Full Style

>

జ్వరం వస్తే.. ఏం తినాలి? ఏం తాగాలి?

జ్వరం వచ్చినప్పుడు ఏమవుతుంది? శరీరంలో జీవక్రియల వేగం పెరుగుతుంది. దీంతో ఒంట్లో వేడి, బడలిక ఒక్కసారిగా పెరిగి పోతాయి. ఫలితంగా శక్తి వనరులు, పోషకాల అవసరం పెరుగు తుంది. చెమట ఎక్కువగా పట్టి ఒంట్లో నీరు తగ్గటమే కాదు. మాంసకృ త్తులూ తగ్గిపోతాయి. కాబట్టి జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ద అవసరం.
నిజానికి జ్వరం వచ్చినపుడు ఏ ఆహారం తీసుకోవాలనే దానిపై ఎన్నో అపోహలున్నాయి. అన్నం తినకూడదనీ, పప్పు కూరలూ వేసుకోవద్దనీ, పెరుగు తినొద్దనీ.. ఇలా రకరకాల అనుమానాలతో అన్నింటినీ దూరంగా పెట్టి, కేవలం బ్రెడ్డూ, పాలే తీసుకుంటూ గడిపేస్తారు. మరీ ఇంతగా ఆహార నియమాలేం అవసరం లేదు. కాకపోతే , కొన్ని జాగ్రత్తలు తీసు కోవటం తప్ప నిసరి. అవే మిటో చూద్దాం.
  • కాసింత చప్పగా ఉండి , తేలికగా జీర్ణమవుతూ మెత్తగా వుండే ఆహారం తీసుకోవడం మంచిది. జ్వరం బారిన పడిన వారికి కేవలం ద్రవాహా రాల్నే ఇస్తూండటమూ సరికాదు. ఒకట్రెండు రోజుల పాటు ఇలాంటి ఆహారం ఇచ్చినా ఆ తర్వాత మామూలుగా ఘనాహారం ఇవ్వటం మేలు.
  • అధిక శక్తినిచ్చే ద్రావాహారం, విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.
  • మాంసకృత్తుల్ని అధిక మోతాదుల్లో పొందటానికి పాలపొడి, చికెన్‌, మటన్‌ సూప్‌ వంటివి తీసుకోవచ్చు.
  • ఉప్పువాడవద్దనే అనుమానాలేం అక్కర్లేదు. ఏ ఆహార పదార్థాలు తీసుకున్నా తగినంత ఉప్పు వేసుకోవచ్చు. పళ్లరసాలు, పాలల్లో ఉప్పు సరిపోయినంత అందుతుంది.
  • జ్వరం వచ్చినపుడు శరీరానికి విటమిన్లు ఎ.సి.బి.కాంప్లెక్స్‌ల అవసరం పెరుగుతుంది. మనకు ఆహారం ద్వారా లభించే విటమిన్లు సరిగ్గా ఒంట బట్టకుండా కొన్ని రకాల యాంటీబయాటిక్స్‌ మాత్రలు అడ్డుకునే అవకాశం ఉంది. అందుకని కొంతకాలం పాటు విటమిన్‌ సప్లిమెంట్లూ తీసుకోవడం మంచిదే.
  • ప్రతిరోజు 2,3 లీటర్ల ద్రవ పదార్థాల్ని తీసుకోవచ్చు. ఇవి మంచినీరైనా కావచ్చు. మజ్జిగ., పండ్లరసాల వంటివి కావచ్చు.
  • పచ్చికూరగాయలు, క్యాబేజీ, బీన్స్‌ , బెండకాయలు, కాకరకాయ వంటి కూరలు, పచ్చళ్ళు, మసాలాలు, వేపుళ్ళు, చాక్లెట్లు, కేకులు, నెయ్యి, ఐస్‌క్రీములు, బిర్యానీ, పలావు లాంటి నూనె /కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకోకూడదు.
  • జ్వరం బారిన పడ్డవారు కొద్ది మోతాదుల్లో తరచుగా అంటే కనీసం రెండు గంటలకొకసారి ఏదైనా ఆహారం ,ద్రవాహారం తీసుకోవటం మంచిది.

Post a Comment

0 Comments