కీళ్ళనొప్పులున్న వారు తరచూ మందులు మాత్రలు ఉపయోగిస్తుంటారు. కాని కొన్ని ఉపాయాలు పాటిస్తే కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
* సహజంగా కీళ్ళ నొప్పి ఉదయం పూట అధికంగా ఉంటుంది. దీనికి ప్రతిరోజు రాత్రిపూట పడుకునే ముందు నొప్పి ఉన్నచోట నొప్పి నివారణ మందు పూయండి.
* కాస్త ఉప్పు కలిపిన నీటిలో చింతాకులు ఉడికించి నొప్పులున్నచోట ఆనీటిని పోయండి నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు.
* నొప్పులున్నచోట యూకలిప్టస్ ఆయిల్ పూసి వేడినీళ్ళతో తాపడం పెట్టాలి. లేకుంటే మెత్తటి తువ్వాలు వేడినీళ్ళల్లో ముంచి బాగా పిండిన తర్వాత ఆ వేడి తువ్వాలును నొప్పులున్న చోట పెట్టండి. దీంతో నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
* విటమిన్ సి కి సంబంధించిన పండ్లు అధికంగా తీసుకోవాలి.
* వారానికి ఒకసారి ఉపవాసం ఉండటం మంచిది. క్యారెట్‌జ్యూస్, క్యాబేజ్‌సూప్ తీసుకుంటే నొప్పులు తగ్గుతాయి.
* అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గేమార్గం ఆలోచించాలి.
* ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్, పాలు, ఉర్లగడ్డలు వాడకూడదు.
0 Comments