Full Style

>

పుల్లని ఆవు మజ్జిగ శరీరానికి రాసుకుంటే..!

x


పుల్లని ఆవు మజ్జిగ శరీరానికి రాసుకుంటే చర్మం శుభ్రపడటమే గాకుండా నిగనిగలాడుతుంది. పుల్లని ఆవుమజ్జిగ తలకు రాసుకుంటే జుట్టును శుభ్రపరచటమేగాక వెంట్రుకలు నిగనిగలాడుతూ జుట్టు ఊడిపోవడం తగ్గుతుంది.

పటిష్టమైన, మృదువాటి కురుల కోసం వారానికోసారి వెంట్రుకలకు మజ్జిగ, పెరుగు పట్టించాలని బ్యూట్రీషన్లు చెబుతున్నారు. కాళ్ళ పగుళ్ళకు మజ్జిగ నుంచి తీసిన తాజా వెన్నను పూస్తే ఉపశమనం కలుగుతుంది.

ఇంకా ఆవుపాలతో తయారయ్యే తాజా మజ్జిగ రోజూ తీసుకుంటే వాతం, పైత్యం, కఫం మూడింటిని తగ్గిస్తుంది. శరీరంలో యూరిక్ ఆసిడ్‌వలన కలిగేముప్పు ఆవుమజ్జిగ తొలగిస్తుంది. నియమబద్ధంగా ప్రతీరోజూ ఆవుమజ్జిగ తాగుతుంటే హాయిగా నిద్రపడుతుంది.
శీతలపానీయాలకన్నా మజ్జిగ లక్షలరెట్లు మంచిది.

అలాగే మజ్జిగతో ఎన్నో లాభాలున్నాయి. ఎక్కుళ్ళు వస్తున్నప్పుడు ఒక చెంచా మజ్జిగలో సొంఠి కలుపుకుని సేవించండి. వెంటనే ఉపశమనం కలుగుతుంది. వాంతులయ్యేటప్పుడు మజ్జిగతోపాటు జాజికాయను గీసుకుని మజ్జిగలో కలుపుకుని సేవించండి.

Post a Comment

0 Comments