Full Style

>

షుగర్ కంట్రోల్ ఎలా…


డయాబెటిస్ అనేది తీవ్ర అనారోగ్య సమస్య అయింది. ప్రపంచవ్యాప్తంగా షుగర్ వ్యాధి రోగుల సంఖ్య పెరుగుతోంది. నయం చెయ్యడం కుదరని ఈ వ్యాధిని నియంత్రించాల్సి వుంటుంది. అలా నియంత్రించేందుకు కొన్ని చిట్కాలు
  • ప్రతిరోజు ఒక స్పూన్ మెంతులు ఒక గ్లాస్ నీళ్లలో వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం లేవగానే ఆ నీళ్ళు తాగి, నానిన మెంతులు తింటే అది ఇన్సులిన్‌లా పనిచేస్తుందంటారు.
  • ప్రతిరోజు ఉదయం క్రమం తప్పకుండా విత్తనాలు తీసేసిన కాకరకాయ రసాన్ని తాగాలి.
  • పచ్చి అరటిపండు పైతొక్క తీసి ఒక పాత్రలో వేసి దానిమీద నీళ్ళు పోసి రాత్రంతా వుంచి తెల్లవారిన తర్వాత ఆ నీటిని మూడు భాగాలు చేసి పగలు మూడుసార్లు తాగాలి.
  • ఒక కప్పు నీళ్ళలో మామిడి ఆకులు 13 నుండి 16 వేసి బాగా మరిగించి, రాత్రంతా చల్లారనిచ్చి ఉదయం వడకట్టి ఆ నీటిని పరగడుపున తాగాలి.
  • వెల్లుల్లి తినాలి లేదా వెల్లుల్లి కలిగిన మాత్రలు సేవిస్తే షుగర్ వ్యాధి అదుపులో వుంటుంది.
  • లేత మునగాకుని కూరలా వండుకుని తింటే శరీరానికి పట్టిన నీరు తగ్గుతుంది. చిన్నపిల్లలకి రాత్రిళ్లు పక్కలో మూత్రం పోసే అలవాటు ఉంటే, ఈ కూర పెట్టడం మంచిది.
  • రక్తంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంటే కరక్కాయ చూర్ణాన్ని ప్రతిరోజూ క్రమం తప్పక తేనెతో తీసుకోవడం మేలు.
  • షుగరు వ్యాధి ఉన్నవారు ప్రతిరోజూ పరగడుపున వేపాకురసం అరగ్లాసు తీసుకుంటే షుగర్ తగ్గుతుంది. అలాగే నేరేడు చెక్కను కాల్చి ఆ పొడి భద్రపరచుకుని రోజూ పరగడుపున ఓ చెంచా ఒక గ్లాసు నీళ్లతో కలిపి తాగితే షుగరు తగ్గుతుంది.
  • మునగచెట్టు వేరును బాగా దంచి రసం తీసి దానిలో తేనె కలిపి పాలతో తాగిస్తే వాతపు నొప్పులు తగ్గుతాయి.

Post a Comment

0 Comments