10-15 తులసి ఆకులు తీసుకొని దానికి నాలుగు వెల్లుల్లి పాయలు, ఒక
టీస్పూను శొంఠి పొడిని జతచేసి మెత్తగా నూరి ఆ మెత్తటి మిశ్రమాన్ని నుదుటికి
రాసుకోవాలి.
అర టీ స్పూను శొంఠి పొడిలో చిటికెడు ఏలకుల పొడి కలిపి ఒక టీ స్పూను తేనెలో రంగరించి తింటే దగ్గు నుంచి ఉపసమనం లభిస్తుంది.
అర టీ స్పూను ఆవపొడిలో ఒక టీ స్పూను తేనె కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది.
అర కప్పు నీటిని మరిగించి ఒక టీస్పూను అల్లం రసం కలిపి వేడిగా తాగాలి. రెండు గంటలకొకసారి తాగుతుంటే అతిసారం పూర్తిగా తగ్గుతుంది.
అర టీస్పూను నిమ్మరసం, అర టీ స్పూను అల్లం రసం, పావు టీ స్పూను మిరియాల పొడి కలిపి రోజుకు రెండుసార్లు తాగాలి.
ఆర్ధరైటిస్, గుండె, మెదడు, కిడ్నీలు, కళ్ల సమస్యలను దూరం
చేస్తుంది. సోయాబీన్ కొవ్వుకణాల సైజును తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా
తింటే స్ధూలకాయం రాకుండా శరీరాన్ని అదుపులో ఉంచుతుంది.
అరటిపండును చిన్నముక్కలు చేసి చిలికిన పెరుగులో కలిపి రోజుకు రెండు, మూడు సార్లు తింటే డయేరియా అదుపులోనికి వస్తుంది.
అజీర్తితో బాధపడుతున్నప్పుడు జీలకర్రను పొడి చేసి చిటికెడు తీసుకుంటే ఉపశమనంగా ఉంటుంది.
అనీమియాతో బాధపడుతుంటే ఆహారంలో వీలయినంత ఎక్కువగా మెంతి ఆకు తీసుకోవాలి.
అరలీటరు నీటిలో పదిగ్రాముల నల్లతులసి ఆకులను వేసి మరిగించి ఆ నీటిని తాగుతూ ఉండాలి.
అరకప్పు నిమ్మరసంలో కాస్త అల్లం రసం కలుపుకొని తాగితే
దగ్గునుంచి ఉపశమనం కలుగుతుంది. ఇలా రోజుకి రెండు మూడు సార్లు తాగితే ఫలితం
ఉంటుంది.
అల్లం ముక్కను నిప్పుల మీద కాల్చి తింటే వికారం తగ్గుతుంది.
అయిదారు లవంగాలు, ఒక హరతి కర్పూరాన్ని కాటన్ క్లాత్‌లో
కట్టి పంటినొప్పి ఉన్నచోట పెట్టి పళ్లతో గట్టిగా నొక్కి పట్టాలి. కాసేపటికి
పంటినొప్పి తగ్గిపోతుంది.
ఆస్త్మాతో బాధపడుతుంటే ఉప్పునీటి పాత్రను దగ్గర ఉంచుకొని
పీలుస్తుంటే ఆ లక్షణాలు దూరమవుతాయి. ముక్కు పట్టేసినట్లుండటం కూడా
తగ్గుతుంది. సైనస్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడేవాళ్ళు మామూలు ఉప్పుకు బదులుగా
బేకింగ్ సోడా కలుపుకోవాలి.
ఆస్త్మాతో బాధపడేవాళ్లు వెల్లుల్లి రేకలు వేసి మరిగించిన
పాలు తాగుతుంటే వ్యాధి బాధించదు. ప్రతిరోజూ రాత్రి పడుకునేముందు ఒక గ్లాసు
పాలలో మరిగేటప్పుడే మూడు లేదా నాలుగు వెల్లుల్లి రేకలను వేసుకుని తాగాలి.
ఆరోగ్యంగా ఉండాలంటే తినటం, తాగటంలో మాత్రమే జాగ్రత్తలు
తీసుకుంటే సరిపోదు. శ్వాస తీసుకోవడంలో కూడా ఒక క్రమ పద్దతి పాటించాలంటారు
నిపుణులు. దీర్ఘంగా ఉంటే ఊపిరితిత్తుల నిండుగా శ్వాసించాలి.
ఇంగువ జీర్ణశక్తికి సంబంధించిన సమస్యలకు మందుగా పని
చేస్తుంది. బోజనానంతరం ఒక చిటికెడు ఇంగువ, చిటికెడు ఉప్పును మజ్జిగలో కలిపి
తీసుకుంటే గ్యాస్ తగ్గుతుంది. దీనివల్ల ఆహారం చక్కగా జీర్ణమవుతుంది.
ఇన్సులిన్ పని తీరును మెరుగుపరచటంలో వేప, నేరేడు, మెంతులు,
కాకర బాగా పని చేస్తాయి. కాబట్టి వీటిని ఆయా కాలాలను బట్టి ఏ రకం
అందుబాటులో ఉంటే వాటిని వాడాలి. తాజాగా సేకరించటం సాధ్యంకానట్లయితే ఇవన్నీ
విడివిడిగా పౌడర్లు దొరుకుతాయి. వాటిని రోజూ ఉదయం ఒక టీ స్పూను, రాత్రి ఒక
టీ స్పూను చొప్పున నీటితో కలిపి తీసుకోవాలి.
ఇందులోని యాంటి ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీరాడికల్స్‌ను
అదుపు చేస్తాయి. వాటిని చేరకుండా నిరోధిస్తాయి. చిన్న వయసులోనే జుట్టు
తెల్లబడటాన్ని , చర్మం మీద ముడతలు వంటి వార్ధక్య లక్షణాలను నివారిస్తుంది.
ఉల్లిపాయల్ని మెత్తగా నూరి ఆ ముద్దని నుదుటి మీద పెట్టుకుంటే తలనొప్పి బాధ నుంచి ఉపశమనం పొందుతాం.
ఉసిరిక పొడి, శొంఠి, పిప్పిలి, మిరియాల చూర్ణం నెయ్యి బెల్లంలో కలిపి రోజు తీసుకుంటే త్వరగా తగ్గుతుంది.
ఉసిరి కాయ రసం, నిమ్మరసం, చెక్కెర కలిపి రోజుకు రెండు మూడు సార్లు తాగాలి.
ఎసిడిటీతో కాని అజీర్తితో కాని బాధపడుతుంటే ఒక గ్లాసు నిమ్మరసంలో ఒక టీ స్పూను అల్లంరసం కలిపి తాగాలి.
ఎగ్జిమా వంటి చర్మవ్యాధులుంటే తేనె, దాల్చిన చెక్కపొడి సమపాళ్లలో తీసుకుని కలిపి ఆ మిశ్రమాన్ని రాస్తే తగ్గుతుంది.
ఎండ పెరిగేకొద్దీ శరీరానికి నీటి అవసరం పెరుగుతుంది.
ఎండతాపానికి తాళలేక దాహం తీరడానికి కూల్‌డ్రింక్‌ల వంటి వాటికి
దాసోహమవుతుంటాం. కాని వాటి బదులుగా తాజా పండ్లరసాలు, నిమ్మరసం కలిపిన
మజ్జిగ తాగితే ఆరోగ్యం మెరుగై చర్మసౌందర్యం ఇనుమడిస్తుంది.
ఐదు లేదా పది మిరియాలను మెత్తగా పొడి చేసి చక్కెర లేదా
నేతితో కలిపి తీసుకుంటే మామూలు జలుబు, ముక్కు కారడం, గొంతులో దురద, నోరు
అతుక్కుపోయినట్టు అవ్వడం, గొంతునొప్పి, దగ్గు, జ్వరం ల నుండి ఉపశమనం
లభిస్తుంది.
ఒక చిటికెడు మిరియాల పొడిని మజ్జిగలో వేసుకొని ప్రతి రోజు తాగుతుంటే అరుగుదల క్రమబద్దం అవుతుంది.
ఒక టేబుల్ స్పూను తేనెలో అర టేబుల్ స్పూను అల్లం రసం కలిపి తీసుకుంటే జలుబు వదులుతుంది. ఇలా రోజుకు మూడుసార్లు చేయాలి.
ఒక గ్లాసు మజ్జిగలో ఒక టేబుల్ స్పూను కొత్తిమీరరసాన్ని కలిపి తాగినా కూడా అజీర్తి తగ్గి జీర్ణక్రియ మెరుగవుతుంది.
ఒక లీటరు నీటిని మరిగించి అందులో రెండు టేబుల్ స్పున్ల
చెక్కెర, చిటికెడు ఉప్పు కలిపి కరిగిన తర్వాత చల్లార్చి వడపోయాలి. ఈ
ద్రావణాన్ని తరచుగా తీసుకుంటే సమస్య అదుపులోనికి వస్తుంది. శరీరం కోల్పోయిన
శక్తిని తిరిగి పుంజుకుంటుంది.
ఒక టీ స్పూను తేనెలో అంతే మోతాదులో సన్నగా తరిగిన అల్లం
ముక్కలు వేసుకొని పరగడుపునే తినాలి. ఎప్పటికప్పుడు అల్లం తరిగి
కలుపుకోవచ్చు, లేదా ఒకేసారి తేనె సీసాలో అల్లం ముక్కలువేసి రోజు తినవచ్చు.
ఒక గ్లాసు నీటిలో ఒక టీ స్పూను ఆపిల్ సైడర్ వెనిగర్
కలిపి భోజనం చేసిన తర్వాత తాగితే ఆరోగ్యానికి మంచిది. డయేరియాను
నివారిస్తుంది.
కప్పు వేడి నీటిలో చిటికెడు పసుపు వేసి రాత్రి పడుకునేముందు తాగితే గొంతు నొప్పి, జలుబు నుండి ఉపశమనం కలుగుతుంది.
కండరాల నొప్పులు, కీళ్ళనొప్పులు ఉన్న ప్రాంతంలో ఒక టేబుల్
స్పూను మిరియాల పొడిని ఆవ నూనె వేసి వేడిచేసి గోరువెచ్చగా చేసి రాస్తే మంచి
ఫలితం కనిపిస్తుంది.
కడుపు ఉబ్బరం కారణంగా కడుపునొప్పి ఉన్నప్పుడు కొంచెం
వాముని వేడి చేసి ఒక కప్పు నీటిని జోడించి నీరు సగం అయ్యే వరకు మరిగించాలి.
దీంట్లో ఒక చిటికెడు ఉప్పు లేదా పంచదారని కలిపి తాగాలి. కాస్త వాముని
ఉప్పుతో కలిపి నమిలినా అజీర్తి ఉపశమనంగా పనిచేస్తుంది.
కడుపు నొప్పిగా ఉండి, నొప్పి ఎందుకు వస్తుందో అర్ధం
కానపుడు కొంచెం జీలకర్రని తీసుకుని వేడి చేయండి. ఇఫ్ఫుడు వాటికి ఒక కప్పు
నీటిని చేర్చి నీరు సగం అయ్యే వరకు మరిగించండి. ఈ నీటిలో రెండు మూడు
చుక్కలు నెయ్యిని వేసి తాగండి. అది గ్యాస్ వల్ల వచ్చిన కడుపు నొప్పి అయితే
తగ్గుతుంది. నొప్పి ఇంకా ఉంటే మాత్రం డాక్టరుని సంప్రదించాలి.
కడుపునొప్పిగా ఉన్నప్పుడు ఇంగువని నీటిలో కలిపి బొడ్డుమీద ఉంచాలి.
కడుపునొప్పితో బాధపడుతున్నప్పుడు పదిగ్రాముల ఏలకులను
పొడినీటిలో కలిపి కాని, నీటీలో నానబెట్టిన ఏలకులను గ్రైండ్ చేసి కాని
తీసుకోవాలి.
కనీసం వారానికి ఒకసారయినా కాకరకాయను ఆహారంలో చేర్చుకుంటే మంచిది(చేదు కోల్పోకుండా జాగ్రత్త తీసుకోవాలి).
కనీసం ఏడు-ఎనిమిది వారాలకు ఒక సారైనా ఒంటికి పసుపు
రాసుకొని స్నానం చేస్తే చర్మ సంబంధ వ్యాధులు రావు. క్రమేణా చర్మం మీద ఉండే
అన్‌వాంటెడ్ హెయిర్ రాలిపోతుంది. ఈ కాలంలో అయితే నువ్వుల నూనెలో పసుపు
కలిపి ఒంటికి పట్టించాలి.
కళ్ళకలక వచ్చినప్పుడు దూదిని ధనియాలు నానేసిన నీటిలో ముంచి కళ్ళను తుడిస్తే ఉపశమనంగా పనిచేస్తుంది.
కళ్ళు మంటలు, కళ్ళవెంట నీరు కారడంలాంటి సమస్యలతో బాధపడేవారు తులసి ఆకుల రసాన్ని కంటి మీద రాసి చూడండి.
కాలిన మచ్చలకు తేనె రాస్తే కాలిన మచ్చలు పోతాయి.
కాళ్ళు చేతులు బెణికి నట్లయితే ఉప్పుతో కాపడం పెడితే తగ్గుతుంది.
కాస్త చింతపండు గుజ్జు, టమాటారసం, మిరియాల పొడి, ఒక
మిరపకాయ, కాస్త ఉప్పులతో తయారు చేసిన సూప్‌ని వేడిగా తాగితే జలుబు, ముక్కు
కారటం తగ్గుతాయి.
కాస్త దాల్చిన చెక్క పొడి, ఒక టేబుల్ స్పూను తేనె, కొంచెం
మిరియాల పొడి, రెండు చుక్కల నిమ్మరసం ఇవన్నీ కలిపి తీసుకుంటే సాధారణ జలుబు
తగ్గుతుంది.
కూరగాయలు తరిగేటప్పుడు చేతులు తెగటం దాదాపుగా అందరికీ
జరుగుతుంది. తెగిన వెంటనే గాయానికి పసుపు అద్దితే గాయం త్వరగా మానుతుంది.
సెప్టిక్ కాదు.
కొన్ని తులసి ఆకులను రాత్రి నీటిలో నానబెట్టి ఆ నీటితో ఉదయం పళ్ళు తోముకుంటే నోటి దుర్వాసన, నోటిపొక్కులు మాయమవుతాయి.
కొందరికి కళ్ల చుట్టూ ముడతలు వస్తుంటాయి. బహుశా కళ్ల సమస్య
ఉండి కూడా డాక్టరు సూచించిన మేరకు రీడింగ్ గ్లాసు వాడకపోవడం కూడా ఇందుకు
కారణం కావచ్చు. డాక్టరు సలహాను అనుసరించి కళ్లను అధిక శ్రమకు గురిచేయకుండా
జాగ్రత్త తీసుకోవాలి.
క్రమం తప్పకుండా ధనియాలు వాడుతుంటే అధిక రుతుస్రావం ఆగుతుంది.
క్రమం తప్పకుండా సోయాబీన్ తింటే శరీరంలో కొలెస్ట్రాల్ నిల్వలు చేరవు. ఎప్పటికప్పుడు కొలెస్ట్రాల్‌ను కరిగించి వేస్తుంది.
గర్భిణీలకు ఉదయాన్నే కాని, మరికొందరిలో ఏం తిన్నా కూడా
వెంటనే వాంతులవడాన్ని చూస్తుంటాం. పరగడుపున ఒక టేబుల్ స్పూను తేనెలో అంతే
మోతాదు నిమ్మరసాన్ని కలిపి తీసుకుంటే వాంతులు ఆగిపోతాయి. తిన్నది కడుపులో
ఇముడుతుంది.
గాయాలు రక్తం కారుతుంటే చందనం పొడిలో కొద్దిగా నీటిని కలిపి పేస్టులా చేసుకుని గాయానికి రాయాలి.
గజ్జి, తామర వంటివి బాధిస్తుంటే ఒక టీ స్పూను మిరియాల
పొడిలో ఒక టీ స్పూను నెయ్యి కలిపి రోజుకి మూడు సార్లు చొప్పున తీసుకుంటే
తగ్గిపోతుంది.
గర్భిణికి డయేరియా వస్తే డాక్టరు పర్యవేక్షణలో చికిత్స
చేయటం అవసరం. ఎందుకంటే... అప్పటివరకు గర్భిణుల ఆరోగ్యస్ధితిని బట్టి
డాక్టర్లు సూచించిన చాలా మందులను వాళ్లు వాడుతుంటారు. కాబట్టి వాటికి
అనుగుణంగా తదుపరి చికిత్సను డాక్టర్లే సూచిస్తారు.
గ్లాసు వేడినీటిలో టీస్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు కలిపి రోజుకు మూడుసార్లు గార్గిలింగ్ చేస్తూ ఉంటే గొంతునొప్పి తగ్గిపోతుంది.
గుండె గదుల్లో అడ్డంకులు ఏర్పడకుండా నిరోధిస్తుంది. తద్వారా గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది.
0 Comments