అతి మూత్రవ్యాధి ఉన్నవారు రాత్రి నిద్ర పోయే ముందు ఒక చెంచా తేనె పుచ్చుకుంటే మాటి మాటికి మూత్రానికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు.
ఆరు నెలలు పూటకు రెండు ఔన్సుల చొప్పున తేనె పుచ్చుకుంటే గుండెకు మేలు చేస్తుంది.
ఎదిగే పిల్లకు పోషకాహారంగా తేనె ఎంతో ఉపకరిస్తుంది.
ఒక చెంచా తేనె, ఒక నిమ్మకాయరసం, అరగ్లాసు నీటీలో కలిపి తీసుకుంటే వడదెబ్బను నివారించవచ్చు.
క్రీడాకారులు ఆటల్లో పాల్గొనబోయే ముందు తేనె, నిమ్మరసం
సమపాళ్ళలో తీసుకుంటే ఉత్సాహం, ఉత్తేజం కలిగి త్వరగా అలసట కలుగదు. ఆటలు ఆడిన
తర్వాత తీసుకుంటే ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి.
తేనె పుచ్చుకుంటే కళ్ళకు చలువ చేసి దృష్టి మెరుగుపడేలా చేస్తుంది.
తేనె, నిమ్మరసం సమభాగాలుగా తీసుకుంటూ ఉంటే గొంతునొప్పి, గొంతు గరగర, గొంతు బొంగురుపోయినట్లుండటం వంటి బాధలు తగ్గుతాయి.
తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలను గర్భిణీలు రోజూ ఉదయం, సాయంత్రం ఒకటి లేదా రెండు తింటే పుట్టబోయే బిడ్డకు బలవర్ధకం.
తేనెలో కొద్దిగా ఆముదం చేరిస్తే మంచి విరేచనకారిగా పనిచేస్తుంది.
పంచదారకు బదులుగా తేనెను వాడటం వల్ల ఆరోగ్యదాయకంగా పనిచేస్తుంది.
ప్రకృతిలో సహజసిద్దంగా లభించే ఆహారపదార్ధాలలో తేనె ఉత్తమమైనది, పుష్టికరమైనది.
భోజనానంతరం తీసుకుంటే పైత్యహారిగా పనిచేస్తుంది. శరీరంలోని అధిక వేడిని తొలగిస్తుంది.
మనం తీసుకొనే ఆహారపదార్ధాలు, పానీయాలు మొదలైనవి
జీర్ణక్రియలో భాగంగా గ్లూకోజ్, సుక్రోజ్, ఫ్రక్టోజ్‌లుగా మారిన తరువాత
క్రమంగా జీర్ణం అవుతాయి. కానీ తేనె ఇలా ఏ మార్పులూ లేకుండా సులభంగా జీర్ణం
అవుతుంది.
రెండు తులాల తేనెలో ఒక నిమ్మకాయ రసం కలుపుకొని రోజూ తాగితే పులితేపులు తగ్గుతాయి.
రెండు గ్లాసుల నీటిలో నాలుగు టేబుల్ స్పూన్ల తేనె కలిపి తాగాలి. ఇది డయేరియా తగ్గడానికి సులభమైన మార్గం.
అజీర్తితో బాధ పడుతుంటే మూడు వెల్లుల్లి రెబ్బల్ని మెత్తగా నూరి పాల లో కలుపుకుని తాగితే వెంటనే రిలీఫ్ వస్తుంది.
కొత్తీమీర రసాన్ని మజ్జిగలో కలుపుకొని తాగితే అజీర్తి బాధ నుండి ఉపశమనం లభిస్తుంది.
గ్లాసుడు నీళ్ళలో టీ స్పున్ అల్లరసం, టీ స్పూన్ నిమ్మరసం కలిపి తాగితే అజీర్తి బాధ వెంటనే తగ్గుముకం పడుతుంది.
నిద్రలేమితో బాధపడుతున్నవారు కొన్ని కొత్తిమీర ఆకుల్ని
మెత్తగా నూరి ఆ రసాన్ని వేడి నీళ్ళ లో కలిపి గోరు వెచ్చగా అయ్యాక తాగితే
మంచి ఫలితం వుంటుంది.
వెల్లుల్లి రెబ్బలను పాలలో మరగబెట్టి తీసుకుంటే ఆస్తమా నుండి ఉపశమనం లభిస్తుంది.
అరటి పండు లో చెక్కెర...సుక్రోజ్ ఫ్రక్టోజ్, గ్లూకోజ్
వంటివి సహజరూపం లో ఉంటాయి. పీచు పదార్ధాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. రెండు
అరటిపండ్లు తింటే 90 నిమిషాల పాటు పని చేయవచ్చని పరిశోధనల్లో రుజువైంది.
అందుకే క్రీడాకారులు ఎక్కువగా అరటిపండు తీసుకుంటారు. అనారోగ్యం నుండి
త్వరగా కోలుకోవటానికి అరటిపండు మంచి ఆహారం. కాబట్టి ప్రతీరోజూ అరటిపండు
తింటే శక్తితో పాటు జీర్ణవ్యవస్ధ పని తీరు మెరుగవుతుంది.
దగ్గు నివారణకు గొంతు మంటకు మందుగా పనిచేస్తుంది.
డయేరియా నుంచి విముక్తి లభిస్తుంది.
తేనె రక్తాన్ని శుద్ధి చేసి, బ్లడ్ సర్క్యులేషన్‌ని క్రమబద్దీకరిస్తుంది.
కాలిన గాయాలను త్వరగా తగ్గిస్తుంది. అల్సర్‌ను నివారిస్తుంది.
తేనెలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వాటివల్ల సులభంగా జీర్ణమవుతుంది.
ప్రతిరోజూ ఒక టేబుల్‌స్పూన్ తేనె నీటిలో కలిపి పరగడుపునే తీసుకుంటే కిడ్నీలు బాగా పనిచేస్తాయి. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
పిల్లల్లో వ్యాధినిరోధక శక్తి పెరగడానికి క్రమం తప్పకుండా తేనె ఏదో ఒక రకంగా ఇవ్వాలి.
నోటి పూత, నోటిలో గుల్లలు వంటి సమస్యల నివారణకు తేనె వాడొచ్చు.
చక్కెరతో పోల్చితే తేనెలో క్యాలరీలు తక్కువ. తేనెలో కొవ్వు శాతం కూడా చాలా తక్కువ.
అధిక బరువును తగ్గించడంలో తేనె అద్భుతంగా పనిచేస్తుంది.
రోజూ ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక
చెక్క నిమ్మరసం కలుపుకొని తాగితే స్థూలకాయాన్ని నివారించవచ్చు. కడుపు
నొప్పికి ఇది మంచి మందు.
ఎనీమియా, ఆస్తమా, బట్టతల, తీవ్రమైన జ్వరం, తలనొప్పి, బిపి, ఒత్తిడి, పక్షవాతం వంటి అనేక వ్యాధులను దూరంగా ఉంచుతుంది.
0 Comments