Full Style

>

Proteins,మాంసకృత్తులు



మాంసకృత్తులు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


శరీరంలోని ప్రతీ కణం మాంసకృత్తుల మీద ఆధారపడుతుంది. మాంసకృత్తులు కండరాలకు, ప్రతీ అంగానికి గ్లాండ్స్ కు అన్నీటికీ బిల్డింగ్ బ్లాక్స్ అన్నమాట. శారీరక నిర్మాణానికి మాంసకృత్తులు చాలా అవసరం. మాంసకృత్తులు (ప్రోటీన్స్) శరీర అవయవాల నిర్మాణ కార్యక్రమాన్ని, శక్తిని వినియోగించుటకు చాలా అవసరమైనవి. మాంసకృత్తులు శరీర నిర్మాణానికి, పెరుగుదలకు ముఖ్యంగా పిల్లలలోను కౌమారదశలోను చాలా ఉపయోగకరం. పెద్దవయస్సు లేక వృద్ధులలో మాంసకృత్తుల సహాయం చాలా అవసరం . పెద్దగా దెబ్బలు తగిలినా అవి మానిపోవడానికి సహాయపడుతుంది.

మాంసకృత్తులు జీవుల శరీర నిర్మాణంలో ముఖ్యమైన పదార్ధాలు. మాంసకృత్తులని ప్రాణ్యములు అనీ, లేదా ప్రోటీన్‌లు (Proteins) అనీ కూడ పిలుస్తారు. గ్రీకు భాషలో protos అంటే 'ముఖ్యమైనది' అనే అర్ధం వస్తుంది. సంస్కృతంలోనూ, తెలుగులోనూ ప్రాణ్యాక్షరాలు అంటే ముఖ్యమైన అక్షరాలు - లేదా - అచ్చులు అనే వాడుక ఉంది. భాష కట్టడికి అచ్చులు ఎంత ముఖ్యమో శరీర నిర్మాణానికి అంతే ముఖ్యమయిన ఈ రసాయనాలని 'ప్రాణ్యములు' అనటం సముచితం. పోషక పదార్ధాలయిన ఈ ప్రాణ్యములు మాంసంలో ఉంటాయి, పప్పులలో ఉంటాయి, పాలల్లో ఉంటాయి - ఆఖరికి చిన్న చిన్న మోతాదులలో బియ్యంలోనూ, గోధుమలలోనూ కూడ ఉంటాయి.
గర్భవతులు, బాలింతలు మాంసకృత్తులను అధికంగా తీసుకోవటం చాలా అవసరం. ఇవి బిడ్డ పెరుగుదలకు ఎంతో తోడ్పడుతాయి .

చరిత్ర

కర్బన రసాయనం (organic chemistry), జీవ రసాయనం (biochemistry) దరిదాపుగా ఒకే సారి పుట్టేయనవచ్చు. సర్వసాధారణంగా వేడి చేసినప్పుడు ఘన పదార్ధాలు కరిగి ద్రవ రూపం చెందుతాయి. మంచు కరిగి నీరు అవుతుంది. వెన్న కాచితే నెయ్యి అవుతుంది. కాని కోడి గుడ్డుని కొట్టి సొనని పెనం మీద వేస్తే గట్టిపడుతుంది. రక్తాన్ని వేడి చేస్తే గడ్డ కడుతుంది. పాలని ఇగరబెడితే కోవా అవుతుంది. అంటే కొన్ని పదార్ధాలు వేడి చేస్తే కరుగుతాయి, కొన్ని వేడి చేస్తే పేరుకుంటాయి. ఇలా వేడి చేస్తే పేరుకునే పదార్ధాలకి సొనలు (albumins) అని పేరు పెట్టేరు. సొనల మీద పరిశోధన సాగిన కొత్తలో సొనలలో ఒక కొత్త రకం రసాయనం పదే పదే కనిపించటం మొదలయింది. దానిని విశ్లేషించి చూడగా దాని సాంఖ్యక్రమం (empirical formula) C40H62O12N10 అని తేలింది. అంటే ఒక బణువు (molecule)లో 40 కర్బనపు అణువులు, 62 ఉదజని అణువులు, 12 ఆమ్లజని అణువులు, 10 నత్రజని అణువులు ఉన్నాయన్న మాట. సొనలన్నిటిలోనూ తారసపడుతూన్న ఈ పదార్ధం కర్బనోదకం (carbohydrate) కాదు, కొవ్వు (fat) కాదు - ఎందుకంటే కర్బనోదకాలలోనూ, కొవ్వులలోనూ నత్రజని (nitrogen) ఉండదు. ఈ సొనలలో నత్రజని కనిపిస్తోంది. అంతే కాదు. ఈ కొత్త రకం బణువులు చాల పెద్దవిగా కూడ కనిపిస్తున్నాయి. ఇదేదో ముఖ్యమైన పదార్ధం అయి ఉండాలనిన్నీ, జీవి యొక్క జన్మ రహశ్యం మూడొంతులు ఇందులో ఇమిడి ఉండొచనిన్నీ ఊహించి బెర్‌జీలియస్‌ (Berzelius) దీనికి ప్రోటీన్‌ (అంటే, ముఖ్యమైనది) అని నామకరణం చేసేరు. బెర్‌జీలియస్‌ ఊహించినట్లుగా ఈ ప్రాణ్యం మన మనుగడకి చాల ముఖ్యమయిన పదార్ధం అని తేలింది. కాని, బెర్‌జీలియస్‌ అనుకున్నట్లు జీవి యొక్క రహశ్యం ఈ బణువులో లేదని కూడ తేలింది. ఆ గౌరవం DNA అనబడే మరొక బృహత్ అణువుకి దక్కింది.


ఆహారంలో మాంసకృత్తులు ఎంతవరకు తీసుకోవాలి :
* మాంసాహారులకు లభించే మాంసకృత్తులు, అధిక శాతం మరియు నాణ్యమైన అవసరమైన అమైనో ఆమ్లాలను తయారుచేస్తుంది.

* శాఖాహారం తీసుకొనే వాళ్ళు తమకు సరిపడా మాంసకృత్తులను పప్పు ధాన్యాలు, పాలు, గుడ్డు నుంచి పొందవచ్చు.
* ఎక్కువ శాతం మాంసకృత్తులు నూనె గింజలు, పప్పులు ,పందిరి చిక్కుళ్ళు, పాలు, పాలతో తయారైన పదార్ధాలు ,జంతు మాంసము, చేపలు, కోడిమాంసము ద్వారా లభిస్తాయి.
* వృక్షాల ద్వారా లంభించే ఆహారంలో సొయాబీన్స్ లో చాలా ఎక్కువ శాతంలో అంటే 40% కన్నా ఎక్కువగా మాంసకృత్తులు ఉంటాయి.

*16–18 సంవత్సరాల మధ్య వయస్సు గల 57 కే.జీల బరువు బాలురకు రోజుకు 78 గ్రాముల మాంసకృత్తులు అవసరం.
* అదే విధంగా 16 – 18 సంవత్సరాల మధ్య వయస్సు గల 50 కే.జిల బరువు బాలికలకు రోజుకు 63 గ్రాములు అవసరం.
* గర్బవతికి రోజుకు 65 గ్రాములు ఒక రోజుకు
* పాలిచ్చే తల్లులకు/బాలింతలకు 6 నెలల వరకు 75 గ్రాములు 1 రోజుకు

ఆహార పదార్ధాలు ప్రతి 100 గ్రాములకు లభించే మాంసక్రత్తులు /గ్రాముల్లో
సోయాబీన్స్ --------------------------------43.2
శెనగ పప్పు, పప్పు, మినపప్పు, పెసరపప్పు ఎర్ర పప్పు, కందిపప్పు -- 22
వేరుశెనగపప్పు, బాదం పప్పు,జీడిపప్పు ----------------23
చేపలు --------------------------------20
మాంసము --------------------------------22
ఆవు పాలు --------------------------------3.2
గేదె పాలు --------------------------------4.3
కోడిగుడ్డు ( సుమారు 44 గ్రాములు) ----------------13.3 (ఒక గుడ్డుకు)

మనం తినే ఆహారంలో ప్రోటీన్లు ముఖ్యంగా ఉండవలసిన పోషక పదార్ధాలు. నాణ్యతని బట్టి రెండు వర్గాలుగా విడగొడతారు. ప్రధమ శ్రేణి ప్రోటీన్లు మాంసం, చేపలు, గుడ్లు, పాలు, మొదలైన జంతు సంబంధమైన వనరులనుండి లభిస్తాయి. వీటిని ప్రధమ శ్రేణి అని ఎందుకు అన్నారంటే వీటన్నిటిలోనూ అత్యవసర నవామ్లాలు (essential amino acids) తప్పకుండా ఉంటాయి. మాంసాహారులు ఏ ఒక్క మాంసం తిన్నా అది సంపూర్ణ ఆహారంగా చెలామణీ అయిపోతుంది. ద్వితీయ శ్రేణి ప్రోటీన్లు- పప్పులు, కాయగూరలు, మొదలైన వాటిలో దొరికేవి. వీటిలో, ఏ ఒక్క దాంట్లోనూ, అత్యవసర (9)నవామ్లాలు అన్నీ లభించవు. కనుక శాకాహారులు నాలుగు రకాల వస్తువులు ఒకే భోజనంలో తింటే తప్ప నవామ్లాలన్నీ సరఫరా కావు. పక్కా శాకాహారులు (pure vegetarians or vegans) - అంటే జంతు సంతతికి చెందిన పాలు, వగైరాలు కూడ ముట్టని వారు - పోషణ విషయంలో అప్రమత్తతతో ఉండాలి. పప్పు, అందులో నెయ్యి, కూర, పచ్చడి, పులుసు, పాలు, పెరుగు, మజ్జిగ మొదలయిన హంగులన్నీ ఉంటే కాని శాకాహారం సంపూర్ణం కాదు.

మనం మాంసం తిన్నా, పప్పు, అన్నం తిన్నా అవి తిన్నగా రక్తంలో ప్రవేశించవు. మనం తిన్న పోషక పదార్ధాలలో ఉన్న సారాన్ని గ్రహించి, దాన్ని ముడి పదార్ధంగా వాడి శరీరం తనకి కావలసిన ప్రాణ్యములని తనే తయారు చేసికొంటుంది. చాలా వరకు సూక్ష్మజీవులు, మొక్కలు అన్ని నవామ్లాలని తయారుచేసుకోగలవు. కాని జంతువులు మాత్రం వీటిలో కొన్నింటిని ఆహారం ద్వారా తీసుకోవలసి ఉంటుంది. ఈ అత్యవసర నవామ్లాలు కొన్నింటిని, అవసరం కొద్దీ , తినే ఆహారంతో తప్పకుండా తీసుకోవాలి.


మనిషి శరీరానికి 22 రకాల అమీనో ఆమ్లాల కలబోతతో తయ్యారైన ప్రొటీను అవసరము .
రెండు రకాల అమీనో ఆమ్లాలు - అత్యవసరమైనవి(essential amino acids), అత్యవసరం కానివి (Non-essential amino acids). అవసరమైనవి శరీరం తయారు చేకోలేదు . వీటిని పౌష్టికాహారం ద్వారా పొందాల్సిందే. నాన్ ఎసన్షియల్ అమీనో ఆంమ్లాలు శరీరం తయారు చేస్కుంటుంది .

ప్రొటీనుల్లో రెండు రకాలు -
పూర్తి ప్రొటీను (కంప్లీట్ ప్రొటీన్లు ) - ఎసన్షియల్ అనగా అవసరమైన అమీనో ఆంమ్లాలు కలిగినవి. గుడ్లు, పాలు, చేపలు, మాంసం, ఇత్యాదివాటి నుండి పొందవచ్చు
అసంపూర్ణ ప్రొటీను(incomplete) - కావల్సిన అమీనో ఆంమ్లాలన్నీ లేనిది. పండ్లు, కాయగూరలు, ఆకుకూరలు, పప్పులు లాంటివి.

ఇది గమనించండి - బరువు తగ్గే మార్గంలో ప్రొటీను ఎక్కువ కేలరీలలో తింటుంటే అది మూత్రపిండాలపై తీవ్ర ప్రతాపం చూపుతుంది .

మంచి ప్రొటీన్ మూలాలు -
బందికానాలో పెరగని కోళ్ళు- వాటి గుడ్లు,
హార్మోనులు ఇవ్వకుండా, యాంటి బైయాటిక్స్ ఇవ్వకుండా, సాధారణ స్థితుల్లో గడ్డి గాదెం తింటూ పెరిగిన వాటినుండి వచ్చిన మాంసం,
పాశ్చరైజ్ చేయని ముడి పాల ఉత్పత్తులు,
సముద్రంలో సహజమైన కండీషన్స్ లో పెరిగే మెర్కురీ లేని చేపలు,
మొలకెత్తిన విత్తనాలు,
బీన్స్,
ముడి ధాన్యాలు,

మరి బ్యాడ్ ప్రొటీన్ అనగానేమీ?
వ్యవసాయాధారిత పరిశ్రమల ఉత్పత్తులు పై గుడ్ ప్రొటీన్ ని బ్యాడ్ ప్రొటీన్ గా మారుస్తాయి.

ఉదహరణ -
ఒక ఎకరాకి పది జీవాలని పెంచవససిఉంటే , వంద జీవాల్ని కట్టేసి హార్మోన్స్ ఇచ్చి, అసహజ పద్ధతుల ద్వరా ఉత్పత్తి చెసే మాంసాహారాలు తక్కువ క్వాలిటీ ప్రొటీనుతో ఉంటాయి .

బంధికానాలో పెంచబడే కోళ్ళు, సహజసిద్ధమైన ఆహారం పెట్టకుండా పెంచినవి. తక్కువ ప్రదేశంలో ఎక్కువ పెంచితే అనారోగ్యాలతో ఉంటాయి అవి, కలుషిత ఆహారంగా మారతాయి.

మ్యాక్ డోనాల్డ్స్, కేయఫ్సి లాంటి పెద్ద పెద్ద కంపెణీలు అత్యంత హేయమైన కండీషన్స్ లో మాంసాన్ని ఉత్పత్తి చెస్తాయి.

ఫాం రైజ్ద్ చేపలు అసహజ వతావరణంలో పెంచబడినవాటిల్లో ఒమెగా-3 ఎసన్షియల్ ఫ్యాటీ ఆంలం అతి తక్కువ లేక అస్సలు లేకపోవతం కూడా జరుగుతుందట

Post a Comment

0 Comments