Full Style

>

శక్తినిచ్చే డ్రైఫ్రూట్స్‌This is a featured page



శక్తినిచ్చే డ్రైఫ్రూట్స్‌
ఆరోగ్యానికి కాలవలసిన పోషకాహారం పుష్కలంగా డ్రై ఫ్రూట్స్‌లో ఉన్నాయి. అవి చూడడానికి చిన్నవిగా ఉన్నా వాటికుండే శక్తి ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇందులో ఖనిజలవణాలు, విటమిన్లు, ఎంజైములు స్రవించడానికి అవసరమైన వనరులు వీటిల్లో అధికం జీర్ణశక్తిని అధికం చేసి, రక్తాన్ని శుద్ది చేస్తాయి. అంతే కాకుండా సహజంగా తీసుకున్నా ఆహారం ద్వారా సంభవించే అనారోగ్యాలకు కూడా ఈ పండ్లు మంచి మందులా ఉపయోగపడతాయి.
బాదం పప్పు...

బాదం పాలు ఎంతో శ్రేష్ఠమైనవి బాదం పప్పు మంచి పోషకాహారం. మామూలుగా మనం తీసుకునే పాలతో పోలిస్తే ఇవి ఎంతో ఉత్తమమైనవి అని చెప్పవచ్చు. ఆవుపాలు తాగడానికి ఇష్టపడని పిల్లలకు బాదం పాలు పట్టవచ్చు. బాదం పప్పులో ఇనుము రాగి ఫాస్పరస్‌ వంటి ధాతువులు, విటమిన్‌ ‘బి’ లు ఆల్మండ్స్‌లో ఎక్కువగా ఉంటాయి. వీటి రసాయనిక చర్యల వల్ల అధిక శక్తి లభిస్తుంది.

రక్తకణాలు, హీమోగ్లోబిన్‌ సృష్టికి, గుండె, మెదడు, నాడులు, ఎముకలు, కాలేయం సక్రమంగా పనిచేయడానికి ఆల్మండ్‌లు ఎంతగానో తోడ్పడుతాయి. అవి కండరాలు బహుకాలం దృఢంగా, ఎక్కువ కాలం పనిచేసేందుకు ఇవి ఎంతగానో తోడ్పడుతాయి. బాదం పప్పును రోజూ కొద్దిగా నెత్తికి రాసుకుంటే జుట్టు రాలడం తగ్గిపోతుంది. చుండ్రు, వెంట్రుకలు ఊడటం వంటి వాటికి చక్కటి పరిష్కారం చూపుతుంది. ఎగ్జిమా వంటి చర్మం వ్యాధులకు అడవి బాదంపప్పు చాలా బాగా పనిచేస్తుంది. ఇందుకోసం బాదం ఆకులను తీసుకొని వాటిని చూర్ణం చేసి, నీటిలో పేస్ట్‌లాగా కలిపి ఎగ్జిమా ఉన్న ప్రాంతాల్లో రాస్తే సత్వర ఫలితం కనబడుతుంది. బాదం పేస్ట్‌తో, పాలను కలిపి రోజూ ముఖానికి రాసుకుంటే ముఖం కాంతి వంతంగా ఉంటుంది.
జీడిపప్పు...

శరీరానికి కావలసిన ప్రొటీన్లు ఇందులో అధికంగా ఉంటాయి. వీటిలో పొటాసియం, విటమిన్‌ బి, కూడా పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా వీటిలో ఉండే అసంతృప్త కొవ్వు పదార్ధం గుండె జబ్బులను నివారించే సామర్ధ్యాన్ని కలిగిఉంది. మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, సెలీనియం, రాగి వంటివి తగిన పరిమాణంలో లభిస్తాయి.
ఎండు ద్రాక్ష...

ద్రాక్ష పండ్లను ఎండబెట్టినప్పుడు, ఎండు ద్రాక్ష తయారవుతుంది. మంచి పోషకాహర విలువలు కలిగి ఉంటాయి. కొన్ని రకాల వ్యాధులు సోకినప్పుడు ఇవి ఉత్తమ ఆహారంగా ఉపయోగ పడుతాయి. అదేవిధంగా ఎండు ద్రాక్షను బాగా వేడి చేసిన నీళ్ళలో నానబెట్టి తర్వాత పిల్లలకు ఇస్తే వారిలో జీర్ణశక్తి బాగా వృద్ధి అవుతుంది. కాకపోతే నానబెట్టే ముందు వీటిని పొడిగా చేయాల్సి ఉంటుంది. దీనివల్ల పండ్లలోని రసం నీటిలో బాగా కలిసి పోయి పిల్లలకు పోషకాలు అందుతాయి. వీటిల్లో ఇనుము అధికంగా ఉండటం వల్ల రక్తంలోకి ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరగా చేరుతుంది. ఇవి రక్త హీనతకు మంచి మందుగా ఉపయోగపడతాయి.
ఖర్జూరపు పండ్లు...

ప్రకృతి సిద్ధంగా లభించే గ్లూకోజ్‌ ఫ్రక్టోజ్‌లు వీటిలో ఉంటాయి. ఖర్జూరాలను మెత్తగా రుబ్బి నీళ్ళలో రాత్రంతా నానబెట్టిన తర్వాత వీటిల్లోని విత్తనాలను తొలగించి కనీసం వారానికి రెండు సార్లు తీసుకుంటే మంచి ఆరోగ్యం లభిస్తుంది.చిన్న ప్రేవుల్లో చోటు చేసుకోనే సమస్యలకు వీటివల్ల మంచి పరిష్కారం లభిస్తుంది.ఇందులో మంచి పోషకాహార విలువను కలిగిఉంటాయి.
అంజీర్‌ పండు....

ఎండిన అంజీర్‌ పండులో పీచు, రాగి, మంగనీస్‌, మెగ్నీషియం, పొటాసియం, కాల్షియం, విటమిన్‌-కె, వంటికి పుష్కలంగా ఉన్నాయి. ఇంకా ఫ్లవనోయిడ్స్‌, పాలిఫినోల్స్‌ను కూడా వీటిల్లో ఉంటాయి. రోజు 35 గ్రాముల ఎండిన అంజీరు పండు పౌడ రును తీసుకుంటే‚, ప్లాస్మాలో, యాంటీ ఆక్సిడెంట్‌ సామ ర్థ్యం గణనీయంగా పెరుగుతు ంది.ఇందులోకాల్షియం పీచు రూపంలో కలిగి ఉండేది అంజీర్‌ పండులో మాత్రమే.

Post a Comment

0 Comments