Full Style

>

తాజా పండ్ల కంటే ఎండిన పండ్లు శక్తి వంతమైనవి...


ఆరోగ్యానికి కాలవలసిన పోషకాహారం పుష్కలంగా డ్రై ఫ్రూట్స్‌లో ఉన్నాయి. అవి చూడడానికి చిన్నవిగా ఉన్నా వాటికుండే శక్తి ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇందులో ఖనిజలవణాలు, విటమిన్లు, ఎంజైములు స్రవించడానికి అవసరమైన వనరులు వీటిల్లో అధికం జీర్ణశక్తిని అధికం చేసి, రక్తాన్ని శుద్ది చేస్తాయి. అంతే కాకుండా సహజంగా తీసుకున్నా ఆహారం ద్వారా సంభవించే అనారోగ్యాలకు కూడా ఈ పండ్లు మంచి మందులా ఉపయోగపడతాయి. ఎండిన పండ్లలో మనకు మహా అయితే ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూర తెలుసు. కానీ... వాటి వల్ల ఒనగూరే ప్రయోజనాలపై పెద్దగా అవగాహన లేదు. అయితే ఎండిన పండ్లతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటి వల్ల అనేక వ్యాధులు నెమ్మదిస్తాయి. మరికొన్ని వ్యాధులకవి ఉపశమనంగానూ, నివారణ కోసం పనికి వస్తాయి. కొన్ని ఎండు పండ్లు... ఆరోగ్య పరిరక్షణలో, వ్యాధుల నివారణలో వాటి ప్రయోజనాలివి...

1. హైబీపీ నివారణకు డ్రై ఆప్రికాట్(ఎండు ఆప్రికాట్): అరటిపండులో పొటాషియమ్ పుష్కలంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే ఒక అరటి పండులో కంటే ఒక ఎండిన ఆప్రికాట్‌లో మూడు రెట్ల కంటే ఎక్కువ పొటాషియమ్ ఉంటుంది. ఇది హైబీపీ తగ్గించడానికి బాగా ఉపకరిస్తుంది. ఇటీవలే అట్లాంటాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అనే సంస్థలో నిర్వహించిన అధ్యయనంలో సోడియం కంటే పొటాషియమ్ ఎక్కువగా తీసుకోవడం అన్నది హైబీపీ నియంత్రిస్తుందని తేలింది. అందుకే హైబీపీ నియంత్రణకు ఎండిన ఆప్రికాట్ ఎంతైనా మంచిది.
2. నీరసాన్ని నివారించే ఎండు ఖర్జూరం: ప్రకృతి సిద్ధంగా లభించే గ్లూకోజ్‌ ఫ్రక్టోజ్‌లు వీటిలో ఉంటాయి. ఖర్జూరాలను మెత్తగా రుబ్బి నీళ్ళలో రాత్రంతా నానబెట్టిన తర్వాత వీటిల్లోని విత్తనాలను తొలగించి కనీసం వారానికి రెండు సార్లు తీసుకుంటే మంచి ఆరోగ్యం లభిస్తుంది.చిన్న ప్రేవుల్లో చోటు చేసుకోనే సమస్యలకు వీటివల్ల మంచి పరిష్కారం లభిస్తుంది.ఇందులో మంచి పోషకాహార విలువను కలిగిఉంటాయి. ఎవరిలోనైనా చక్కెర పాళ్లు తక్కువగా (లో గ్లైసీమిక్ ఇండెక్స్) ఉండి బాగా నీరసంగా ఉండి, అన్నం దొరకని పరిస్థితుల్లో నిస్సత్తువ తగ్గించేందుకు వెంటనే ఎండు ఖర్జూరాలు తినాలి. వీటిలో ఉండే చక్కెర వల్ల ఒకటి రెండు ఎండు ఖర్జూరాలతోనే అన్నం తిన్నంత ఫలితం ఉంటుంది. అయితే వీటి వల్ల కడుపు నిండిన ఫీలింగ్ మాత్రం ఉండదు. అలా కడుపు నిండిన తృప్తి కలగాలంటే వెంటనే కొన్ని వాల్‌నట్స్ తినడం మంచిది.
3. జీర్ణశక్తిని పెంచే ఎండు ద్రాక్ష: ఎండు ద్రాక్ష ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో. వీటిల్లో చెక్కర శాతం ఎక్కువ. అనారోగ్యంతో నీరసించిన వాళ్ళు ఇవి కాసిని తింటే వెంటనే కోలుకుంటారు. ముఖ్యంగా మలబద్ధకంతో బాధపడేవాళ్ళు -రెండు టేబుల్ స్పూన్లు ఎండు ద్రాక్షను గ్లాసు నీళ్లలో రోజంతా నానబెట్టి ఉదయాన్నే తాగి, పండ్లను తినేస్తే సరి. చిన్న పిల్లలకి ఈ నీళ్లు మరీ మంచిది. వయస్సును బట్టి ఆరునుంచి పది ఎండు ద్రాక్షను నానబెట్టి పట్టించాలి. ఇందులో ఐరన్‌కూడా ఎక్కువ. బరువు తక్కువుగా ఉన్నవాళ్లకీ, రక్తహీనతతో బాధపడే వాళ్లకీ మంచిది. అదేవిధంగా ఎండు ద్రాక్షను బాగా వేడి చేసిన నీళ్ళలో నానబెట్టి తర్వాత పిల్లలకు ఇస్తే వారిలో జీర్ణశక్తి బాగా వృద్ధి అవుతుంది. కాకపోతే నానబెట్టే ముందు వీటిని పొడిగా చేయాల్సి ఉంటుంది. దీనివల్ల పండ్లలోని రసం నీటిలో బాగా కలిసి పోయి పిల్లలకు పోషకాలు అందుతాయి. వీటిల్లో ఇనుము అధికంగా ఉండటం వల్ల రక్తంలోకి ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరగా చేరుతుంది.
4. గౌట్ నివారణకు ఎండు చెర్రీలు: మార్కెట్‌లో లభించే ఎండు చెర్రీలలోని యాంథోసయనిన్ అనే పోషకం వల్ల గౌట్, ఆర్థరైటిస్ సమస్యల కారణంగా కనిపించే ఎముకల్లో మంట, నొప్పి, ఇన్‌ఫ్లమేషన్ నివారితమవుతాయి. ఇటీవలే మిషిగన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో చేసిన అధ్యయనంలో ఎండు చెర్రీ పండ్లు తినేవారిలో ఎముకల్లోని మంట, నొప్పి, ఇన్‌ఫ్లమేషన్ సగానికి సగం తగ్గుతాయని తేలింది.
5. మూత్ర ఇన్ఫెక్షన్‌ల నివారణకు ఎండిన క్రేన్ బెర్రీస్: మూత్ర ఇన్ఫెక్షన్లతో బాధపడేవారు ఎండిన క్యాన్‌బెర్రీస్ తింటే... కనీసం 20 శాతం మందిలో కేవలం వాటివల్లనే ఉపశమనం కలిగినట్లుగా అమెరికన్ పరిశోధన ఫలితాలు పేర్కొంటున్నాయి. వీటి వల్ల ఈ-కోలై బ్యాక్టీరియా నుంచి కూడా ఉపశమనం కలుగుతుందని తేలింది. ఎండిన క్యాన్‌బెర్రీలలో ఉండే ప్రో-యాంథోసయనిన్ అనే పోషక పదార్థం వల్ల ఈ ప్రయోజనం ఒనగూరుతుందని తేలింది.
6. రక్తహీనతను నివారించే ఫిగ్: రక్తహీనత (అనీమియా)ను నివారించాలంటే సాధారణంగా మాంసాహారమైన కాలేయం, గుడ్లు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తుంటారు. ఇది శాకాహారులకు ఒకింత ఇబ్బంది కలిగించే అంశం. కేవలం శాకాహారం తీసుకోవడం ద్వారానే మాంసాహారం తిన్న ఫలితాలను పొందాలంటే ఎండిన ఫిగ్స్‌పై ఆధారపడండి. దీనిలోని ఐరన్, విటమిన్-సి వల్ల రక్తహీనత తగ్గడంతో పాటు వ్యాధినిరోధక శక్తి కూడా పెంపొందుతుంది.
7. గుండెకు మేలు చేసే జీడిపప్పు: శరీరానికి కావలసిన ప్రొటీన్లు ఇందులో అధికంగా ఉంటాయి. వీటిలో పొటాసియం, విటమిన్‌ బి, కూడా పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా వీటిలో ఉండే అసంతృప్త కొవ్వు పదార్ధం గుండె జబ్బులను నివారించే సామర్ధ్యాన్ని కలిగిఉంది. జీడిపప్పు లో మోనో అన్ శాచ్యురేటెడ్ కొవ్వులు ఎక్కువుగా ఉండటంతో ఇవి గుండెకు మేలుచేస్తాయ. పోటాషియం, మెగ్నీషియం, ఫాస్పర్, సెలీనియం, కాపర్, విటమిన్‌లు ఇందులో అధికం. ఖర్జురాల్లో గ్లూకోజ్, ఫ్రక్టోజోలు ఎక్కువ. నీళ్లలో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే గింజల్ని తీసేసి కనీసం వారానికి రెండుసార్లు తింటే గుండె పదిలమే. ఇందులో కొద్ది పాళ్లలో ఉన్న నికోటిన్ పేగుల్లోని ఇబ్బందుల్ని తొలగిస్తుంది.

Post a Comment

0 Comments