Full Style

>

వారానికి రెండుసార్లు చేపలు తినండి...


హెల్తీఫుడ్ అంటే ఏదీ, ఈ సందేహం చాలా మందికి ఉంటుంది. రోజూ ఏ డైట్ తీసుకోవాలి, వారంలో ఎన్ని రోజులు మాంసాహారం తీసుకోవచ్చు, ఇలాంటి సందేహాలను తీర్చటానికి హార్వర్డ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహించి ఏమేం తినాలో వెల్లడించారు.

వారానికి రెండుసార్లు చేపలు తీసుకుంటే రక్తంలో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్ డీహెచ్ఏ లెవల్స్ అత్యధిక స్థాయిలో ఉంటాయి. దీంతో మెదడులోని కణాలు సమర్థంగా పనిచేస్తాయి. కాబట్టి వారంలో రెండు రోజులు చేపలు తినండి.

తాజా కూరగాయల్లోనూ, పండ్లలోనూ యాంటీఅక్సీడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వారంలో ఐదు రోజులు పండ్లు, కూరగాయలు తీసుకోండి. ముఖ్యంగా పళ్లలో మెదడును రక్షించే యాంటీఅక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. బ్రొక్కోలి, క్యాలీఫ్లవర్‌లలో ఎక్కువ శక్తి ఉంటుంది. కాబట్టి వీటిని తీసుకోవాలి.

వీటిని తీసుకోవడానికి అంతగా ఇష్టపడని మహిళల్లో మెదడు వారి వయస్సుకంటే ఒకటి రెండెళ్లు తక్కువగా ఉంటుంది. యాపిల్స్, గ్రేప్స్, ఆనియన్స్, వైన్, టీ, డార్క్‌చాక్‌లెట్‌లలో కూడా యాంటీఅక్సిడెంట్లు ఉంటాయి. వారంలో ఐదు రోజులు వీటిని తీసుకుంటే యాంటీ అక్సిడెంట్లకు కొదవే ఉండదు.

ఆలివ్ ఆయిల్, నట్స్, సన్‌ఫ్లవర్‌సీడ్స్, అవొకొడస్‌లో యాంటీ అక్సిడెంట్‌గా పనిచేసే ఇ-విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది అల్జీమర్స్ వ్యాధికి బాగా పనిచేస్తుంది. తరచుగా వీటిని తీసుకునేవారిలో అల్జీమర్ వ్యాధి బారిన పడే అవకాశం 67 శాతానికి తగ్గిపోతుంది. కాబట్టి వీటిని వారంలో ఒకరోజైనా మీ మెనూలో ఉండేలా చూసుకోవాలి.

Post a Comment

0 Comments