Full Style

>

సయాటికా

గ్నఫాలియం: సయాటికాకు ఇది మంచి ఔషధం. కాలి వెంబడి నొప్పి, తిమ్మిరి ఉంటుంది. నడిచినా నొప్పి తీవ్రత పెరుగుతుంది. కూర్చున్నప్పుడు నొప్పి తీవ్రత తగ్గుతుంది. నొప్పి కాలి వేళ్ళ వరకు వ్యాపించి ఉండి రాత్రి వేళ్లలో అధికంగా ఉంటుంది. ఇటువంటి లక్షణాలున్న వారికి ఈ మందు వాడుకోదగినది.

కోలోసింథ్‌:సయాటికాకు ఇది కూడా ముఖ్య మైన ఔషధం. సయాటికా నాడి వెంబడి నొప్పి ఉండటం గమనిం చదగిన లక్షణం. నొప్పి తొంటి నుండి మోకాలు వరకు లేదా మడిమ వరకు వ్యాపించి వేధిస్తుం ది. వీరు కదలికలు భరించలేరు. ఇటువంటి లక్షణాలు ఉన్న వారికి ఈ మందు ముఖ్యమైనది.

హైపరికం:వెన్నుపాముకు దెబ్బ తగిలి అనంతరం సయాటికా సమస్యను ఎదుర్కొనే వారికి ఈ మందు మరియు ‘ఆర్నిక’ దివ్య ఔషధాలు. నరాలు నలగడం లేదా ఒత్తిడికి గురికావడం వల్ల నొప్పి సయాటికా నాడి వెంట వస్తుంది. దీంతో తొంటి నుండి మడిమ వరకు నొప్పి వస్తున్నప్పుడు ఈ మందు తప్పక ఆలోచించదగినది.

ఆర్నికా:పడటం వలన నడుము ప్రాంతంలో కముకు raamదెబ్బలు తగలటం, బెణకటం వలన సయాటికా సమస్యను ఎదుర్కొనే వారికి ఈ మందు వాడుకోదగినది. అలాగే శారీరక శ్రమ అనంతరం సయాటికా నొప్పి వేధిస్తుంటే ఈ మందు వాడుకొని ప్రయోజనం పొంద వచ్చు.ఈ మందులే కాకుండా రూటా, కాల్కేరియాక్బా, సల్ఫర్‌, కాలికార్బ్‌, రస్‌టాక్స్‌, బ్రయోనియా, మాగ్‌ఫాస్‌, సింఫైటినం వంటి మందులను లక్షణ సముదా యంను పరిగణలోకి తీసుకొని వైద్యం చేస్తే సయాటికా నొప్పి నుండి విముక్తి పొందవచ్చు.

Post a Comment

0 Comments