గొంతులో గురగుర , ఊపిరితీసుకోవడం లో ఇబ్బందులు సాధారణ జలుబులో సామాన్యం గా కనిపింఛే లక్షణాలు . ఉప్పునీటితో గార్గిల్ చేయడం వల్ల ఈ లక్షణాల నుంచి ఉపశమనం కలుగుతుంది . ఇలాచేస్తే గొంతుతో మండే టిష్యూలకు ఉపశమనం కలుగుతుంది . చిక్కని మ్యూకస్ను కూడా పల్చబరుస్తుంది . ఎలర్జెన్స్ , బాక్టీరియా , ఫంగి వంటి వాటిని గొంతునుండి ఉప్పునీరు తొలగిస్తుంది .
ఆరోగ్యవంతమైన వలంటీర్లపై జలుబు , ఫ్లూ సీజన్ లో 60 రోజులు పాటు పరిశోదనలు సాగించారు . క్రమము తప్పకుండా రోజుకు మూడుసార్లు ఉప్పునీటిని గార్గిల్ చేసే వారిలో ... మిగతారితో పోల్చితే 40 శాతం అప్పర్ రెస్పిరేటరీట్రాక్ ఇన్‌ఫెక్షన్ తక్కువగా ఉన్నట్లు గుర్తించారు . ఉప్పునీటితో పిక్కిలించడం వల్ల బ్రోంకైటిస్ లక్షణాలు గణనీయం గా తగ్గాయి . ఓ గ్లాసు గోరువెచ్చని నీటిలో అర టీస్పూన్ ఉప్పువేసి కలిపి కొద్ది సెకనులు గొంతులో పట్టి పుక్కలించి నీటిని ఊసెయ్యాలి . ఇలా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి . దగ్గు , గొంతులో మంట గల పెద్దవాళ్ళు గోరువెచ్చ్ని నీటిలో ఉప్పుతో పాటు నిమ్మరసం , తేనె కలుపుకొని గార్గిల్ చేయాలి . ఉప్పు తక్కువైతే ఆ నీటిని బయటికి ఊసేయాల్సిన అవసరం లేదు . . . మింగేయవచ్చును . బి.పి. ఉన్నవాళ్ళు ఉప్పునీటిని మింగకూడదు .
0 Comments