ఊరికూరికె వాదనలకు దిగుతుణ్టారు అని మన చుట్టూ ఉన్నవారు అంటున్నారంటే అది మనకో హెల్త్ సర్టిఫికేట్ కింద లెక్కే. ఇలా వాదించే తత్వము మేలుచేస్తుందని మిచిగాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెప్తున్నారు . ఏ అంశాన్ని అయినా మౌనంగా చూస్తూ భరించడం మానసికంగా మేదనకు గురిచేస్తుంది . ఎదురుగా కనిపించే అంశాలకు బాగా స్పందించి వాదించే వారు బాగా రిలాక్ష్ అవుతారు . నచ్చని లేదా నచ్చిన అంశాలపై మౌనం గా సర్దుకుని ... మనస్సు లో మధనపడడం కంటే ఇలా వాదించేవారు ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు
వాదన జోలికి వెళ్లకుండా తప్పించుకునేవారు సదరు విషయాన్ని బుర్రనుంచి తప్పించలేరు . . . ఆలోచిస్తూనే ఉంటారు అటువంటివారికి అధిక రక్తపోటు , కార్టిసాల్ స్థాయిలు పెరగడం వలన నిద్రలోపాలు కలుగుతాయి . మనసుకు నచ్చకపోయినా వాదన ఎందుకులే అని తోసిపుచ్చుకుపోయే వారిలోతీవ్ర అనారోగ్య పరిణామాలు కొంతకాలములో తప్పవని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తూ ఉన్నారు . చెప్పదలచుకున్న విషయాన్ని అభిప్రాయాల్ని చెప్పేసినవారు తేలికపడిన మనస్సుతో హాయిగా ఉంటారు . ఫలితము గా రక్తపోటు , మానసిక వత్తిడి , నిద్రలేమి లకు దూరముగా ఉండవచ్చును .

0 Comments