Full Style

>

ఐస్‌క్రీము ఆరోగ్యానికిచేటు

చాలామంది చిన్నారులు ఎంతో ఇష్టంగా, ఆత్రంగా ఐస్‌ప్రూట్స్‌, ఐస్‌ కాండీలు, ఐస్‌క్రీమ్‌, కోనులు మొదలైనవి తింటూ వుంటారు. మరికొంతమంది ఐస్‌ ముక్కలను నోట్లో వేసుకుని చాలా సమయం ఆడు తుంటారు . ఈ విధంగా ఐస్‌ ముక్కలను నోట్లో వుంచుకోవడం వలన చాలా రకములైన నోటి వ్యాధులు వస్తాయి. చాలా మంది పిల్లలు ప్రిజ్‌లోని ఐస్‌ ముక్క లను నోట్లో వేసుకోవడం తినటం జరుగుతుంది.
అదే విధంగా ఆడుకోవటం చేస్తారు. నోటోని సున్నితమైన చర్మం ఓరల్‌ మ్యూకస్‌ మెంబ్రెన్‌) పలుచగా ఉండి జీవకణాలను కప్పి కాపాడుతూవుంటుంది. 
అలాగే మన శరీర ఉష్ణోగ్రత కూడా 98.4 డిగ్రీల ఫారన్‌ హీట్‌కు ఎక్కువ కాకుండా ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రతకు, ఒక నిర్దిష్ట శీతలానికి తట్టుకునే విధంగా జీవకణం నిర్మాణం అమరి ఉంటుంది. ఈ పరిస్థితిలో చిన్నారులు నోట్లో ఐస్‌ క్యాండీలను, ఐస్‌ముక్కలను ఉంచుకోవటం వలన నోట్లోని జీవకణాలలోని సెమీసా లిడ్‌గా ఉండే జీవపదార్థం గడ్డకట్టి, వాటి విధి నిర్వహణలో వైఫల్యానికి దారితీయటం, ఎక్కువసేపు అదే పరిస్థితి కొనసాగితే జీవపరిమాణాలు జీవాన్ని కోల్పోవడం జరుగుతుంది. 
తద్వారా మనకు నోటిచర్మం ఒరుసుకు పోయి తెల్లగా పాలిపోయినట్లు ఉంటుంది. ఈ స్థితిలో మనం ఏ ఆహారం తీసుకున్నా నోరంతా మండుతుంది. రుచి తెలియదు. కొన్ని పరిస్థితుల్లో నోట్లో పుండ్లు (అల్సర్స్‌ కూడా ఏర్పడతాయి. దీనికి తోడు బ్యాక్టీరియా చేరి వ్యాధిని మరికొంత ఉధృతం చేస్తాయి. త ద్వార గొంతునొప్పి, టాన్సిల్స్‌ వాపు వచ్చి వ్యాధిగ్రస్థమౌతాయి. వ్యాధి ముదిరితే దగ్గు, జలుబు, జ్వరం, తలనొప్పి, ఈ విధంగా రోజురోజుకు వ్యాధి ముదిరి మాట్లాడలేని స్థితి, ఆహారం మింగలేక, గాలిపీల్చుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది.

Post a Comment

0 Comments