Full Style

>

లైపోసక్షన్‌లో ఇబ్బంది లేదు

ఓ రోజున నేను జాగింగ్‌ చేస్తుంటే వెనుక నుంచి పిలుపు వినిపించింది. చూస్తే నా చిన్ననాటి స్నేహితుడు. ఈ మధ్య అతను మనదేశంలో ఉండకపోవడంతో కొన్ని సంవత్సరాలు అరుు్యంది కలుసుకుని.mఅతనిలో కనిపించిన కొద్దిపాటి మార్పులు నాకు ఆశ్చర్యం కలిగించారుు. పొట్ట పెరిగింది. తోడలు లావుగా అయ్యారుు.

Lipoగతంలో అతను మంచి క్రీడాకారుడు. చాలాకాలం తరు వాత చూడటంతో ఆనందం కన్నా ఇలా పొట్టతో చూడడం చాలా బాధాకరంగా అనిపించింది. ఇద్దరం కలిసి జాగింగ్‌ ప్రారంభించినప్పుడు నేను ఆ మాటలనే అతనితో అన్నాను. వ్యాయామం చేయని వాళ్ళు, ఒత్తిడిని అనుభ విస్తున్న వాళ్లు, తొడలు తగ్గడం లేదని. ‘లైపోసక్షన్‌’ చేయిస్తే ఈ అధిక కొవ్వు తగ్గించుకోవచ్చా అని అడుగుతుంటారని చెప్పడంతో మా మిత్రుడు అదే ప్రశ్న అడిగాడు. ‘లైపోసక్షన్‌’ వల్ల అపాయాలు ఏవీ ఉండవా అని ప్రశ్నించాడు. ‘‘లైపోసక్షన్‌’’ చేయించుకోవడం వల్ల ఎటువంటి అపాయం లేదు. అత్యంత ఆధునిక ఎనస్థీషియా వాడతాము. సురక్షిత మైన విధానం ద్వారా చర్మం క్రింద పేరుకుపోయిన కొవ్వుని తగ్గిస్తాము అని జవాబు చెప్పాను.

మనం తీసుకునే ఆహారం కన్నా... చేసే పని... ఖర్చుపెట్టే ఆహారం చాలా తక్కువ. ఇది కొవ్వు రూపంలో చర్మం క్రింద పేరుకుపోతుంటుంది. ఎక్కువగా పొట్ట, తొడలు, రొమ్ముల ప్రాంతంలో ఆడవాళ్ల లోనూ, మగవాళ్లలో, జబ్బల్లోనూ, పొట్ట లాంటి ప్రాంతంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది. ఇలా కొన్ని ప్రాంతాలలో కొవ్వు ఎక్కువగా ఉన్నప్పుడు ‘‘లైపోసక్షన్‌’’ని చేసి అధికమైన కొవ్వును తీసివేయడం జరుగుతుంది. ఆ ప్రాం తంలో 2 నుంచి 3 మిల్లీమీటర్ల హోల్‌ చేసి లోపలి కొవ్వుని బయటకి తీయడానికి ముందుగా కొవ్వుని ద్రవపదార్థంగా మార్చేట్లు చేస్తారు. ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన హోల్‌ ద్వారా లోపల కొవ్వుని బయటకి తీసివేయడం జరుగుతుంది. ఆ చర్మం క్రింద కొవ్వుని మాత్రమే సక్‌ చేయటం వల్ల లోపల అవయవాలకి ఎటువంటి ఇబ్బంది ఉండదు.

ఈ విధానంలో కొద్దిపాటి తలతిరగడం లేక వాంతులు రావడం కొంతమందిలో వెంటనే జరగవచ్చు. ఎనస్టీ షియా కారణంతో కొద్దిసేపటిలో అవి తగ్గిపోతాయి. ‘‘లైపోసక్షన్‌’’ని సురక్షితంగా, ఇబ్బంది లేకుండా చేయడానికి జనరల్‌ ఎనస్టీషియాలో చేయవ లసివస్తుంది. చాలా తక్కువ కొవ్వు పేరుకున్న ప్రదేశంలో మాత్రమే లోకల్‌ ఎనస్టీషియా ఇచ్చి ఆ ప్రదేశాలలో కొవ్వు తీస్తారు. కాస్తంత ఎక్కువగా పేరుకుని ఉంటే దీనిని జనరల్‌ ఎనస్థీషియాతో తీయవలసి వస్తుంది. లోకల్‌ ఎనస్థీషియా ఎక్కు విస్తే అపాయం ఉంటుంది. తక్కువ ఇస్తే నొప్పి ఎక్కువగా ఉం టుంది. కాబట్టి జనరల్‌ ఎనస్థీషియా ఇవ్వడం జరుగుతుంది.అమెరికా లాంటి దేశాలలో ‘‘లైపోసక్షన్‌’’కి సైడ్‌ ఎఫెక్స్‌ లేకపోవ డంతో ఏటా రెండు నుంచి మూడు లక్షల మంది ‘‘లైపోసక్షన్‌’’ చేయించుకుంటున్నారు.
ఇకడా అనుభవం ఉన్నవాళ్లన్న పెద్ద సెంటర్లకు వెళితే లైపోస క్షన్‌కి సైడ్‌ ఎఫెక్ట్‌‌స ఉండవు. చాలామంచి నాణ్యమైన పెయిన్‌ కిల్లర్స్‌ ఇస్తారు కాబట్టి లైపోసక్షన్‌ కాగానే ఎక్కువ నొప్పి ఉండదు. తక్కువగా ఉంటుంది. ఈ శస్త్రచికిత్స జరిగిన తరువాత 5 గంటలలోపే పేషెంట్‌ మామూలుగానే నడ వవచ్చు. పొట్టలో కొవ్వుతీసే లైపోసక్షన్‌ ‘‘డేకేర్‌’’ ప్రొసీజర్‌లో కూడా చేస్తున్నారు. అంటే ఉదయం లైపోసక్షన్‌ చేయించుకుని, సాయంత్రం హాయిగా ఇంటికి వెళ్లిపోవచ్చు. మనిషి ఎత్తు, లావును బట్టి బరువు తగ్గడం ఉండదు. ఒకసారి లైపోసక్షన్‌ జరగ్గానే బరువు తగ్గుతామని అనకోకూడదు. ఎందుకంటే శస్త్ర చికిత్స జరిగిన తరువాత కణాలలో కొద్దివాపు ఉంటుంది. ఆ వాపు క్రమంగా తగ్గుతుంది. అప్పటికీ కొంతబ రువు తగ్గవచ్చు. బరువు తగ్గించడానికి దాదాపు నెల రోజుల సమయం పడుతుంది.

కొన్ని ప్రాంతాలలో పేరుకుపోయిన కొవ్వు తీయడానికి మాత్రమే లైపోసక్షన్‌ తోడ్పడుతుంది. మొత్తం లావుగా ఉండి బరువు ఎక్కువ ఉంటే ‘‘బేరియాట్రిక్‌ సర్జరీ’’ చేయించుకోవాలి. శస్త్రచికిత్స జరిగిన తరువాత ఆ ప్రాంతంలో తప్పకుండా ‘‘ప్రెజర్‌ గార్మెంట్స్‌ ’’ను వాడాలి. ఈ ప్రెజర్‌ గార్మెంట్స్‌ను వాడటం వల్ల చర్మం క్రింద కొవ్వు తీసివేసిన ఖాళీప్రదేశం భాగం తగ్గిపోయి చర్మం కండరాలికి అతుక్కుం టుంది. శస్త్రచికిత్స తరు వాత కనీసం ఒక వారం విశ్రాంతి తీసుకోవాలి. కదలికలు ఉన్న ఉద్యోగం చేసేవాళ్లు ఎటువంటి పరిస్థితుల్లో తీసుకుతీరాల్సిందే. ప్రెజర్‌ గార్మెంట్స్‌ వాడకుండా, విశ్రాంతి తీసుకోకుండా కదలి లున్న పనికి వెళ్ళే వారిలో శస్త్రచికిత్స చేసిన ప్రాంతంలో, చర్మం క్రింద ఇన్‌ఫెక్షన్‌ వచ్చే ప్రమాదముంది.
కడుపు, ఆహార నాళ ప్రాంతంలో కొవ్వుని తీసినప్పుడు, డయాబెటిస్‌లో లైపోస క్షన్‌ చేసినప్పుడు ఇన్సులిన్‌ డోస్‌ని తగ్గించాలి. లైపోసక్షన్‌ చేసిన ఫలితాలు మనం తీసుకునే ఆహారం, చేసే వ్యాయామంబట్టి ఉంటాయి. డైటీషన్‌ చెప్పిన ప్రకారమే ఆహారంలో కొవ్వుని పిండిప దార్థాల్ని తగ్గించడంతో బాటు కేలరీలు తగ్గించడానికి వీలుగా శారీరక వ్యాయామం, మానసిక వ్యాయామం కూడా చేయాలి.కొన్ని ప్రాంతాలలో మాత్రమే కొవ్వు పేరుకుపోయినప్పుడు లైపోసక్షన్‌ సరియైన మార్గం. ఇంతకుముందు చెప్పినట్లుగానే చాలా సురక్షితం కూడా. మంచి ఫలితాలు కనిపిస్తాయి. కాక పోతే అనుభవం ఉన్న వారితోనే లైపోసక్షన్‌ చేయించుకోవాలి.ఈ విష యాలు విన్న మిత్రుడు లైపోసక్షన్‌ చేయించుకున్నాడు. పొట్ట, తొడల ప్రాంతంలో కొవ్వు తగ్గడంతో అందంగా కనిపిస్తు న్నాడు. ఆరోగ్యంగా ఉన్నాడు.

Post a Comment

0 Comments