింగ్ క్రీమ్ పుయాలి. రోజుకు రెండూ, మూడుసార్లు ఈ క్రీమ్ రాయవచ్చు.
చర్మం పొడిబారి, దురద వచ్చినప్పుడు గోకడంవల్ల పగిలినట్టు అవుతుంది. దీనికి ‘నివియా’క్రీమ్‌గాని, పెట్రోలియం జెల్లిగాని ‘వాశరైన్’ పుయాలి.
చల్ల గాలికి వెళ్లినప్పుడుగాని, చల్ల నీళ్ల స్నానం చేసినప్పుడు గుండెజబ్బు వున్నవారికి ‘హార్ట్ ఎటాక్ రావచ్చు. ఉబ్బసం వ్యాధి వున్నవారికి ఆయాసం ఎక్కువవచ్చు. వీరు చల్ల నీళ్లతో స్నానం చెయ్యకూడదు.
కీళ్ల నొప్పులున్న వారికి ఉదయం లేవగానే ‘మార్నింగ్ స్టిఫ్‌సెస్ రావచ్చు. వారు తగిన వ్యాయామం చేయాలి. రక్త ప్రసరణ బాగా జరిగి ఉపశమనం కలుగుతుంది
.
0 Comments