Full Style

>

ఫ్రిజ్ వాడుతున్నారా? ఐతే ఈ జాగ్రత్తలు తీసుకోండి



నాగరికత పెరుగుతున్న కొద్దీ ఎలక్ట్రానిక్ పరికరాల వాడకం ఎక్కువవుతోంది. ప్రతి ఇంట్లో ఫ్రిజ్ ఉండటం తప్పనిసరి అయ్యింది. కానీ కొందరు ఫ్రిజ్‌నిండా ఏవేవో పదార్థాలు నింపేస్తుంటారు. అలా నింపే వారు మీరైతే ఈ జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. ఫ్రిజ్‌లో ఆహార పదార్థాలను కూరగాయలను ఏమాత్రం ఖాళీ లేకుండా ఇరికించి పెట్టరాదు. ఫ్రిజ్‌లోపల గాలి ప్రవేశించేలా కొంత ఖాళీగా ఉండేలా చూసుకోవాలి.

సువాసన వస్తువులను, పూలను ఫ్రిజ్‌లో పెట్టేటప్పుడు వాటి వాసన బయటకు రాకుండా జాగ్రత్తగా కవర్‌లో వేసి పెట్టాలి. కూరగాయలను కడిగిన తర్వాత పూర్తిగా తడి ఆరిపోయిన తర్వాతనే వాటిని ఫ్రిజ్‌లో పెట్టాలి. తొడిమలు తీసిన మిరపకాయలను ఎక్కువ రోజులు ఫ్రిజ్‌లో వుంచితే అవి కుళ్ళిపోతాయి. కనుక పచ్చి మిర్చిని తొడిమలు తీయకుండా ఫ్రిజ్‌లో ఉంచకూడదు.

ఆహార పదార్థాలు, పాలు, పెరుగు, రుబ్బినపిండి లాంటివి ఉంచిన పాత్రల మీద మూతపెట్టాలి. ఆకు కూరలను వేళ్ళను కత్తిరించి తడిపోయేలా బాగా ఆరబెట్టి కట్లను విడదీసి పాలథిన్ కవర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో పెట్టాలి. వేడివేడిగా ఉండే ఆహార పదార్థాలను పాలను అలాగే ఫ్రిజ్‌లో పెట్టకూడదు. బాగా చల్లారనిచ్చి ఆ తర్వాత పెట్టాలి.

ఫ్రిజ్ తలుపును ఎక్కువసార్లు తీస్తూవేస్తూ ఉండటం ఫ్రిజ్ డోరును ఎక్కువసమయం తెరిచి ఉండటం మంచిదికాదు. ఫ్రిజ్‌లో ఐసుగడ్డలు పేరుకోకుండా చూసుకోవాలి. ఎక్కువ మందంగా ఐస్ పేరుకున్నట్లయితే వెంటనే ఫ్రిజ్ ఆఫ్ చేసి డీపాస్ట్రింగ్ చేయాలి. అరటి పళ్ళను ఫ్రిజ్‌లో ఉంచకూడదు.

ఫ్రిజ్ కండెన్సర్‌మీద దుమ్ము పేరుకోకుండా శుభ్రం చేస్తుండాలి. నెలకు కనీసం రెండుసార్లు డీప్రాస్ట్ చేసి, ఫ్రిజ్ లోపలకు శుభ్రం చేసి ఫ్రిజ్ బయటకు మరకలు దుమ్ములేకుండా తుడవాలి. ఫ్రిజ్ డోర్ హ్యాండిల్‌కు కవర్‌ను వేయాలి. ఫ్రిజ్ లోపల పెరుగు, ఆహార పదార్థాలు మీగడలాంటివి పెట్టేటప్పుడు ఒలకకుండా చూసుకోవాలి. ఫ్రిజ్‌లో పాలు, పెరుగు వంటివి ఒలికితే దుర్వాసర ఏర్పడుతుంది. అలా పాలు, పెరుగు వంటివి ఒలికితే వెంటనే ఫ్రిజ్ ఆఫ్ చేసి శుభ్రం చేయాలి.

Post a Comment

0 Comments