Full Style

>

అందానికి స్వాగతం




ఎండాకాలంలో ఉన్నట్లు చలికాలంలో ఉండదు.. చలికాలంలో ఉన్నట్లు వర్షాకాలంలో ఉండదు చర్మం. వివిధ కాలాల్లో చర్మంలోని మార్పులు, సమస్యల నుంచి మిమ్మిల్ని మీరు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలను అనుసరించండి.

 -ఈ కాలంలో రుతుపవానల వల్ల చర్మం కాంతి తగ్గిపోతుంది. అందుకని ఎక్కువగా రోజ్ వాటర్, దోసకాయరసం, పుదీనారసం తాగడం మంచిది. మొఖానికి చల్లదనాన్ని ఇచ్చే పండ్ల నుంచి తయారుచేసిన మాస్క్‌లను ఉపయోగించండి. 5 మెత్తగా చేసిన రేగు పండ్లను, 2 టీస్పూన్స్ గోధుమ పిండి, 1 గుడ్డు కలిపి మొఖానికి, మెడకు పట్టించి 10 నిమిషాలు ఆరనివ్వాలి. ఆరిన తరువాత రోజ్ వాటర్‌తో కడిగేయండి. 

-బాదం, ఆప్రీకాట్, చందనం నూనె మూడింటిని సమపాళ్లలో తీసుకొని చర్మానికి రాసుకొని అరగంట తరువాత కడిగేయండి. జిడ్డు పోయి చర్మం కాంతివంతంగా అవుతుంది.

-మీరు పొడి చర్మంతో బాధ పడుతున్నారా? అయితే 2 టీ స్పూన్ల బాదం పొడి, 1 టీ స్పూన్ క్రీమ్, 5 మెత్తగా చేసిన అత్తి పండ్లు తీసుకొని అన్నిటిని కలిపి ముద్దలా చేసి మొఖానికి పట్టించి ఆరనివ్వాలి. తరువాత చల్లని నీటితో కడిగేయండి.

-మీది టాన్ చర్మం అయితే.. 2 పుచ్చకాయ ముక్కలను ఫ్రిజ్‌లో 20 నిమిషాల పాటు ఉంచి, 4 టీస్పూన్స్ తేనెలో ముక్కలను ముంచి వాటితో మొఖానికి మసాజ్ చేసి 5 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత చన్నీళ్ళతో కడిగేయండి.

-స్నానం చేసిన తరువాత చివర్లో సగం బకెట్ నీళ్ళలో 10 చుక్కల సిట్రస్ లేదా జాస్మిన్ అయిల్‌ను కలిపి చేస్తే.. స్ప్రేలు కొట్టే బాధ తప్పుతుంది.



Post a Comment

0 Comments